గాంధీ తత్వాలు అజరామరం : నిక్కి హేలీ

25 May, 2018 11:36 IST|Sakshi

డల్లాస్‌ : ఉత్తర టెక్సాస్‌లో ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపాన్ని ఐక్యరాజ్యసమతిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ సందర్శించారు. మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ) ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రసాద్‌ తోట కూర  నిక్కి హేలీని సాదరంగా ఆహ్వానించారు. మహాత్మా గాంధీ తత్వాలు, ఆయన ఆచరించిన నియమాలు అజరామరమని నిక్కి హేలీ కొనియాడారు. ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీలో గాంధీ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించారు. ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. మే 2014 లో సౌత్‌ కరోలినా గవర్నర్‌గా ఉన్న సమయంలో ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2014, అక్టోబర్‌ 2న అమెరికాలోనే అత్యంత ఎత్తైన గాంధీ మెమోరియల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గాంధీజీ మునిమనవడు సతీష్‌ దుపెలియా వచ్చారు. 

ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ ప్రాజెక్టు సాకారంలో ముఖ్యపాత్ర వహించిన డాక్టర్‌ ప్రసాద్‌ తోట కూర, ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ టీం, కమ్యునిటీ సభ్యులు, ఇర్వింగ్‌ నగర అధికారులను నిక్కి హేలీ అభినందించారు. ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ బోర్డ్‌ డైరెక్టర్స్‌ రావు కల్వల, కమల్‌ కౌషల్‌, జాన్‌ హమ్మాండ్‌, తయ్యబ్‌ కుందావాలా, పియూష్‌ పటేల్‌, నరసింహ భక్తుల, కుంతేష్‌ చాక్సి, శబ్‌నమ్‌ మాడ్గిల్‌, జాక్‌ గోద్వానీ, ఇర్వింగ్‌ నగర మేయర్‌ రిక్‌ స్టాఫర్‌, అలెన్‌ మీగర్‌, క్రిస్‌ హిల్‌మన్‌, పార్క్స్‌, జొసెఫ్‌ మోసెస్‌లు ఈ కార్యక్రమానికి హాజరయిన వారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు