నవరత్నాల ‘‘డిజిటల్‌ దండోరా’’

9 Mar, 2019 14:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజాసంకల్పయాత్రతో ప్రజల గుండెల్లో చెరగిపోని స్థానాన్ని పొందిన జననేత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అన్ని వర్గాల ప్రజలకు మరింత దగ్గరచేసేలా కృషి చేస్తోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సింగపూర్‌ వింగ్‌. నవరత్నాలను ప్రజలకు మరింత చేరువ చేయటానికి తనవంతు పాటుపడుతోంది. ఇందుకోసం ‘‘నవరత్న’’ పథకాల ప్రచార వీడియోల సమూహాన్ని రూపొందించి ‘‘డిజిటల్‌ దండోరా’’ పేరిట ప్రజల్లోకి తీసుకెళ్లబోతోంది. రాజన్న సంక్షేమ రాజ్యం జగనన్నతోనే సాథ్యం అన్న నిజాన్ని చాటి చెప్పబోతోంది. శనివారం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. సింగపూర్ ఎన్నారై వింగ్ రూపొందించిన ‘‘డిజిటల్‌ దండోరా’’కు సంబంధించిన వీడియోల సమూహాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమం కోసం సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై వింగ్ సభ్యులు ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జగనన్న నవరత్న పథకాలు ప్రజలకు ఎంత ఉపయోగకరమో, ఈ వీడియోల ద్వారా సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నారై వింగ్ ప్రజల ముందుకు తీసుకురానుందని తెలిపారు. ఇప్పటికే విడుదల చేసిన వీడియోలకు అమితమైన ప్రజాధరణ లభించిందని, నూతనంగా రూపొందించిన వీడియోలతో జగనన్న నవరత్న పథక లక్ష్యాలను జనంలోకి వేగంగా తీసుకెళ్లి, అలనాటి రాజన్న సంక్షేమ రాజ్యం జగనన్న సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఆవశ్యకమే వివరిస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో తాము స్వదేశానికి వచ్చి తమ ఓటు వినియోగించుకోవడంతో పాటు, నవరత్నాల గురించి విశేషంగా తమ ప్రాంతాలలో ప్రచారం చేస్తామని ఈ సందర్బంగా కమిటీ సభ్యులు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌కు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజయవంతంగా జరగటానికి  సహకారం అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాజంపేట మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై వింగ్ కన్వీనర్లు బొమ్మారెడ్డి శ్రీనివాసుల రెడ్డి, దక్కత జయప్రకాశ్, కోర్ కమిటీ, సోషల్ మీడియా వింగ్ ఇంఛార్జులు పిల్లి సంతోష్ రెడ్డి, సురేష్, నరసింగ్ గౌడ్, మురళి, పిట్ల కస్తూరి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు