లాస్ ఏంజెల్స్‌లో వైఎస్సార్‌సీపీ విజయోత్సవం

4 Jun, 2019 11:28 IST|Sakshi

లాస్ ఏంజెల్స్‌ : 2019 ఎన్నికలో వైఎస్సార్‌సీపీ విజయదుందిబి మోగించిన సందర్భంగా లాస్ ఏంజెల్స్‌లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఇర్విన్ పట్టణంలోని శ్రీ శివ కామేశ్వరి దేవస్థానం నుండి కారు ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రవాసాంధ్రులు సమావేశమై 9సంవత్సరాల నిరీక్షణ ఫలించిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్ నిర్వహించిన పాదయాత్ర వలన ప్రజల సమస్యలు పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా, జగన్ చూపించిన పరిష్కార మార్గాలు, ప్రజలలో విశ్వాసం కలిగించిందని ఎన్‌ఆర్‌ఐలు అన్నారు. గత ప్రభుత్వ పెద్దలు, కార్యకర్తలు కళ్లముందే పంచభూతాలను కూడా వదలకుండా దోచుకోవడం, ప్రజల ఆగ్రహానికి గురి అయ్యిందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి, సమయం వెచ్చించి, గత ప్రభుత్వ దుర్మార్గాలను, అవినీతి విధానాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించటం సత్ఫలితాలను ఇచ్చిందని అన్నారు. వైఎస్సార్‌సీపీ గెలిచిన సీట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నా, ఓట్ల పరంగా చూస్తే ఇంకా కష్టపడవలసిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.
 

గత ప్రభుత్వం ప్రపంచ చరిత్రలోనే జరగనంత అవినీతి, అక్రమాలు, అరాచకాలు చేసినప్పటికీ, కేవలం ఎల్లో మీడియా చూపించినా అసత్యాలు, అర్ధసత్యాలు, అభూతకల్పనల వలన ప్రత్యర్థి పార్టీ వాళ్ళు 40శాతం ఓట్లు సాధించారన్నారు. రాబోయే రోజుల్లో వారిలో కూడా సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించవలసిన భాధ్యత వైఎస్సార్‌సీపీ అభిమానులకు ఉందని ఆన్నారు. మహాభారతంలో అభిమన్యుడి వలే ఓడించాలని అందరూ కలసి ప్రయత్నించారని, కానీ వైఎస్‌ జగన్‌ అర్జనుడిలా ఎదిరించి విజయం సాధించారని, ఈ విజయానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు కృష్ణుడి పాత్ర పోషించారని ఆన్నారు. సూర్య గంగిరెడ్డి, రామ కృష్ణా రెడ్డి భూమా, భాస్కర్‌ అళ్లూరు, శ్రీనివాస్‌ రెడ్డి పడిగెపాటి, బయపారెడ్డి దాడెం, ప్రవీళ్‌ ఆళ్లల ఆధ్వర్యం ఈ కార్యక్రమం జరిగింది. ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ అభిమానులకు సూర్య గంగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు