అవార్డు గ్రహీతల అభిశంసన

9 Oct, 2015 00:47 IST|Sakshi

మతం పేరిట భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ, బెదిరిస్తూ రచయితల హత్యలకు పాల్పడుతున్న ఉన్మాదశక్తులను అదుపు చేయటంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటాన్ని మేము తీవ్రంగా అభిశంసిస్తున్నాం. నరేంద్ర దభోల్కర్, గోవింద పన్సారే, ఎం.ఎం.కల్బుర్గీల హంతకులను నిర్ధారించలేకపోవటాన్ని ప్రభుత్వాల ఉద్దేశ పూరిత నిర్లక్ష్యంగా భావిస్తూ ఖండిస్తున్నాం. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‌ను రచయితగా బతికించటానికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నం చేయకపోవటాన్ని నిరసిస్తు న్నాం. బహుళ మతాల, సంస్కృతుల దేశంలో విభిన్న ఆహారపు అలవాట్లను గౌరవించటానికి భిన్నం గా, కొందరి ఆహారంపై నిషేధాలు ప్రకటించ టాన్ని ఖండిస్తున్నాం. ఉత్తరప్రదేశ్‌లో మహమ్మద్ అఖిలేఖ్ హత్య, పెచ్చరిల్లుతున్న మతోన్మాదానికి చిహ్నంగా భావిస్తూ, ప్రతి ఎన్నికల ముందు మత విద్వేషవ్యాప్తిని గావించే రాజకీయాలతో సాధా రణ ప్రజల జీవితాన్ని కల్లోల పరచటాన్ని మేము గర్హిస్తున్నాము.
 
 సంకీర్ణ మత విశ్వాసాలతో కూడిన ప్రజల నడుమ సామరస్యాన్నీ, వారిలో అన్యమత విశ్వాసాలపట్ల సహనాన్నీ, భిన్నాభిప్రాయాల పట్ల గౌరవాన్నీ పెంపొందించాల్సిన ప్రధాన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలది. ప్రత్యక్షంగా గానీ, పరో క్షంగానైనా మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తు లను అదుపు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. మతతత్త్వ శక్తులను రాజ్యా నికి (స్టేట్) దూరంగా ఉంచకుండా, రాజకీ యాల్లోకి మతాన్ని చొప్పించటం ప్రజాస్వా మ్య సంస్కృతికీ, నాగరిక ప్రవర్తనకూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనది, గొడ్డలి పెట్టులాంటిదేనని మేము భావిస్తున్నాం. ఈ అభిశంసనకు ఆమోదం తెలిపినవారు: అంపశయ్య నవీన్, ఎన్.గోపి, భూ పాల్, కేతు విశ్వనాథరెడ్డి, నలిమెల భాస్కర్, డి.సు జాతాదేవి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆర్. శాం తసుందరి, కె.కాత్యాయని విద్మహే, కె.శివారెడ్డి.
 పెద్దిభొట్ల సుబ్బరామయ్య
 విజయవాడ, 91540 38840

మరిన్ని వార్తలు