జగన్‌పై దాడిని ఖండించిన కువైట్‌ ప్రవాసాంధ్రులు

27 Oct, 2018 21:16 IST|Sakshi

మాలియా: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్యాన్ని కువైట్‌లోని తెలుగువారు తీవ్రంగా ఖండించారు. జననేతపై జరిగిన దాడిని ఖండిస్తూ వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు.  వైఎస్సార్‌సీపీ కువైట్‌ ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నల్ల రిబ్బన్లు కట్టుకుని, టీడీపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్‌ జగన్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ములేక అనామకుడితో హత్యాయత్నం చేయించడాన్ని గర్హించారని గల్ఫ్ కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బిహెచ్, ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు. 

ఈ సందర్భంగా నాయని మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకం ప్రకారం ఇదంతా చేయించారని ప్రవాసాంధ్రులు నమ్ముతున్నారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశం పార్టీకి చరమగీతం పాడి, చంద్రబాబుకు రాజకీయంగా సమాధి కట్టడం తథ్యమన్నారు. 

ఈ కార్యక్రమములో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం వి నరసారెడ్డి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు రహమాన్ ఖాన్,  తెట్టు రఫీ,  వైఎస్  లాజరస్, గల్ఫ్ ప్రతినిధి షేక్ నాసిర్, సలహాదారుడు నాగిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి,బి.సి. విభాగం ఇంచార్చ్ కె. రమణ యాదవ్,  మీడియా ప్రతినిధి పూలపుత్తూరు సురేష్ రెడ్డి, యువజన విభాగం ఇంచార్జ్ మర్రి కళ్యాణ్, మైనారిటీ ఇంచార్చ్ షేక్ గఫార్, సాంస్కృతిక విభాగం ఇంచార్చ్ కె. వాసుదేవ రెడ్డి, బిసి సెల్ వైస్ ఇంచార్జ్ రావూరి రమణ, సయ్యద్ సజ్జాద్, గౌస్ బాషా, జిలేబి బాషా, వడ్డే రమణ, హరినాథ్ చౌదరి, రవిశంకర్ మరియు భారీగా అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు