టీపీఏడీ ఆధ్వర్యంలో జరిగిన సత్కారం

5 Aug, 2019 17:25 IST|Sakshi

డల్లాస్‌ : ఇటీవల డల్లాస్‌కు విచ్చేసిన రామాచారి కోమండూరిని తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ (టీపీఏడీ) సభ్యులు ఘనంగా సత్కరించారు. గత 20 ఏళ్లుగా తెలుగు సినీ గాయకులకు శిక్షణ ఇస్తున్న గాయకుడు‌, సంగీత దర్శకుడు, శిక్షకుడు రామాచారి కోమండూరి.. అమెరికాలోని డల్లాస్‌లో పిల్లలకు తన ‘లిటిల్‌ మ్యూజిషియన్‌ అకాడమీ’ ద్వారా సంగీత తరగతులు నేర్పించడం కోసం వచ్చారు. ఇప్పటికే ఈ అకాడమీ ద్వారా అమెరికాలోని డల్లాస్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో యువతకు సంగీతం శిక్షణ అందించారు. సంసృతి, కళలను ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి శారదా సింగిరెడ్డి నివాసంలో  టీపీఏడి ఆయన్ను సత్కరించింది. టీపీఏడీ భారత సంప్రదాయాలు, ఆచారాలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే.. డల్లాస్‌ను సందర్శించే సంగీత కళాకారులు, గాయకులకు ఆహ్వానించడంతోపాటు, సహాయ సహాకారాలను అందిస్తోంది.

ఈ సందర్భంగా రామాచారి మాట్లాడుతూ.. నేటి యువతకు మన సంస్కృతి, సంప్రదామాలు నేర్పించాలనేది తన ఆశయమని, దీనికి సంగీతమే ముఖ్య సాధనమని ఈయన పేర్కొన్నారు. ఇది భాషను, ఆచారాలను తెలుసుకోడానికి ఉపయోగపడుతుందని, దీనితోపాటు ఉత్తమ నడవడికకు, క్రమశిక్షణకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. అనంతరం సంస్కృతి, సంప్రదాయాల్లో టీపీఏడీ చేస్తున్నఎనలేని కృషిని అభినందించారు. డల్లాస్‌లోని తెలుగు యువత చాలా ప్రతిభావంతులని, యువతలోని ప్రతిభను ప్రోత్సహించడంతోపాటు అవకాశాలు కల్పించడానికి టీపీఏడీ, యుఎస్ఎలోని  ఇతర తెలుగు సంస్థల నుంచి ఆయన మద్దతు కోరారు.

అజయ్‌ రెడ్డి, పవన్‌ గంగాధర, చంద్ర పోలీస్‌, రఘువీర్‌ బండారు, శారద సింగిరెడ్డి, మాధవి సుంకి రెడ్డి, సుధాకర్‌ కలసాని, రవికాంత్‌ మామిడి, శ్రీనివాస్‌ వేముల.. కోమండూరి రామాచారిని సత్కరించారు. టీపీఏడీ  సంస్థ సభ్యులు శ్రీనివాస్‌ వేముల, బుచ్చి రెడ్డి గోలి, అనురాధ మేకల, వేణు భాగ్యనగర్‌, జయ తెలకలపల్లి, ఇందు పంచేరుపుల, నరేష్‌ సుంకి రెడ్డి, రోజా ఆడెపు, మధుమతి వైశ్యారాజు, రూప కన్నయ్యగారిరి, శ్రీనివాస్‌ తుల, టీపీఏడీ ప్రారంభ రోజు నుంచి రామచారి అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వ్యక్తిగతంగా టీపీఏడీ సంస్థ చైర్మన్‌ జానకిరామ్‌ మందాడి, రావ్‌ కల్వాలా లిటిల్‌ మ్యూజిషియన్స్‌ అకాడమీ ద్వారా రామాచారి చేస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు టీపీఏడీ సురేష్‌ వస్కర్ల, శారద సింగిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. 

మరిన్ని వార్తలు