మానని గాయం ఇంద్రవెల్లి మారణహోమం

18 Apr, 2015 00:40 IST|Sakshi
మానని గాయం ఇంద్రవెల్లి మారణహోమం

సందర్భం
 
చరిత్ర పుటల్లో చేరిన మా నని ఆదివాసుల గాయం ఇంద్రవెల్లి. ఈ దేశ మూల వాసులపై నాగరిక సమా జం అమలు చేస్తున్న వివ క్షకు, అణచివేతకు అది పర్యాయపదం. ఆదిలాబా ద్ జిల్లా ఇంద్రవెల్లిలో 1981, ఏప్రిల్ 20న జరి గిన మారణహోమం జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ను తలపించిన ఊచకోత. గోండ్వానా పరిధిలోని ఆదిలాబాద్ ప్రాంతంలో బ్రిటిష్ వలస పాలకులపై రాంజీగోండ్ తిరుగుబాటు (1858-60), ‘మా ఊళ్లో మా రాజ్యం’ అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు (1938-40) అనంతరం ఆంత్రో పాలజిస్టు ప్రొ॥హైమండార్ఫ్ అధ్యయన ఫలితాలు అమలుకు నోచు కోకుండానే జరిగిన ఇంద్రవెల్లి దుర్ఘటన ఆనాటి మానవతావాదుల్ని కలచివేసింది.

ఆదిలాబాద్‌లో కోలాం, పర్ఫాన్, తోటి, కో య, నాయక్ పోడ్ గిరిజనులు నివసిస్తున్నారు. ఇది మహారాష్ట్రకు సరిహద్దు కావడంతో మార్వాడీలు, లంబాడీలతో పాటు కోస్తా నుంచి వలస వాదులు ప్రవేశించారు. ఆదివాసీలకు చెం దిన భూఆక్రమణలు, అటవీ వనరుల దోపిడీ, వర్తకవ్యాపారుల మోసాలు పెరి గాయి. వీటిని నిరసించడానికి ‘గిరిజన రైతు కూలీ సంఘం’ 1981, ఏప్రిల్ 20న ప్రథమ మహాసభను ఇంద్రవెల్లిలో నిర్వ హించడానికి సన్నాహం చేసింది. తమ పోడు భూములపై హక్కులు, పండిన పం టలకు గిట్టుబాటు ధర కల్పించాలని, సం తలో అటవీ ఉత్పత్తుల కొనుగోలులో సేట్లు చేసే తూనికల మోసాన్ని అరికట్టా లనే డిమాండ్లతో గిరిజన గూడేలలో తుడుం మోగిం చారు. ఇంద్రవెల్లిలో ఆ రోజు సోమవారం అంగడి కావడంవల్ల అధిక సంఖ్యలో గిరిజనులు హాజరవు తారని భావించిన పోలీసులు ఒకరోజు ముందే 144వ సెక్షన్ విధించారు. పరిసర ప్రాంతాల్లో సభకు వ్యతిరేక ప్రచారం చేశారు.

ఇదంతా తెలియని ఆదివాసులు ఉదయం 7 గంటల నుంచి భారీ సంఖ్యలో ఇంద్రవెల్లికి చేరుకు న్నారు. ఆయా మార్గాలలో కొందరిని లాఠీలతో కొట్టడం, బాష్పవాయువు ప్రయోగించడం వంటివి చేశారు. సభ ప్రారంభానికి ముందే హెచ్చరికలు లే కుండా పోలీసులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఈ అమానుష ఘటనలో 13 మంది ఆదివాసీలు మరణించగా, 9 మం ది గాయపడ్డట్లు నాటి కాంగ్రెస్ ప్రభు త్వం ప్రకటించింది. కాని వాస్తవంగా కాల్పుల్లో 60 మంది మరణించగా, మరో 80 దాకా తీవ్రంగా గాయపడినట్లు పత్రి కలు వెల్లడించాయి.  ఈ దుర్ఘటనలో క్షత గాత్రులైన వారిలో బతికి ఉన్న ఇద్దరు మాత్రం కాలా నికి ఎదురీదుతున్నారు.

ఆదిలాబాద్ అడవి బిడ్డలపై ఇంద్రవెల్లి రేపిన గాయానికి 34 ఏళ్లు. అల్లూరి ‘మన్యం పోరాటం’ (1922-24), కొమురంభీం ‘జోడేఘాట్ తిరుగు బాటు’ (1938-40), ‘శ్రీకాకుళ రైతాంగ పోరాటం’ (1968-70), తొలి ‘తెలంగాణ ఉద్యమం’ (1969), జగిత్యాల కార్మికుల ‘జైత్రయాత్ర’ (1978) ఉద్య మాలు ఇంద్రవెల్లికి వారసత్వంగా నిలిచాయి.  

ఇంద్రవెల్లి ఘటన జరిగిన 34 ఏళ్ల తరువాత కూడా ఈ దేశంలో మూలవాసులు పౌరసమాజం లో అంతర్భాగం కాలేకపోతున్నారు. నాడు ఇంద్ర వెల్లి, నిర్మల్, జోడేఘాట్‌తో ఆదివాసుల జీవన సం స్కృతిపై దాడి జరిగితే, వాకపల్లి, భల్లూగూడ వంటి గ్రామాల్లో ఆత్మగౌరవ దాడులు జరగడం అమా నుషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1/70 చట్టం, ఫీసా చట్టాలను తుంగలో తొక్కుతూ ఆదివాసీ జీవన విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. నల్లమలలో చెంచు లను, కవ్వాల్‌లో గోండులను, బయ్యారం, కంతన పల్లిలో కోయలను ప్రకృతి ఒడి నుంచి నిర్వాసితు లను చేసే యత్నాలు సాగుతున్నాయి. ఆదివాసుల అభివృద్ధికి అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లు ఇతర కులాలకు పంచుతూ పాలకులు రాజ్యాంగ విరు ద్ధంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఆదివాసులు తమ రక్షణకు ‘మనుగడ కోసం పోరాటం’ చేసే దుస్థితి నుంచి తప్పించి ‘జల్-జంగల్-జమీన్’పై పూర్తి స్వేచ్ఛాధికారాలు కల్పిస్తే తెలంగాణ అమరుల త్యాగాలకు మనం అర్పించే ఘన నివాళి అవుతుంది.
(ఇంద్రవెల్లి కాల్పులకు ఏప్రిల్ 20 నాటికి 34 ఏళ్లు)  (వ్యాసకర్త మొబైల్: 9951430476)


 గుమ్మడి లక్ష్మీనారాయణ

 

మరిన్ని వార్తలు