అబార్షన్ చట్టాలకు వ్యతిరేకంగా ఐర్లాండ్‌లో భారీ ర్యాలీ

9 Jul, 2013 16:23 IST|Sakshi

ఐర్లాండ్ ప్రభుత్వం అబార్షన్‌లపై రూపొందించిన ప్రతిపాదత చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశ ప్రజలు రాజధాని డబ్లిన్ నగరవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘బిల్లును చంపండి- పిల్లలను కాదు’ అని ప్లేకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. గత ఏడాది ఐర్లాండ్‌లో నివసిస్తున్న భారత సంతతి వైద్యురాలు ఒకరు గర్భస్రావం కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అబార్షన్‌లకు అనుకూలంగా బిల్‌ను రూపొందించింది. ఈ చట్టం అమలులోకి వస్తే మహిళలకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో అబార్షన్ చేయడానికి ఐర్లాండ్‌లో అనుమతి లభిస్తుంది. క్యాథలిక్ నియమాలను పాటించే దేశంగా పేరున్న ఐర్లాండ్‌లో అబార్షన్ చేయడం చట్టవిరుద్ధం. అయితే గత ఏడాది భారత్‌కు చెందిన వైద్యురాలు సవితా గర్భస్రావంతో మరణించడంతో ప్రభుత్వం చట్టాన్ని సవరిస్తూ కొత్త బిల్లుకు రూపకల్పన చేసింది.

మరిన్ని వార్తలు