జాతీయ సమైక్యతే దేశానికి పునాదులు

11 Oct, 2017 21:13 IST|Sakshi

వాసవి క్లబ్ ఇంగ్లాండ్

లండన్‌ :
వాసవి క్లబ్ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో లండన్లో సంఘటిత సమ్మేళనం నిర్వహించారు. కులం, మతం పేరుతో దేశంలో అశాంతికి దారితీసే పరిణామాలను మొదట్లోనే తుంచివేయాలని వాసవి క్లబ్ ఇంగ్లాండ్ సంయుక్త ప్రకటనలో తెలిపింది. మతం పేరుతో, కులం పేరుతో దూషణ సరికాదని రాజ్యాంగం ద్వారా కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరుల మనో భావాలను దెబ్బతీసే విధంగా ఉండరాదని పేర్కొంది. చరిత్రలో మంచిని స్వీకరించి సమాజ శ్రేయస్కర రచనలు చేసి జాతి ఉపయోగకరంగా ఉండాలి తప్ప, చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలను తెర పైకి తెచ్చి ప్రజల్లో గొడవలు సృష్టించే విధంగా ఉండకూడదని సూచించింది.

ఈ మధ్య  ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన పుస్తకం సమాజంలో తారతమ్యాలు తెచ్చే విధంగా, కులాల మధ్య చిచ్చు పెట్టి మానవ సంబంధాలు తెంచే విధంగా ఉన్నాయని వాసవి క్లబ్ ఇంగ్లాండ్ సభ్యులు పేర్కొన్నారు. రచనలు సమాజ శ్రేయస్కరంగా ఉండాలి తప్ప గొడవలకు ఆస్కారం కారాదని తెలిపారు. కంచె ఐలయ్య  యావత్ జాతికి బేషరతు క్షమాపణ చెప్పి తన పుస్తకాన్ని విరమించుకోవాలని వాసవి క్లబ్ ఇంగ్లాండ్ సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు ఇలాంటి సంఘ విద్రోహ చర్యలు ఎవరు చేపట్టినా తక్షణమే స్పందించి  చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. కంచె ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖ రాయాలని వాసవి క్లబ్ ఇంగ్లాండ్ శాఖ తీర్మానం చేసింది.

ఈ కార్యక్రమంలో సురేష్ ముర్కీ, మహేష్ చందా మోహన్, మధు, కృష్ణ లాలం, వెంకట కుమార్, రాజేష్ చుండూరి, నరేష్ మర్యాల, అంజి కుమార్, అరవింద్ శ్రీరామ్,  హేమకుమార్ అమృతలూరు, బాల దర, ఓం ప్రకాష్ ,గోపి అగీర్ నిర్మల్ వెచ్చం నాగేంద్ర శ్రీమకుర్తి, గంప వేణుగోపాల్, మహేష్ యంసానిలతో పాటూ పలువురు వాసవి క్లబ్ ఇంగ్లాండ్ సభ్యులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి తమ మద్దతు తెలిపారు.
 

మరిన్ని వార్తలు