సింగపూర్​లో బోనాల ఉత్సవాలు

13 Jul, 2020 11:35 IST|Sakshi

సింగపూర్: సింగపూర్​లోని అరసకేసరి శివన్ ఆలయంలో బోనాల పండుగను తెలంగాణ ఫ్రెండ్స్​ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోవిడ్​–19 వల్ల సింగపూర్​లోని తెలంగాణ ప్రజల తరఫున తాము బోనాలు ఉత్సవాలను నిర్వహించామని తెలంగాణ ఫ్రెండ్స్​ సంస్థ పేర్కొంది. కరోనా నుంచి ప్రపంచం తొందరగా బయట పడాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపింది.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మర్రి వెంకట రమణా రెడ్డి, వీరమల్ల క్రిష్ణ ప్రసాద్, బైర్నేని రావు రంజిత్ కుమార్, విక్రమ్ పటేల్ చిట్లా, అల్లాల మురళి మోహన్ రెడ్డి, మాచాడి రవీందర్ రావు, యసరవేని విజయ కుమార్, యెల్లా రామ్ రెడ్డి, కలకుంత శ్రీనివాస్ రెడ్డి, గాడిపల్లి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు