తెగుతున్న పొత్తు బంధనాలు

21 Jun, 2016 01:16 IST|Sakshi
తెగుతున్న పొత్తు బంధనాలు

బాల్‌థాక్రే నోట్లోంచి మాట ఊడిపడటం చాలు.. ఆయన నివాసానికి ప్రమోద్ మహాజన్ పరుగెత్తుకెళ్లి రాజీకోసం ప్రయత్నించేవారు. అలాంటిది ‘మమ్మల్ని కాస్త గౌరవించండి’ అంటూ ఉద్ధవ్ థాక్రే తాజాగా చేసిన ప్రసంగం అత్యంత దయనీయంగా ఉంది.
 
 భారతీయ జనతాపార్టీ ఇప్పుడు దేశంలో ప్రాబల్య పార్టీగా ఉన్నప్పటికీ (కాంగ్రెస్ ఒకప్పుడు ఇదే స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడు అంతిమ పత నంలో ఉన్నట్లు స్పష్టంగానే కనబడు తోంది), భారత్ ప్రాంతీయ శక్తుల అధికార పట్టులో ఇరుక్కుని పోయి ఉంది. దేశంలోనే అతి ప్రాచీన ప్రాంతీయ పార్టీ అయిన డీఎంకే తమిళనాడులో తన సొంత బలంతోటే అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. దాని ప్రత్యర్థి ఏఐడీఎంకేది కూడా అదే చరిత్రే.
 
 ఈశాన్య ప్రాంతంలో 1980లలో ఏర్పడిన అసోం గణ పరిషత్ అస్సాంని పాలించడం మనం చూసే ఉన్నాం. ఇక ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, దాని వైరి పక్షం బహుజన్ సమాజ్ పార్టీ తమవంతు పాలన సాగించాయి. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమబెంగాల్‌లో రెండో దఫా పాలనలోకి అడుగు పెట్టింది. తెలుగుదేశం పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లోనూ గెలుపు సాధిం చింది. కొత్త రాష్ట్రం  తెలం గాణలో  తెరాస అధికార పగ్గాలు చేపట్టింది.
 
 అయితే, 1966 జూన్ 19న ఉనికిలోకి వచ్చిన శివసేన రాష్ట్ర లేక పార్ల మెంటరీ ఎన్నికల్లో గానీ లేదా ప్రత్యేకించి తనకు గుండెకాయ లాంటి ముంబైలో  స్థానిక ఎన్ని కల్లోగానీ ఇలాంటి గెలు పును ఎన్నడూ సాధించలేకపోయింది. హిందుత్వ పునాది పొత్తు కుదుర్చుకున్నప్పటి నుంచి ప్రతి సందర్భంలోనూ ఇది బీజేపీతో భాగం పంచుకోవలసివచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పొత్తు విచ్ఛిన్నమై పోయింది.
 
 ఆదివారం సాయంత్రం శివసేన పార్టీ నిర్వహించిన 50వ ఆవిర్భావ వార్షికోత్సవం దాని రెండో తరం అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రసంగానికి మాత్రమే పరిమితమైంది. సాధారణంగా ఇలాంటి సందర్భంలో కనిపించే అట్టహాసం, ఆడంబరం ఈసారి కనిపిం చలేదు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎలాంటి భారీ బహిరంగ సభ లకు పథక రచన చేయడం, నిర్వహించడం జరగలేదు. ఎందు కంటే ఇపుడు కూడా ఆ పార్టీ తన పంథా విషయంలో అనిశ్చితి లోనే ఉంది. పాత భాగస్వామితో పోరాటం, తర్వాత కొత్త ప్రభు త్వంలో అవమానకరంగా సర్దుకునిపోవలసి రావడంతో ఆ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొని ఉంది.
 
 ఆనాడు మహారాష్ట్రలోని 62 జౌళి మిల్లులు, అనేక పారి శ్రామిక విభాగాల్లో ఎక్కువమంది మరాఠా కార్మికులే ఉన్న ప్పటికీ, ఉద్యోగ అవకాశాల్లో స్థానికుల హక్కుకు భద్రత కలి గించే లక్ష్యంతో శివసేన ఒక సంస్థగా ఏర్పడ లేదు. స్థానికులకు హక్కులు అనేవి వైట్ కాలర్ ఉద్యోగాల చుట్టూనే కేంద్రీకృతమై ఉండేవి. మరాఠీ జనాభాలో ఇది ప్రతిధ్వనించేది. దీనివల్ల ఈ పార్టీ నగర కేంద్రకంగానే ఉండిపోయింది. ఆ స్థితి నుంచి శివ సేన బయటపడలేక పోయింది కూడా.
 
 నెమ్మదిగా, పురపాలక రాజకీయాల్లో కాలుమోపటం ద్వారా శివసేన రాజకీయ పార్టీగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ లోకి దాని ప్రవేశం చాలా సమయం తీసుకుంది. విజయాలు కూడా అంత సులువుగా రాలేదు. కమ్యూనిస్టులను, కాంగ్రెస్ పార్టీని మినహాయిస్తే, శివసేన  ప్రత్యేకించి పురపాలక ఎన్నికల్లో ఒకటి లేక ఎక్కువ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. ప్రాంతీయ పార్టీ శక్తిని ఇదేమంతగా వివరించదు. పైగా, తనకు జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ఆకాంక్షలేవీ లేవని  శివసేన స్పష్టం చేసింది.
 
 హిందుత్వను శివసేన పూర్తిగా బలపరుస్తున్న కారణంగా, అప్పట్లో అతి చిన్న పార్టీగా ఉన్న బీజేపీ మహారాష్ట్ర ప్రాంతీయ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. శివసేనతో భాగస్వామ్యం లేనిదే అతల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాని కాలేరు కాబట్టి శివసేన పెద్దన్న వైఖరిని జీర్ణం చేసుకోవాల్సి ఉంటుందని ప్రమోద్ మహాజన్ బీజేపీ కార్యకర్తలకు పదే పదే ఉద్బోధించడాన్ని ఎవరైనా గుర్తుకు చేసుకోవచ్చు.
 
 ఆవిధంగా ఇరుపార్టీల మధ్య పొత్తు కొనసాగింది. మహా రాష్ట్రలో ఈ కూటమి 1995లో అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల్లో ప్రాంతీయపార్టీకి, పార్లమెంటరీ స్థానాల్లో బీజేపీకి అనుకూలంగానే అన్ని వేళల్లో సీట్ల పంపిణీ జరిగేది. నరేంద్ర మోదీ నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు సాధించినప్పుడు మినహా బీజేపీ తక్కిన అన్ని వేళలా జూనియర్ భాగస్వామిగానే వ్యవహరించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సాధించిన ఘనవిజయంతో మహారాష్ట్ర ఎన్నికల్లో ఇకనుంచి ఒంటరిగానే పోరుకి దిగాలన్న ఆకాంక్ష బీజేపీలో బలపడిపోయింది.
 
 యాభయ్యవ వార్షికోత్సవం సందర్భంగా, పురపాలక ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలన్న విషయంపై శివసేన ఆలోచిస్తోంది. బీజేపీ కూడా ఇలాగే భావిస్తోంది. మహా రాష్ట్రలో అధికారంలోకి వచ్చి వార్షికోత్సవం జరుపు తున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర విభాగం రణగొణ ధ్వనులు చేస్తున్నప్పటికీ ఇకనుంచి మనం ఒంటరి గానే తలపడదామంటూ స్థానిక నేతలు పట్టుబడు తుండటం గమనార్హం.
 
 శివసేన ప్రస్తుతం కపటవైఖరితో ప్రదర్శిస్తున్న అనిశ్చితి పట్ల బీజేపీ మరింత కఠిన వైఖరితో ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరడానికి ముందు శివసేన ఆడిన పిల్లి-ఎలుకల ఆట తీరు బీజేపీ కేడర్‌కు చేదుగుళికగా మారింది. శివసేన మొదట ప్రతిపక్ష బెంచీల్లో కూర్చోవడమే కాదు. బీజేపీని అది పూర్తిగా పక్కకు నెట్టి వేసింది. తర్వాత అది ప్రభుత్వంలో భాగమైనప్పటికీ, ప్రభుత్వంలో ప్రతిపక్షం పాత్రను  పోషిస్తూనే ఉంది.

 ఒక్కమాటలో చెప్పాలంటే శివసేన ఒకవైపు  రేచుకుక్క లాగా వేటాడుతూ, మరోవైపు కుందేళ్లతో పరుగు సాగి స్తోంది. రెండు పార్టీలలోని కేడర్‌కు ఇది నచ్చడం లేదు. స్పష్టంగానే ఇది ఒక అసౌకర్యాన్నే తలపిస్తోంది. తరచుగా శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’లో తన భాగస్వామిపై అటు ఢిల్లీలోనూ, ఇటు ముంబైలోనూ నిప్పులు కురిపి స్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో ఒంటరి ప్రచారానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడు ముంబై కార్పొరేషన్ ఎన్నికలలో ఇది మొదలవుతుంది.
 
 పొత్తు కుదిరిన తొలినాళ్లలో శివసేన నిజంగానే కొర డాను చేత బట్టుకుని ఉండేది. బాల్‌థాక్రే నోట్లోంచి మాట వచ్చిందే తడవుగా, ప్రమోద్ మహాజన్ థాక్రే నివాసానికి పరుగెత్తుకుని వచ్చి రాజీకోసం ప్రయత్నించేవారు. అలాం టిది ‘మమ్మల్ని కూడా కాస్త గౌరవించండి’ అంటూ శివసేన ప్రస్తుత అధినేత ఉద్ధవ్ థాక్రే తాజాగా చేసిన ప్రసంగం అత్యంత దయనీయంగా ఉంది. పైగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉద్ధవ్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. శివ సేన లోగో అయిన పులి అందరికీ తెలిసినట్లే తక్కువగా గర్జి స్తుంది. ఉద్ధవ్ దానికి అనుగుణంగానే చెప్పారు, ‘‘అవును, మేము పొత్తును విచ్ఛిన్నపర్చం’’.
 వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 - మహేష్ విజాపుర్కార్
 ఈమెయిల్: mvijapurkar@gmail.com

మరిన్ని వార్తలు