వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని వర్జీనియాలో ప్రార్థనలు

31 Oct, 2018 19:56 IST|Sakshi

వాషింగ్టన్ డీసీ : విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం నుంచి గాయంతో బయటపడిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని వాషింగ్టన్ డీసీ వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ విభాగం వర్జీనియాలోని లోటస్ టెంపుల్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజా సంకల్పయాత్ర నిర్విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని దేవుని ప్రార్ధించారు. సురేన్ బత్తినపట్ల మాట్లాడుతూ ఈ దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరు మరీ ఘోరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అవగాహనలేని మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకుంటే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు.
 .
వైఎస్సార్‌సీపీ సలహాదారు (యుఎస్‌ఏ), రీజనల్ ఇంఛార్జ్‌(మిడ్ అట్లాంటిక్) వల్లూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మెండుగా ప్రజాదరణ కలిగిన నేతకు రక్షణ కల్పించలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. విమానాశ్రయంలో రక్షణ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని ఏపీ మంత్రులు తలా తోక లేకుండా పిచ్చి పట్టినట్టు మాట్లాడటం దారుణమన్నారు. వైఎస్‌ జగన్‌పై దాడి పిరికిపంద చర్య అన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాలి అని పేర్కొన్నారు. కోట్లాది అభిమానుల ఆశీర్వాద బలం, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో వైఎస్‌ జగన్ త్వరగా కోలుకొని మళ్లీ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించే దయా గుణం లేనివారు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజల దౌర్భగ్యమని శశాంక్ అరమడక అన్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రుల వాఖ్యలను శ్రీనివాస్ సోమవారపు తీవ్రంగా ఖండించారు. వారు మానవత విలువలను మరవవద్దని హితబోధ చేశారు. ఓ ప్రతిపక్ష నాయకునికి భద్రత కల్పించలేని ప్రభుత్వము సామాన్యులకు ఎలా రక్షణ కల్పిస్తుందని శ్రీధర్ నాగిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. 

వైఎస్‌ జగన్ ఆరోగ్యంగా ఉండాలని, ప్రజా సంకల్ప యాత్ర నిర్విఘ్నంగా సాగాలని, సకల రాజకీయ విఘ్నాలు తొలగిపోవాలని జె జొన్నల గుమ్మడి కాయతో దిష్టి తీశారు. ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన దాడికి చంద్రబాబు బాధ్యత వహించకపోగా, ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతా రహితంగా మీడియాతో మాట్లాడి ఆయన దిగజారుడు తనాన్ని బయట పెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమం వైఎస్సార్‌సీపీ వాషింగ్టన్ డీసీ ఏరియా విభాగం ఆధ్వర్యం లో నిర్వహించారు. వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఎన్నికల సమయంలో అమెరికా నుండి మూడు నెలల ముందుగా పెద్ద సంఖ్యలో అభిమానులు తమ సొంత ప్రాంతాలకు తరలి వచ్చి ప్రచారంలో పాల్గొనబోతున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. 

ఈ కార్యక్రమములో సురేంద్ర బత్తినపట్ల, శ్రీనివాస్ సోమవారపు, రమేష్ రెడ్డి వల్లూరు, అంజిరెడ్డి దొందేటి, జె జొన్నల, శశాంక్ అరమడక, శ్రీనివాస్ సిద్దినేని, జనార్దన్ జంపాల, వెంకట్ కొండపోలు, కిరణ్ ఎల్వీ, సురేష్ అల్లూరి, మధు మోతాటి, శివ ఆమంచర్ల, శ్రీనివాస్ ఆవుల, రఘు నరాల, చంద్రహాస్ జొన్నల, సతీష్ నరాల, శ్రీధర్ నాగిరెడ్డి, మల్లిఖార్జున్ కలకోటి, శివ సైనెని, సత్య పాటిల్, సురేష్ కొత్తింటి, నాగార్జున శ్యామల, పున్నం జొన్నల, ఆనంద్ సాగర్, చిన్ని రెడ్డిగారి, నరేంద్ర ఏలూరు, జీవన్, వేణు జంగా, కడప రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు