-

కెమెరాలు పరిష్కారమా?

2 Dec, 2014 01:35 IST|Sakshi

 రోగుల బంధువుల నుంచి తమకు రక్షణ కావాలని, ఆస్ప త్రులలో సీసీ కెమెరాలను పెట్టాలని ఇటీవలి కాలంలో డాక్టర్లు మొత్తుకుంటున్నారు. సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులు తమ షాపుల్లో వీటిని వాడుతున్నారు. కానీ ఆ పేరుతో మనం సీసీ కెమెరాల నిర్బంధంలో ఉన్నామనే విషయం చాలామందికి తెలీదు. జనం రహస్యాలు, దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్న ట్లు మాట్లాడుకుంటారు. కానీ ఆస్పత్రుల యాజమాన్యాలు, కొందరు డాక్టర్లు మాత్రం ఈ మాటలను తమకు ఆసరాగా చేసుకుంటున్నారు. రోగి కుటుంబం  వారి ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై వారు దృష్టి పెడుతున్నారు. అందరు డాక్టర్లు కాకపోయినా ఎక్కువ మంది డాక్టర్లు మాత్రం రోగి దగ్గర ఎలా డబ్బులు లాగాలి అనే సీసీ కెమెరాలను వాడుతున్నారు.

అసలే ప్రాణం బాగులేని సమయంలో హాస్పిటల్‌కు వెళతారు.  అప్పు డు రోగి కుటుంబ సభ్యులు, బంధువులు మానసికాందోళనతో ఉంటారు. దాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు వసూలు చేసు కుంటున్నారు. సామాన్య ప్రజలకు జరుగుతున్న ఈ అన్యా యాన్ని అరికట్టాలి. వైద్యసేవలో ఉండవలసిన నైతిక ధర్మాన్ని అందరూ పాటించేలా చూడాలి.

 తలారి సుధాకర్  కోహెడ, కరీంనగర్ జిల్లా

మరిన్ని వార్తలు