పోతు తోక పట్టుకొని...

29 May, 2016 23:13 IST|Sakshi
పోతు తోక పట్టుకొని...

సాహిత్య మరమరాలు
 
ఒకప్పుడు పోతులు కాచుటకు నన్ను నియమింపగా పొలములో మేపి యేటిలో బోతులు కడుగుచుంటిని. ఏరు వడిగా రెండొడ్లు తీసి పారుచున్నది. పోతు తోక పట్టుకొని నట్టేట నీదుటకు నాకు వేడ్క పుట్టెను. నట్టేటికి నన్ను దీసికొనిపోయి పోతు తలముంచెను. దాని వీపుపై తోకపట్టుకొని నిలుచుంటిని కాని కొంతమేర పోతు మునిగిపోవుటచే నేనూ మునుగుచుదేలుచుంట తటస్థించుచుండెను. ఇటులొక యరమైలు కొట్టుకొని పోతిని. తుదకు పోతు నన్నంటక ప్రత్యేకము పోవుచుండెను. ఈదుచుంటిని కాని యొడ్డు చేరుటకు శక్తి చాలకుండెను. అంతట వార్త తెలిసి మా పెద్దన్న మొదలగువారు వచ్చి నన్గాపాడిరి.
 (అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ఆత్మకథ ‘నా యెఱుక’లోంచి...)

మరిన్ని వార్తలు