వైఎస్‌ జగన్‌పై దాడిని ఖండించిన ప్రవాసాంధ్రులు

29 Oct, 2018 20:15 IST|Sakshi

కాలిఫోర్నియా : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐ బే ఏరియా విభాగం ఖండించింది. బే ఏరియా లోని ఫ్రీమాంట్‌లో సమావేశమైన ఎన్‌ఆర్‌ఐలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కన్వీనర్ మధులిక మాట్లాడుతూ కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా నిందితుడు వైఎస్‌ జగన్ అభిమాని అని, పలానా కులం అని హడావిడిగా ప్రకటించడం చూస్తుంటే విచారణ సరిగ్గా జరగుతుందనే విశ్వాసం పోయిందని, ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేపించాలని డిమాండ్‌ చేశారు. కన్వీనర్ చంద్రహాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దాడిని ఖండించకుండా, ఖండించిన వారిపై విమర్శలు చేయడం ద్వారా తన రాక్షసత్వాన్ని మరోసారి భయటపెట్టుకున్నారని మండిపడ్డారు. 

హత్యాయత్నానికి వాడిన ఆయుధాన్ని ఎయిర్‌పోర్టు క్యాంటిన్‌లోకి తీసుకురావడానికి ఎవరు సహకరించారో పూర్తి స్థాయి విచారణ చేపించాలని వైఎస్సార్‌సీపీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కే వి రెడ్డి డిమాండ్‌ చేశారు. హత్యాయత్నం వెనుక ఉన్న అసలు కుట్ర దారులు ఎవరో బయట పెట్టాలన్నారు. అలాగే మానవతా దృక్పథంతో పరామర్శించిన వారిపైన రాజకీయ బురద చల్లడం ముఖ్యమంత్రి హోదాకి సరికాదన్నారు.

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే మానవతా కోణంలో చూడాల్సింది పోయి చంద్రబాబు రాజకీయాలు చేయడంపై తెలుగు వారు అందరూ అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ముఖ్య సభ్యులు హరింద్ర శీలం  అన్నారు. ముఖ్యమంత్రి గ్రామస్థాయి నేతలా చౌకబారు పదాలతో ప్రతిపక్ష నేతని సంబోధించడం ఆయన సంసృతికి నిదర్శనం అని వైఎస్సార్‌సీపీ బే ఏరియా కమిటీ సభ్యులు హరి మొయ్యి అన్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని మరో ముఖ్య సభ్యులు విజయ్ ఎద్దుల తెలిపారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ఈ ఘటనపై బాధ పడుతుంటే చంద్రబాబుకు మాత్రం ఇది డ్రామాలా కనిపిస్తోందని, మానవత్వం మరిచి 40 ఏళ్ల అనుభవం ఉన్నా అది వ్యర్థం అని ధ్వజమెత్తారు. వైస్ జగన్‌కి వస్తున్న విశేష ప్రజాధరణ చూసి తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడి పోతుందని అభద్రతా భావం పెరిగి ఇలాంటి హత్యాయత్నానికి పాలుపడుతున్నారని శ్రీధర్ తోటరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో  వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ  కన్వీనర్‌లు మధులిక, చంద్రహాస్, గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కే వి రెడ్డి, వైఎస్సార్‌సీపీ ముఖ్య సభ్యులు నరేష్ కొండూరు, అమర్, హరి మొయ్యి, హరింధ్ర శీలం, శ్రీధర్ తోటరెడ్డి, విజయ్ ఎద్దుల, శివా రెడ్డి, ప్రవీణ్, సురేంద్ర అబ్బవరం, నరేంద్ర అత్తానురి, శ్రీని కొండా, రవి గాలి, వైఎస్సార్‌సీపీ స్టూడెంట్ విభాగం నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు