టీడీఎఫ్‌ కెనడా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

7 Oct, 2019 15:13 IST|Sakshi

టొరంటో : తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం(టీడీఎఫ్‌) కెనడా ఆధ్వర్యంలో నిర్వహించిన 2019 బతుకమ్మ సంబరాలు దిగ్విజయంగా ముగిసాయి. టొరంటో నగరంలోని డేవిడ్ సుజుకి స్కూల్ లో టీడీఎఫ్‌ సాంస్కృతిక విభాగం తంగేడు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించారు. కెనడాలో స్థిరపడిన సుమారు 600 మంది తెలంగాణవాదులు తమ కుటుంబాలతో సహా హాజరై ఆట పాటలతో తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు.

ఈ సంబురాలను సంప్రదాయ రీతిలో జరుపుకోవడం వల్ల విదేశాల్లో తెలంగాణ సంస్కృతిని నిలబెట్టడానికి ఎంతగా పాటు పడుతున్నారనే దానికి ఈ వేడుకలను నిదర్శనంగా చెప్పవచ్చు​. కాగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగు రంగుల బతుకమ్మలను పేర్చి తమ ఆట పాటలతో అలరించారు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. టీడీఎఫ్‌ కమిటీ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణా అభివృద్ధికి పాటు పడుతూనే, తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఫౌండేషన్ కమిటీ చైర్మైన్ గంట మాణిక్ రెడ్డి, బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్మన్ గార్లపాటి జితేందర్, అధ్యక్షులు పిణీకేశి అమిత రెడ్డి, ఉపాధ్యక్షులు మూల కవిత, పద్మ గంట, శాంత  మేడ , ప్రమోద్ ధర్మపురి, శ్రీదేవి ధర్మపురి, అతిధి పున్నం, వెంకటరమణ రెడ్డి మేడ, పిణీకేశి తిరుపతి రెడ్డి, కీసర మహేందర్ రెడ్డి, ముప్పిడి సుమన్ రెడ్డి, మూలం శ్రీనివాస్ రెడ్డి,  కోండం రవీందర్ రెడ్డి, చాడ కృష్ణ రెడ్డి, అర్షద్ ఘోరీ, కోండం పవన్ కుమార్, చింతలపని శశాంక్ తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు