టీపాడ్‌ బతుకమ్మ వేడుకల ‘కిక్‌ ఆఫ్‌’ ఈవెంట్‌

4 Sep, 2019 22:20 IST|Sakshi

డాలస్‌ : డాలస్‌ తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో అక్టోబర్‌ 5వ తేదీన అతి వైభవంగా నిర్వహించే బతుకమ్మ, దసరా సంబరాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు.  టెక్సాస్‌ ఇర్వింగ్‌లోని కూచిపూడి ఇండియన్‌ కిచెన్‌ బాంక్వెట్‌ హాల్‌లో జరిగిన ఈ ‘కిక్‌ ఆఫ్‌’ ఈవెంట్‌కు టీపాడ్‌ అధ్యక్షుడు చంద్రారెడ్డి పోలీస్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి, అమెరికా జాతీయ తెలుగు సంస్థల, ప్రాంతీయ తెలుగు సంస్థల, తెలుగేతర సంస్థల కార్యవర్గ సభ్యులకు ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ సుధాకర్‌ కలసాని, సెక్రటరీ మాధవి లోకిరెడ్డి కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌కు సమన్వయకర్తలుగా వ్యవహరించి కార్యక్రమానికి శోభను తీసుకువచ్చారు. 

సాంఘికపరమైన బాధ్యతలో భాగంగా ఈ ఏడాది టీపాడ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలను సమన్వయకర్తలు అతిథులకు వివరించారు. మార్చిలో జరిపిన రక్తదాన శిబిరం, ఏప్రిల్‌లో ఆస్టిన్‌ స్ట్రీట్‌ సెంటర్‌లోని 450 మంది నిరాశ్రయులకు భోజన ఏర్పాటు, మే నెలలో నిర్వహించిన యాంగ్జైటీ, డిప్రెషన్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన సదస్సు, జూన్‌లో జరిపిన వనభోజనాలు, ఆగస్టులో జరిపిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ గురించిన వివరాలు తెలియజేశారు. గత ఆరేళ్లుగా కమ్యూనిటీలో జరిగే ప్రతి కార్యక్రమానికి టీపాడ్‌ సంస్థ ఏ విధంగా సహాయ సహకారాలు అందజేస్తూ.. అండగా నిలబడుతుందో అతిథులకు తెలిపారు.

అలాగే అక్టోబర్‌ 5న డాలస్‌లో టీపాడ్‌  ఆధ్వర్యంలో జరిపే బతుకమ్మ, దసరా సంబరాల ‘ఫ్లయర్‌ చిత్రాన్ని’  సంస్థ ఫౌండేషన్‌ కమిటీ చైర్‌ జానకి మందాడి, బోర్డు ఆఫ్‌ ట్రస్టీ చైర్‌ పవన్‌ గంగాధర, అధ్యక్షుడు చంద్రారెడ్డి పోలీస్‌లు కార్యక్రమానికి హాజరైన అతిథులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా పన్నెండు వేల మందికి పైగా హాజరు కానున్న బతుకమ్మ దసరా వేడుకల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను చంద్రారెడ్డి, జానకి మందాడి, పవన్‌ గంగాధర తెలియజేశారు. అలాగే ఈ సంబరాలకు హాజరయ్యే సినిమా, జానపద కళాకారుల, రాజకీయ అతిథుల వివరాలను వెల్లడించారు.

ఈ కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌కు టీపాడ్‌ ఫౌండేషన్‌ టీమ్‌ అజయ్‌రెడ్డి, రావు కలవల, రఘువీర్‌ బండారు, మహేందర్‌ కామిరెడ్డి, బోర్టు ఆఫ్‌ ట్రస్టీస్‌ శారద సింగిరెడ్డి, ఇంద్రాణి పంచార్పుల, గోలి బుచ్చిరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ శ్రీనివాస్‌ గంగాధర, లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల, మధుమతి వ్యాసరాజు, దీప్తి సూర్యదేవర, రత్న ఉప్పల, శ్రీనివాస్‌ వేముల, లింగారెడ్డి అల్వా, అడ్వైజరీ కమిటీ రామ్‌ అన్నాడి, అశోక్‌ కొండల, వేణు భాగ్యనగర్‌, విక్రమ్‌ జంగం, జయ తెలకలపల్లి, కరణ్‌ పోరెడ్డి, కొలాబరేషన్‌ టీమ్‌ గాయత్రి గిరి, స్వప్న తుమ్మపాల, రేణుక చనుమోలు, శశి కర్రి, శ్రవణ్‌ నిడిగంటి, బాల గణపవరపు, కిరణ్‌ తల్లూరి, శ్రీనివాస్‌ తుల, విజయ్‌రెడ్డి, సత్య పెర్కారి, నీరజరెడ్డి పడిగెలలు కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌కు హాజరయి.. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములయ్యారు. 

ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన దాతలకు, కూచిపూడి కిచెన్‌ యాజమాన్యానికి, మీడియా మిత్రులకు, తానా, ఆటా, నాట్స్‌, టాటా, ఐఎన్‌టీ, టాంటెక్సస్‌, డాటా, జెట్‌, మనబడి సంస్థలకి, కమ్యూనిటీ లీడర్స్‌కి జానకి మందాడి, చంద్రారెడ్డి పోలీస్‌, సుధాకర్‌ కలసానిలు సంయుక్తంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అక్టోబర్‌ 5 డాలస్‌లోని ఆలెన్‌ ఈవెంట్‌ సెంటర్‌లో జరిగే బతుకమ్మ, దసరా సంబరాలకు ప్రపంచ నలుమూలాల ఉన్న భారతీయులందరికీ స్వాగతం పలికారు. 

మరిన్ని వార్తలు