సింగపూర్‌లో కుటుంబ దినోత్సవం

28 Oct, 2018 09:47 IST|Sakshi

సింగపూర్‌లో నివసిస్తున్న ఆర్యవైశ్యులు కుటుంబ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్‌) ఆధ్వర్యంలో స్థానిక పుంగోల్‌ పార్క్‌లో దీపావళి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాసవీమాత పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు అలరించారు. అనేక ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉల్లాసభరితంగా జరుపుకున్నారు. విజేతలందరికీ బహుమతులను ప్రధానం చేశారు. ఆర్యవైశ్య మహాసభ సింగపూర్‌ విభాగం అధ్యక్షులు వల్లంకొండ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులందరూ సమష్టిగా ఉండాలని, అలా ఉన్నప్పుడే వైశ్య ప్రగతి సాధించగలమని అన్నారు. వామ్‌ కార్యనిర్వాహక సభ్యులు కిరణ్‌ పట్టోరి, సతీష్‌ ఉద్దగిరి, భాస్కర్‌ నల్లా, సతీష్‌ కోట, వెంకట రమణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సింగపూర్‌ తెలుగు సమాజం కమిటీ సభ్యులు అనిల్‌, మల్లిక్‌, ప్రసాద్‌, సుప్రియ, తెలంగాణ కల్చరల్‌ సొసైటీ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌, సంతోష్‌, లక్ష్మణ్‌లు కూడా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు