వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఫిలడెల్ఫియాలో రక్తదాన శిబిరం

8 Sep, 2019 14:42 IST|Sakshi

ఫిలడెల్పియా : రాజశేఖరరెడ్డి  ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పదో వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫిలడెల్పియాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ గోసల రాఘవ రెడ్డి ఆధ్వర్యం లో జరిగే ఈ రక్త దాన శిబిరానికి నాలుగు వందల మంది కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్‌కి ఘన నివాళి అర్పించారు. 150 మంది రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అన్నా రెడ్డి, జాయింట్ ట్రెజరర్ శరత్ మందపాటి, శివ మేక, హరి వెళ్కూర్,అంజి రెడ్డి సాగంరెడ్డి, హరి కురుకుండ, ద్వారక వారణాసి, శ్రీకాంత్ పెనుమాడ, వెంకటరామి రెడ్డి, శ్రీనివాస్ ఈమని, మధు గొనిపాటి, విజయ్ పోలంరెడ్డి, తాతా రావు, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, రామ్ కళ్ళం, గీత దోర్నాదుల, లక్ష్మి నారాయణ రెడ్డి, లక్ష్మీనరసింహ రెడ్డి, పద్మనాభ రెడ్డి, నాగరాజా రెడ్డి , జగన్ దుద్దుకుంట, ఆనంద్ తొండపు, రవి మరక, అజయ్ యారాట, నరసింహ రెడ్డి, వెంకట్ సుంకిరెడ్డితో పాటు వైఎస్సార్‌ అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు