మేరీ ల్యాండ్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

14 Jul, 2020 14:57 IST|Sakshi

వాషింగ్టన్‌ డి.సి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి వేడుకలు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, ఫ్రెడెరిక్ నగరం లో ఘనంగా జరిగాయి.   వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం జూలై 11వ తేదీ ఉదయం (ఇండియా కాలమానము - శనివారం రాత్రి) వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్  ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్‌ పార్థ సారధి రెడ్డి బైరెడ్డి, వెంకట్ యర్రం ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ  జయంతిని ఘనంగా జరుపుకున్నారు.

 ఈ సందర్భంగా  వారందరూ తమకు  దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారితో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దీంతో పాటు అమరావతి ఒక్కటే రాజధాని కాకుండా మూడు రాజధానులు ముద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదాలు చేశారు. మూడు రాజధానులతోనే రాష్ట్రము అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని మాట్లాడుతూ, ‘ఈ కరోనా కష్ట కాలం లో కూడా ఇంత మంది పాల్గొనడం వల్ల వైఎస్ఆర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది . ఈ రోజు వరకు కూడా పెద్దాయనను గుర్తు చేసుకుంటున్నాం అంటే ఆయన చేసిన పథకాలు ప్రజల్లోకి వెళ్లాయి అని అర్థం.  పెద్దాయన చేసిన మంచి పనులు మన పిల్లలకు కూడా గుర్తు చేసి వాళ్ళను కూడా భవిష్యత్తులో ఇలా తీర్చి దిద్దాలి’ అని అందరిని కోరారు.

చదవండి: వాషింగ్టన్‌ డి.సిలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు 

మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జ్‌ పార్థ సారధి రెడ్డి బైరెడ్డి మాట్లాడుతూ, మహానేత డాక్టర్ వైఎస్సార్  చేసిన సుపరిపాలన , పథకాలను గుర్తు చేశారు. ఈ రెండు సమంగా ప్రజల్లోకి తీసుకెళ్లినా ఘనత  కేవలం వైఎస్సార్‌కి మాత్రమే దక్కుతుంది అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబం లో ఎవరో ఒకరు అయన ప్రవేశ పెట్టిన పథకాలతో తప్పకుండా లాభం పొందారు అని గుర్తు చేశారు. అందుకే ఆయనంటే అందరికి అంత ప్రేమ అని చెప్పారు. వైఎస్ఆర్ గారి పథకాల్ని అయన కుమారుడు మళ్లీ పైకి తీసుకవచ్చి తన నవ రత్నాల్లో ఉంచి కేవలం ఒక సంవత్సరం లోనే ఎనభై శాతం పూర్తి చేయడం గొప్ప విషయం అన్నారు. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆరాధ్య దైవం, చెదిరిపోని గుండె బలం, నాయకత్వానికి నిలువెత్తు రూపం వైఎస్ రాజశేఖరుడు అని అన్నారు.

వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకుడు రాజశేఖర్ యరమల మాట్లాడుతూ ‘వైఎస్సార్‌  అంటే ఒక్క వైఎస్సార్‌ సీపీ పార్టీ వాళ్ళే కాకుండా అన్ని పార్టీలో వాళ్ళు ఆయనకు గౌరవం ఇస్తారు.  ముఖ్య మంత్రి అయినప్పుడు అందరికి మంచి చేయాలన్న తపనతో ముందుకు వెళ్లే వ్యక్తి  వైఎస్సార్‌. అలాగే అదే బాట లోనే అయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి  కూడా అందరికి మేలు చేయాలన్న తపన తోనే ముందుకు వెళ్తూ ఉండటం మనం చూస్తూనే వున్నాం. అలాంటి వాళ్లు మనకు ముఖ్యమంత్రిగా రావటం మనం చేసుకున్న అదృష్టం’ అని కొనియాడారు.

చదవండి: ఆత్మనివేదనలో అంతరంగం

వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకుడు వెంకట్ యర్రం మాట్లాడుతూ ‘వైఎస్సార్‌  ప్రతి ఒక్క మనిషిని దృష్టిలో పెట్టుకుని అందరికి మంచి చేయాలి అన్న తపన తో మన రాష్ట్రాన్ని బంగారు బాటలో ముందుకు తీసుకెళ్లిన మంచి మనిషి . అయన కుమారుడు కూడా ఎన్నికలకు ముందు తన తండ్రి లాగానే చేస్తాడా అని ఒక సమస్య అందరిలోనూ ఉండేది. కానీ  ఇప్పుడు రాజశేఖర్ రెడ్డినే మరిచిపోయే అంతలా రాబోయే పది సంవత్సరాల గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నారు. జగన్  నవరత్నాల్లో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చాలా వరకు నెరవేరుస్తున్నారు.ఇలా జగన్ గారు చేసిన మంచి పనులు అన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ పార్టీ ని ముందుకు తీసుకువెళ్లడానికి మన వంతు కృషి చేయాలి’ అని అన్నారు. 

వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకుడు మురళి బచ్చు మాట్లాడుతూ, మహానేత డాక్టర్ వైఎస్సార్‌ గారు ఒక కారణ జన్ముడు. అలాంటి వ్యక్తిని మళ్లీ పుట్టించాలని ఆ దేవుడిని కోరాలి. పెద్దాయన ప్రవేశ పెట్టిన పథకాలు ఇప్పటికి కూడా చిరస్మరణీయం. అయన చేపట్టిన వైద్య , విద్య పథకాల ద్వారా ఎంతో మంది పేదలు చాలా లాభపడ్డారు. ప్రతి విషయం లో జగన్  తన తండ్రి ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నారు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్  ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి పార్థ సారధి రెడ్డి బైరెడ్డి, వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు వెంకట్ యర్రం, రాజశేఖర్ యరమల, రవి బారెడ్డి, రాంగోపాల్ దేవపట్ల, మురళి బచ్చు, సుదర్శన దేవిరెడ్డి, శ్రీనివాస్ పూసపాటి, నాగిరెడ్డి, లోకేష్ మేడపాటి, నాగార్జున, సతీష్ బోబ్బా, రాజేష్, సోమశేఖర్ పాటిల్, రామకృష్ణ లతో పాటు పలువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు