కువైట్‌లో ఘనంగా వైఎస్సార్‌సీపీ 9వ ఆవిర్భావ వేడుకలు

13 Mar, 2019 19:57 IST|Sakshi

కువైట్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి. ఏనిమిది వసంతాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మాలియా ప్రాంతములో వైఎస్సార్‌సీపీ కువైట్‌ కమిటీ ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్‌ రెడ్డి, అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్‌ కట్‌ చేసి వార్షికోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన గల్ఫ్‌, కువైట్‌ కన్వీనర్లు ఇలియాస్‌ బి.హెచ్‌, ముమ్మడి బాలిరెడ్డిలు మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీడీపీతో చేతులు కలిపి వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైలుకు పంపినా అధైర్యపడకుండా ప్రజా సంక్షేమం కొరకు పోరాడుతున్నారని ప్రశంసించారు. 2014 ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, లోక్‌ సభ సభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా అదరకుండా, బెదరకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారన్నారు. కార్యనిర్వాహకులు మహేష్‌, ప్రభాకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన నుంచి ప్రజలను కాపాడాలంటే వైఎస్‌ జగన్‌ ఏపీ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్‌ జగన్‌ను సీఎం చేసే బాధ్యత ప్రవాసాంధ్రుల అందరిపై ఉందన్నారు. గల్ఫ్‌లో ఉన్న ప్రతి వైఎస్సార్‌ అభిమాని తమ నియోజకవర్గాలకు వెళ్లి పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీలు కాని వాళ్లు ఫోన్‌ ద్వారా తమ కుటుంబ సభ్యలకు చెప్పి ఓట్లు వేయించాలని కోరారు.

ఈ కార్యక్రమములో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి. నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, లాలితరాజ్, సలహా దారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బీసీ ఇంచార్జ్ రమణ యాదవ్, మైనారిటీ ఇంచార్జ్ షేక్ గఫార్, ఎస్సీ, ఎస్టీ ఇంచార్జ్ బీఎన్ సింహా, మైనారిటీ సభ్యులు షా హుస్సేన్, మహాబూబ్ బాషా,సేవాదళ్ వైస్ ఇంచార్జ్ సుబ్బారెడ్డి, యువజన సభ్యులు రవిశంకర్, హరినాధ్ చౌదరి, జగన్ సైన్యం అధ్యక్షులు బాషా, కమిటీ సభ్యులు ఖాదురున్, ప్రభాకర్, సుధాకర్ నాయుడు, నూక శ్రీనువాసులు రెడ్డి, గజ్జల  నరసారెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రసారెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు