టాటా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

7 May, 2019 13:35 IST|Sakshi

న్యూయార్క్‌ : తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌ (టాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదానం శిబిరానికి భారీ స్పందన లభించింది. సేవా కార్యక్రమాల్లో భాగంగా న్యూయార్క్‌ టాటా టీమ్ హప్పాగేలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి రక్తదాతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో 100 మంది టాటా సంస్థ సభ్యుల కుటుంబాలు పాల్గొన్నాయి. వారి నుంచి 55 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. టాటా రీజనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మల్లిక్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటైంది. ప్రతి ఒక్కరు రక్తాన్ని దానం చేయాలని మల్లిక్‌ రెడ్డి కోరారు. శిబిర ఏర్పాటుకు సహకరించిన డాక్టర్‌ పైళ్ల మల్లారెడ్డి( టాటా ఆడ్వేజరీ కౌన్సిల్‌ చైర్మన్‌), విక్రమ్‌ రెడ్డి (టాటా ప్రెసిడెంట్‌), టాటా సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో ఆర్‌వీపీ మల్లిక్‌ రెడ్డి, రంజిత్‌ క్యాతమ్‌, శరత్‌ వేముగంటి, సహోదర్‌ పెద్దిరెడ్డి, ఉషా మన్నెం, పవన్‌ రవ్వ, మాధవి సోలేటి, శ్రీనివాస్‌, రఘురాం పన్నాల, రమ వనమ, ప్రహ్లాద్‌, సత్య గగ్గెనపల్లి, యోగి వనమ,  హేమంత్‌  కంచెర్ల, మౌనిక పెద్దిరెడ్డి, రవ్వ రాగిని, అనిత గగ్గెనపల్లి, త్రినాథ్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు