'ఆసియాబౌండ్' వల్ల ఇరుదేశాల బంధం దృఢమవుతుంది

12 Jul, 2013 15:47 IST|Sakshi

ఆసియాబౌండ్ ప్రోగ్రామ్ వల్ల ఆస్ట్రేలియా, భారత్ దేశాల మధ్య బంధం మరింత దృఢమవుతుందని భారత్లోని ఆస్టేలియా దేశ రాయబారీ ప్యాట్రిక్ సక్కలింగ్ గురువారం న్యూఢిల్లీలో అభిప్రాయపడ్డారు. ఆ ప్రోగ్రామ్ కింద దాదాపు నాలుగు మంది తమ దేశ విద్యార్థులు భారత్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు తరలివస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఇరు దేశ ప్రజల మధ్య ఓ విధమైన మైత్రి బంధం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కేవిన్ రుడ్తోపాటు ఉన్నత విద్యాశాఖ మంత్రులు ఇటీవల చేసిన సంయుక్త ప్రకటనను ఈ సందర్భంగా ప్యాట్రిక్ గుర్తు చేశారు.

 

తమ దేశ విద్యార్థులు భారత్లో ఉన్నత విద్యకు తరలిరావడం వల్ల భారతీయ సంస్కృతి, సంప్రదాయలపై ఓ సమగ్ర అవగాహానకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆసియాబౌండ్ ప్రొగ్రాం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం 2.53 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధులు కేటాయించిందని తెలిపారు. నాలుగేళ్ల పాటు సాగే ఈ ప్రొగ్రాం కింద మొదట విడతగా 584 మిలియన్ అమెరికన్ డాలర్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఇరుదేశాల్లోని వివిధ విద్యాసంస్థల మధ్య  బలమైన బంధం కొనసాగుతున్న తీరును ప్యాట్రిక్ ఈ సందర్బంగా వివరించారు.

మరిన్ని వార్తలు