దక్షిణ కొరియాలో ఘనంగా దసరా వేడుకలు

28 Oct, 2018 22:06 IST|Sakshi

సియోల్‌: దక్షిణ కొరియాలో దసరా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సియోల్‌ నగరంలోని సుంగ్కీంక్వాన్ విశ్వవిద్యాలయం(ఎస్‌కేకేయూ)లో దక్షిణ కొరియా తెలుగు సంఘం(టాస్క్‌) 15వ వార్షికోత్సవంతో పాటు, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువారు హాజరయ్యారు. పూజ కార్యక్రమంతో ప్రారంభమైన వేడుకలు.. క్లాసికల్‌ డ్యాన్స్‌, పిల్లల ఫ్యాషన్‌ షో, కామెడీ స్కిట్స్‌, ఆట పాటలతో వినోదభరితంగా సాగాయి. మహిళలు అందరు కలిసి బతుకమ్మ ఆడారు.  ఈ కార్యక్రమాన్ని టాస్క్‌ కమిటీ మెంబర్లు డా​. వేణు నూలు, డా​. సుశ్రుత కొప్పుల, తరుణ్‌ కుమార్‌, డా​. అనిల్‌ కావాలా, అంకంరెడ్డి హరినారాయణ, డా​. కొప్పల్లి స్పందన రాజేంద్ర, సంసత్‌ కుమార్‌, చంద్రకళలు ఘనంగా నిర్వహించారు. కొప్పల్లి స్పందన రాజేంద్ర, అంకంరెడ్డి హరినారాయణలు వ్యాఖ్యతలుగా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు