వైఎస్‌ జగన్‌కి అండగా ప్రవాసాంధ్రులు

30 Oct, 2018 19:42 IST|Sakshi

లండన్‌ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన దాడిని లండన్‌లోని వైఎస్సార్‌సీపీ యూకే అండ్‌ యూరప్ గ్రూపు సభ్యులు ఖండించారు. ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేఖతను, జననేత జగన్ పాదయాత్రలో ఆయనకు వస్తున్న మద్ధతును చూసి, వచ్చే ఎన్నికల్లో తమ ఓటమి తప్పదు అని ఏం చేయాలో అర్ధంకాక చివరకు జగన్ ని హత్య చేయాలనే దారుణానికి సీఎం చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు దిగజారిపోయారని మండిపడ్డారు. హత్యారాజకీయాలు చేయడం నిజంగా సిగ్గుచేటు అని, తక్షణమే ఈ హత్యాయత్నం మీద సీబీఐ దర్యాప్తు జరిపించాలని దోషులను కఠినంగా శిక్షంచాలని డిమాండ్‌ చేశారు.

అలాగే జగన్‌కి తోడుగా తాము ఎప్పుడు ఉంటామని వైఎస్సార్‌సీపీ యూకే అండ్‌ యూరప్ గ్రూపు సభ్యులు పేర్కొన్నారు. దాడిని ఖండిస్తూ నల్లదుస్తులు ధరించి తమ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యూకే అండ్‌ యూరప్ గ్రూపు సభ్యులతోపాటూ ఇతర ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు