ఘనంగా బతుకమ్మ-దసరా ఉత్సవాల సన్నాహక కార్యక్రమం

30 Aug, 2018 23:32 IST|Sakshi

తెలంగాణ పీపుల్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ (టీపాడ్‌) ఆధ్వర్యంలో బతుకమ్మ-దసరా సంబరాల నిర్వహణకు సన్నాహకాలు మొదలయ్యాయి. బతుకమ్మ-దసరా ఉత్సవాలకు ముందు ప్రతియేడు జరిగే ‘ఉత్సవ సన్నాహక, నిధుల సమీకరణ కార్యక్రమం’ ఈ సంవత్సరం కూడా జరిగింది. ఆగస్టు 18 మినర్వా బాంకెట్‌ హాల్‌లో ఈ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు.2018 బతుకమ్మ-దసరా ఉత్సవాలను  అలెన్‌ ఈవెంట్‌ సెంటర్‌లో నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 13 (శనివారం) ఉదయం 11 గంటలకు ప్రారంభమ్యే రాత్రివరకు ఉత్సవాలు జరగనున్నాయి. 

కాగా, విదేశాల్లోని భారతీయులు ఎక్కువ మంది జరుపుకొనే ఉత్సవంగా బతుకమ్మ పండగా నిలిచింది. దాదాపు 12 వేల మంది పాల్గొనే ఈ వేడుకలు నిర్వహించే ఆర్గనైజేషన్లలో టీపాడ్‌ ఒకటి కావడం విశేషం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ పండగ నిర్వహిస్తోన్న టీపాడ్‌కు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. ప్రతియేడు డల్లాస్‌, టెక్సాస్‌లలో టీపాడ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పక్కనున్న ఓక్లాహోమా, కన్సాస్‌, ఆర్కాన్సాస్‌ రాష్ట్రాల నుంచి ఈ వేడుకల్లో జనం పాల్గొంటారు. ప్రతీయేడు మాదిరిగా ఈ సంవత్సరం కూడా 12 వేల మంది ఉత్సవాల్లో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.టీపాడ్‌, డల్లాస్‌ ఫోర్ట్‌ వర్త్‌ తెలుగు కమ్యూనిటీ నుంచి దాదాపు 400 మందికి రాత్రి భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కాగా, ఉత్సవ సన్నాహక కార్యక్రమానికి టీపాడ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్లు రూపా కన్నయ్యగారి, రోజా ఆడెపు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో టీపాడ్‌ ప్రెసిడెంట్‌ శ్రీని గంగాధర, బోట్‌ చైర్మన్‌ శారదా సింగిరెడ్డి, బోట్‌  ఫౌండేషన్‌ కమిటీ చైర్మన్‌ రఘువీర్‌ బండారు అతిథులకు ఆహ్వానం పలికారు. పిల్లలు అన్నమాచార్య కీర్తనలు ఆలపించగా..సరస్వతీ ప్రార్థన చేసి ఈవెంట్‌ను ప్రారంభించారు. అనంతరం భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతిపై సంతాపం తెలిపారు. వాజ్‌పేయి మరణం దేశానికి తీరని లోటు అని ఆత్మచరణ్‌ రెడ్డి (నిజామాబాద్‌ మాజీ ఎంపీ) అన్నారు.

దసరా-బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధుల సమీకరణకు  కోశాధికారి రవికాంత్‌ మామిడి, మాజీ ప్రెసిడెంట్‌ సుధాకర్‌ కలసాని, అడ్వయిజర్‌ రత్న ఉప్పలా ఆధ్వర్యంలో టీపాడ్‌ కార్యవర్గ సభ్యులు పనిచేశారు. కాగా, కార్యక్రమానికి హాజరైన ఔత్సాహికులు బతుకమ్మ-దసరా ఉత్సవాలకు భారీ గా నిధులిచ్చారు. 2 లక్షల డాలర్లు నిధులు పోగయ్యాయని టీపాడ్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించింది. ఆటా, నాటా, టాటా, తానా, నాట్స్‌, మనబడి, జెట్‌ వంటి తెలుగు సంఘాలు, టాంటెక్స్‌, ఇయాంత్‌ వంటి స్థానిక సంఘాలు 2018 బతుకమ్మ-దసరా ఉత్సవాలకు తమ మద్ధతు ప్రకటించాయి. కార్యక్రమం చివర్లో బతుకమ్మ-దసరా ఉత్సవాల సన్నాహక, నిధుల సేకరణ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ చంద్రా రెడ్డి పోలీస్‌ ఓట్‌ ఆఫ్‌ థాంక్స్‌ తీర్మానం ప్రవేశపెట్టి కృతజ్ఞతలు తెలిపారు.

టీపాడ్‌ సభ్యులు..    
టీపాడ్‌ ఫౌండేషన్‌ టీమ్‌-జానకీరామ్‌ మందాడి, ఉపెందర్‌ తెలుగు, అజయ్‌ రెడ్డి, రావు కాల్వల, రాజ్‌వర్ధన్‌ గోంధీ, మహెందర్‌ కామిరెడ్డి. బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌- పవన్‌కుమార్‌ గంగాధర, ఇందు పంచెరుపుల, మనోహర్‌ కాసగాని, మాధవి సుంకిరెడ్డి, రామ్‌ అన్నాడి, అశోక్‌ కొండల, సుధాకర్‌ కాసగాని. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ- రమణ లష్కర్‌, కరణ్‌ పోరెడ్డి, చంద్రా పోలీస్‌, సత్య పెర్కారీ, శ్రీని వే​ముల, రవికాంత్‌ మామిడి, లింగారెడ్డి ఆల్వ, సురెందర్‌ చింతల, రోజా ఆడెపు, శరత్‌ ఎర్రం, మధుమతి వైశ్యరాజు, మాధవి లోకిరెడ్డి, దీప్తి సూర్యదేవర, శంకర్‌ పరిమళ్‌. అడ్వజర్లు- వేణు భాగ్యనగర్‌, విక్రం జంగం, నరేష్‌ సుంకిరెడ్డి, జయ తెలకపల్లి, గంగా దేవర, సంతోష్‌ కోరే, అరవింద్‌ ముప్పిడి, రత్న ఉప్పల, సతీష్‌ నాగిల్ల, కల్యాణి తడిమేటి. కొలాబరేషన్‌ టీమ్‌- లక్ష్మీ పోరెడ్డి, పల్లవి తోటకూర, రోహిత్‌ నరిమేటి, అనుష వనం, నితిన్‌ చంద్ర, శిరీష్‌ గోనే, మాధవి ఓంకార్‌, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివాకర్ల, కవిత బ్రహ్మదేవర, అనురాధ మేకల, సునీత, నితిన్‌ కొరివి, శశిరెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి, మాధవి ఓంకార్‌, సుగత్రి గూడూరు, మాధవి మెంట, లావణ్య యరకల, ధనలక్ష్మీ రావుల, మంజుల రెడ్డి ముప్పిడి, శాంతి నూతి, శ్రీనివాస్‌ కూటికంటి మొదలగు వారు ఈవెంట్‌లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు