స్కాట్లాండ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

14 Apr, 2018 09:46 IST|Sakshi

సాక్షి, ఎడింబరో : స్కాట్లాండ్లోని తెలుగు ప్రవాసులు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్కాట్లాండ్ తెలుగు సంఘం(టాస్) ఆధ్వర్యంలో శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్ 7న ఎడింబరోలోని డల్కిత్ హై స్కూల్ ప్రాంగణం ఆడిటోరియంలో వైభవంగా జరిగాయి. టాస్  కార్యవర్గ సభ్యులు వేడుకలకు వచ్చిన వారందరికీ ఉగాది పచ్చడి అందించి స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలనతో ఉగాది 2018 వేడుకలు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న తెలుగు వారి పిల్లలు సంస్కృతిక శ్లోకాలు, వేమన పద్యాలు పాడి, సాంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, భరతనాట్యంతో అతిథులను ఆశ్చర్యపరిచారు.
 
టాస్‌ ఛైర్మన్‌ సత్య శ్యాం కుమార్ మాట్లాడుతూ తెలుగు వారిగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవలసిన బాధ్యత మనపైనే ఉందని, అందుకు ఇలాంటి వేడుకలు వేదిక అనీ అన్నారు. టాస్ లక్ష్యాలు, భవిష్యత్‌ కార్యచరణపై వివరించారు. ఈ సందర్భంగా ఆధ్యక్షుడు నాగుబండి రంజిత్ తెలుగు భాష ప్రత్యేకతను తెలియజేసే సిలికాన్ ఆంధ్ర మనబడిలో ఎక్కువ మార్కులు సాధించిన చిన్నారులకు, బహుమతుల ప్రదానం చేశారు. స్కాట్లాండ్లోని తెలుగు వారి పిల్లలు అందరూ తెలుగు నేర్చుకోవాలని సూచించారు. జనరల్‌ సెక్రటరీ చింపిరి శివ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జాతీయ గీతం "జన గణ మణ" వందన సమర్పణతో స్కాట్లాండ్ తెలుగు సంఘం ఉగాది 2018 వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమంలోనే టాస్ నూతన కార్యవర్గ (2018 - 2020) సభ్యుల ఎన్నిక జరిగింది.
 
టాస్ నూతన కార్యవర్గం(2018 - 2020)
- జయంతి సత్య శ్యాం కుమార్ - సభాపతి (ఛైర్మన్)  
- కెంబూరి మైథిలి - ఆధ్యక్షుడు (ఫ్రెసిడెంట్) 
- చింపిరి శివ - ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రెటరి) 
- గడ్డం వెంకటేష్ - కోశాధ్యక్షులు (ట్రెజరర్)
- కుచాడి ఉదయ్ కుమార్ - సాంస్కృతిక కార్యదర్శి (కల్చరల్ సెక్రెటరి)  
- అప్పరల రవి తేజస్వి - మహిళా కార్యదర్శి (విమెన్స్ సెక్రెటరి)
- ప్రతిపటి చైతన్య - సాంకేతిక & (ఐ. టి. సెక్రెటరి)
- నూక నిరంజన్ - పౌర సంబంధాల కార్యదర్శి (పి. ఆర్ సెక్రెటరి)
- నరుకుళ్ళ రంగనాథ్ - క్రీడా కార్యదర్శి (స్పోర్ట్స్ సెక్రెటరి)
- అప్పరాల మాధవి లత - ప్రాజెక్టుల కార్యదర్శి

>
మరిన్ని వార్తలు