‘ఆర్టీఐ’తో పరిశోధనలపై దాడి

30 Sep, 2016 01:38 IST|Sakshi
‘ఆర్టీఐ’తో పరిశోధనలపై దాడి

క్రిమిసంహారకాల వ్యాపారుల కోసం ఆర్టీఐని దుర్వినియోగపరచిన జర్నలిస్టుకు సీఐసీ రూపాయి జరిమానా విధించింది. వేధించే ప్రశ్నలతో పరిశోధకులను భయపెట్ట యత్నించడాన్ని నిరసించవలసి ఉంటుందని పేర్కొంది.
 
 జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక పరిశోధకురాలు పరిశోధన సాగించి పంటలకు వాడే పురుగు మందువల్ల కలిగే హాని అంతా ఇంతా కాదని తేల్చారు. ఢిల్లీ పరిసరాలలో పండించిన కూరగాయలలో 20 లేదా 30 సంవత్సరాల కిందట నిషేధించిన క్రిమి సంహారక పదార్థాలు కనిపించాయని తెలిపారు. అంటే, ఇంకా వాటిని ఉత్పత్తి చేస్తూనే, అమ్ముకుంటూనే ఉన్నారని విశ్వవిద్యాలయ పరిశోధకులు, వారి మార్గదర్శక ఆచార్యులు తమ సిద్ధాంత గ్రంథంలో వెల్ల డించారు. ఆ పరిశోధన సక్రమమైనదని సంబంధిత విషయజ్ఞులు, నిపుణులు పరీక్షించి నిర్ణయించారు. దాన్ని ఆమోదించి పరిశోధకురాలు సప్నా చౌరాసియాకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాను కూడా ఇచ్చారు. ప్రొఫెసర్ ఖిల్లార్ మార్గదర్శకత్వం వహించారు.

 జర్నలిస్టునని చెప్పుకుంటూ ఒక మహిళ సమా చార హక్కు చట్టం కింద ఈ పరిశోధనపై సమాచారం కావాలని  జేఎన్‌యూ అధికారులకు దరఖాస్తు పెట్టుకు న్నారు.  ఎన్ని నమూనాలు పరిశీలించారు, ఎప్పుడు మొదలు పెట్టారు, మీరు వాడిన పరికరాల సాంకేతిక ప్రమాణాలేమిటి. కనీస డిటెక్షన్ లిమిట్ ఏమిటి?  పురు గుమందు టెక్నికల్ గ్రేడ్ వివరాలు ఏమిటి? అంటూ 14 ప్రశ్నల పరంపర సాగింది. నాలుగైదింటికి తప్ప ప్రతి ప్రశ్నకు శ్రద్ధగా సీపీఐఓ సమాధానం చెప్పారు. పరిశోధ నకు వాడిన ముడి సరుకు మొత్తం ఇవ్వాలని వారి డిమాండ్. నిజానికి ఇవ్వవలసిన దానికన్న ఎక్కువ సమాచారమే ఇచ్చారు. అయినా సమాచారం నిరాకరిం చారంటూ మొదటి అప్పీలు చేశారు.
 
 ఇటువంటి దర ఖాస్తులు ఏడు దాఖలు చేశారని అనేక ప్రశ్నలు వేశారు. రీసెర్చ్ డేటా పరిశోధకుల సొంత మేధోసంపత్తి హక్కు అని CIC/AT/A/2008 /00533 కేసులో 22.10.20 08న, CIC/AT/A/2007 /01363 కేసులో 24.04. 2008న ఇచ్చిన తీర్పులలో కమిషన్ తేల్చింది.  వేధింపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సహ చట్టంలో లేదని కమిషనర్ పేర్కొన్నారు. పరిశోధనకు వాడిన సామగ్రి, నోట్స్, శాంపిల్స్ తదితర  వివరాలు అడిగే హక్కు దర ఖాస్తుదారుకు గానీ, పురుగుమందు వ్యాపార కంపెనీ లకు కానీ లేదని స్పష్టం చేశారు.
 
 అడిగింది సమాచారమేనా? అని అడిగే వారు ఒక సారి పరిశీలించుకోవాలి. అడిగిన వారెవరు, వారి ప్రయోజనాలేమిటి? అడిగిన వారెవరు? వారి వెనుక ఉన్న వారెవరో తెలిస్తే ఈ ప్రశ్నల వెనుక ఉద్దేశమేమిటో తెలుస్తుంది. మహిళా జర్నలిస్టు వెనుక పురుగుమం దులు తయారుచేసే కంపెనీల ‘క్రాప్ కేర్ ఫెడరేషన్’ అనే సంఘం ఉంది. సమాచార చట్టం కింద దస్త్రాలలో ఉన్న దస్తావేజుల ప్రతులను మాత్రమే కోరుకోవచ్చు. ఎవరు పరిశోధించారు, వారి గైడ్ ఎవరు వంటి ప్రశ్నలు అడగవచ్చు, సమాధానాలు ఇవ్వవచ్చు. కానీ రికార్డులో లేని అంశాలపై ప్రశ్నలు గుప్పించడానికి వీల్లేదు. పరిశో ధన తుది రూపుకు రావడానికి ముందున్న అంశాలు అడగడానికి ఆస్కారం లేదు.
 
 పరిశోధన ముగిసి ఆమోదం పొంది, పీహెచ్‌డీ డిగ్రీని కూడా ఇచ్చిన తరువాత ఆ పుస్తకాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందే. కానీ డిగ్రీ ఇచ్చిన తరు వాత ఏడాది దాకా ప్రజలకు అందుబాటులో ఉండ రాదనే నియమాలు ఆర్టీఐకి భిన్నం కనుక చెల్లవని సీఐసీ పేర్కొన్నారు. ఎవరైనా ఈ పరిశోధనలో తేలిన అంశాలను ఇంకా పరిశోధనలు జరిపి విభిన్నమైన సూత్రాలు కనిపెట్టవచ్చు. పురుగుమందు అమ్మకాలు కాపాడే బాధ్యత పరిశోధకులపై లేదు.
 
 పురుగుమందు వాడడం వల్ల పర్యావరణానికి, ప్రాణాలకు, పంటలకు హాని ఉందో లేదో తేల్చడం పరిశోధకుల బాధ్యత. కంపెనీలు లాభాపేక్ష కోసం పనిచేస్తారుు, విశ్వవిద్యాల యాలు ప్రజాప్రయోజనాల కోసం పరిశోధించాలి. ఇటువంటి పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథాల ప్రతు లను ప్రచురించాలని, భారతీయ భాషలలోకి అనువ దించి పురుగుమందు వాడకంలో ఉన్న నష్టాలను వివ రించే బాధ్యత కూడా విశ్వవిద్యాలయంపై ఉందని  పేర్కొన్నారు. ఈ విజ్ఞానం జనానికి అందుబాటులోకి వస్తే పురుగుమందు అవసరంలేని సహజపంటలకు  రైతులు మొగ్గుతారు. ఈ విధంగానే పరిశోధకులు రాసిన వ్యాసాలు ప్రచురించిన రాజస్థాన్ పత్రికపైన ఈ దరఖాస్తుదారు పురుగుమందు కంపెనీల సంఘం కేసులు వేస్తే అందులో పరువునష్టం ఏదీ లేదని ఢిల్లీ హైకోర్టు 27 నవంబర్ 2009న తీర్పు చెప్పింది.
 
క్రిమిసంహారకాల వ్యాపారులకోసం ఆర్టీఐని దుర్వినియోగం చేసిన ఈ మహిళా జర్నలిస్టుకు కేంద్ర సమాచార కమిషన్ ఒక రూపాయి జరిమానా విధిం చింది. జేఎన్‌యూ పరిశోధనా శాఖకు ఆ రూపారుు చెల్లించాలని ఆదేశించారు. వేధించే ప్రశ్నలు సంధిం చడం, పరిశోధకులను భయ పెట్టి నిర్వీర్యులను చేయ డానికి ప్రయత్నించడం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా నిర సించవలసి ఉంటుందని సమాచార కమిషనర్ పేర్కొన్నారు. పరిశోధకులు నిర్భయంగా స్వతంత్రంగా తమ కర్తవ్యం నిర్వహించకుండా అడ్డుపడటానికి ఆర్టీఐని వినియోగించకూడదని తీర్పులో వివరించారు. (CIC/ SA/A/2016/000028 కేసులో సెప్టెంబర్ 20న ఇచ్చిన తీర్పు ఆధారంగా).
 వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
 ఈమెయిల్: professorsridhar@gmail.com

మరిన్ని వార్తలు