ఉత్తమ విఫలనేత బాబు

5 Jun, 2015 00:48 IST|Sakshi
ఉత్తమ విఫలనేత బాబు

రాజధాని నిర్మాణానికి హుండీలు, జోలెలు పడుతున్న బాబే ప్రచారార్భాటానికి కోట్లు గుమ్మరించడం ఒక విచిత్ర వైరుధ్యం. నైతికతపై, విలువలపై ఉచితోపన్యాసాలు దంచే నారా వారు రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌లో అడ్డంగా బుక్కయ్యారు.
 
 ఇచ్చిన హామీలను నెరవేర్చ లేని వైఫల్యం, కేంద్రం నుంచి ప్రత్యేక హోదా, పన్ను రాయి తీలు సాధించలేని అసమర్థతా కలసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రి నారా చంద్రబాబు నాయు డును ఈ ఏడాది ఉత్తమ విఫల నేతను చేశాయి. తన ఏడాది పాలన సందర్భంగా ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా తన వైఫల్యాలను, అసమర్థతను చర్చకు తేవడం తథ్యమని కుటిల రాజనీతి దురంధరు డైన చంద్రబాబు ముందే పసిగట్టారు.

అందుకే ప్రజల దృష్టిని ఎన్నికల హామీలపై నుంచి మరల్చి, ఏమార్చడం కోసం ‘నవనిర్మాణ దీక్ష’ ప్రహసనానికి తెరదీశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని పదే పదే చెప్పే చంద్రబాబు దీన్ని వారం పాటూ ఊరూరా సాగే ప్రభు త్వ కార్యక్రమాన్ని చేసి, కోట్ల రూపాయల ప్రజాధనంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారు. ప్రమాణ స్వీకారం మొదలు కార్యాలయం మరమ్మతులు, ప్రత్యేక విమానాల్లో పర్యటనలు, మహానాడు వరకు ఆర్భాటాల కోసం కోట్లకు కోట్లు నీళ్లలా ఖర్చు చేసిన సంగతి తెలి సిం దే. రాజధాని నిర్మాణానికి హుండీలు, జోలెలు పడుతు న్న బాబే ప్రచారార్భాటం కోసం కోట్లు గుమ్మరించడం ఒక విచిత్ర వైరుధ్యం, ఆయన రాజకీయ మనస్తత్వం.

 ప్రజాధనం దుబారా సంగతి అలా ఉంటే, జూన్ 2 పత్రికా ప్రకటనల్లో (ప్రతిజ్ఞలో) ‘‘అవినీతి, కుట్ర రాజకీ యాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని’’ పేర్కొన్నారు. ఈ ప్రకటన చూస్తే ప్రభుత్వానికి, పార్టీకి మధ్య విభజన రేఖను బాబు స్వార్థ రాజకీయ వ్యూహంతో పూర్తిగా చెరి పేశారనిపిస్తోంది. రాజకీయ పార్టీలు వారివారి విధానాల ప్రాతిప దికన పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసు కుంటాయి, కుట్రలు ఆపాదించుకుంటాయి. కానీ ప్రభు త్వం అందరిదీ. ప్రభుత్వ  కార్యక్రమాలు, ప్రకటనలు ఎలా, ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో బాబుకు తెలి యనిది కాదు. అయినా ప్రభుత్వాన్ని పార్టీ సొంత వ్యవహారంలా మార్చేశారు. కుట్ర రాజకీయాల వలన నష్టపోయిన రాష్ట్రం అంటూ పరోక్షంగా బాబు రాష్ట్ర విభజనను కుట్రగా చిత్రించారు.

తెలంగా ణ ఏర్పాటు లేదా రాష్ట్ర విభజన కుట్ర అనే ఇదే మాటను ఆయన తెలంగాణలో చెప్పగలడా? మొన్న మహబూబ్‌నగర్ సభలో విభజనకు మొట్టమొదటి లేఖ ఇచ్చింది టీడీపీయేనని, తన లేఖ వల్లే తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. కాబట్టి ఏపీలో కూడా తాను మొదట లేఖ ఇవ్వ డం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని, ఈ కుట్రకు తానే బాధ్యుడినని చెప్పే ధైర్యం బాబుకుందా? పోనీ విభజన కుట్రని భావించడానికి ఆయన సమైక్యవాదా? అదీ కాదు. మరి ఆయన చెప్తున్న ‘కుట్ర’... కాంగ్రెస్‌పై ఎదు రుదాడికి, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే తన పైశాచిక, నెగటివ్ రాజకీయ విధానా లకు సంబంధించినది కాక మరేమిటి? తన వైఫల్యా లను, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బాబు పన్నిన రాజకీయ కుయుక్తే అసలు కుట్ర. అసలాయన రాజకీయ జీవితమే కుట్ర.


 ఇక అదే జూన్ 2 ప్రకటనలో మరొక ముఖ్య అంశం ‘అవినీతి’. నిజమే అవినీతి ఏ రూపంలో ఉన్నా దాన్ని నిలువరించేందుకు, అంతం చేసేందుకు అన్నివిధాలా, అంతా ప్రయత్నించాల్సిందే, ప్రతిజ్ఞ పూనాల్సిందే.  కానీ మొన్నటి మహానాడులో తన ఎమ్మెల్యే లను పశువుల్లా కొంటున్నారంటూ బాబు ఉపన్యాసం దంచుతున్న సమయానికే... ఆయన ప్రతినిధిగా రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో బేరసారాలు సాగి స్తున్నారని బట్టబయలైంది. అంటే బాబు సమాజానికి ఏమి ప్రబోధిస్తారో దానికి విరుద్ధమైనదాన్నే ఆచరిస్తారనే కదా! అందుకే, చెప్పేది చేయరు, చేసేది చెప్ప రు అని ఆయనకు అంత పేరు!  నైతిక తపై, విలువలపై నిత్యం ఉచితోపన్యా సాలు దంచే నారా వారు రేవంత్ ఎపిసోడ్‌లో అడ్డంగా బుక్కయ్యారు. బాబు పంపితేనే డీల్‌కు వచ్చానని రేవంత్ చెప్పటం లోకమంతా చూసింది. దేశమంతా ఈ ‘ఐదు కోట్ల డీల్’ పెద్ద చర్చనీయాంశం అయింది.

బాబే దానికి సూత్రధారి కాబట్టి ఆయనే ప్రధాన నిందితుడవుతాడని పలువురు భావిస్తున్నారు. కాబట్టి కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగడానికి వీలుగా బాబు తన పదవికి రాజీనామా చేయడం సముచితం. నిర్దోషిగా బయటపడితే ఆయన తిరిగి సీఎం కావచ్చు. అంతవరకు టీడీపీలోనే వేరొకర్ని సీఎంను చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఇక అవినీతి వ్యతిరేక క్రూసేడర్లమని చెప్పుకునే నరేంద్రమోదీగానీ, బీజేపీ గానీ, వెంకయ్యనాయుడుగానీ బాబు ‘ఐదు కోట్ల డీల్’ లో అడ్డంగా బుక్కయినా నోరుమెదపడం లేదు. అస్మ దీయుల అవినీతి పట్టకపోవడమే వారి విధానమా? ప్రజలకు స్పష్టం చేయాలి.

 ఇక నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న బాబు ప్రత్యేక హోదాతోనే సమస్యలన్నీ తీరిపోవన్నాడు. రాష్ట్ర ప్రజ లంతా ప్రత్యేక హోదా, పన్ను రాయితీల కోసం ఎదురు చూస్తుంటే, ఉద్యమిస్తుంటే బాబు ఇలా మాట్లాడటం, వారి పోరాట స్ఫూర్తిని దెబ్బతీయడానికి కాక మరెందు కు? ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీల కోసం కాం గ్రెస్ పార్టీ, వామపక్షాలు, పలు ప్రజాసంఘాలు ఉద్య మిస్తున్నాయి. అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేద్దాం, మీరే నాయకత్వం వహించం డని పిలుపునిస్తున్నాయి. కాగా బాబు ప్రకటన ప్రత్య క్షంగా ఏపీకి ద్రోహం చేసేది. నాయకుడంటే ప్రజల్లో స్ఫూర్తి నింపాలి. నిర్వీర్యం చేయకూడదు. జపాన్, కొరి యా లాంటి దేశాలు అనేక యుద్ధాల్లో నష్టపోయినా అక్క డి నాయకత్వం ప్రజల్ని పునర్నిర్మాణంలో భాగస్వాము లను చేసేలా స్ఫూర్తిని నింపి అభివృద్ధిపథంలో నిలి పారు. బాబులా నెగటివ్ మైండ్‌తో వ్యవహరిస్తే అది సాధ్యమయ్యేది కాదు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ల వీడి యో కాన్ఫరెన్స్‌లో సైతం విభజన గాయాలను గుర్తు చేయాలని పిలుపునివ్వడం బాబు నెగెటివ్ ఆలోచనా విధానానికి నిదర్శనం. ఇది ప్రజల చైతన్యాన్ని నిర్వీర్యం చేయడమే కాదు, విద్వేషాన్ని రగుల్చుతుంది.

 జూన్ 2ను రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకో డానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరని, ప్రజల మనోభావాలను గుర్తించి నవంబర్ ఒకటినే రాష్ట్ర అవత రణ దినోత్సవంగా నిర్ణయించాలని కాంగ్రెస్ చాలా కాలం క్రితమే ప్రభుత్వాన్ని కోరింది. ఇంతవరకు ప్రభు త్వం నుంచి స్పందన లేదు. జూన్ 2 నుంచి వారం రోజు లపాటు చేపట్టిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలు రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో భాగంగానే జరుగుతున్నా యా? లేదా? అనేదీ స్పష్టం చేయకపోవడం బాబు పాల న తీరుకు నిదర్శనం.


 (వ్యాసకర్త సీ రామచంద్రయ్య, ఏపీ శాసన మండలి విపక్షనేత)
 మొబైల్: 8106315555
 

>
మరిన్ని వార్తలు