బోయ-బ్రాహ్మణుడు

31 May, 2014 00:20 IST|Sakshi
బోయ-బ్రాహ్మణుడు

 తెలుగువారి చరిత్ర, సాహిత్యం ఆధారంగా వారం విడిచి వారం వస్తున్న కథల ధారావాహిక...
 
పెన్నేరు తీరంలో సింహపురి....  క్రీ.శ. 300 నెల్లూరు
 
ఊళ్లో అంతా గోలగా ఉంది. బ్రాహ్మణ పెద్ద కోదండరామశాస్త్రి తీవ్ర మంత్రాంగం చేస్తున్నాడు.
 కారణం? బోయలు వ్యవసాయ భూమ్మీద కన్నేశారు. బౌద్ధులు వాళ్లకు వంత పాడుతున్నారు. అదే జరిగితే ఇంకేమైనా ఉందా?
 ‘ఆ సింహపరిషత్తు బౌద్ధులకి మన బ్రాహ్మణులంటే పడదు. ఈ పాకనాటి (ప్రకాశం, నెల్లూరు జిల్లాలు) సాగునేలపై హక్కు బోయవాళ్లదేనంటున్నారు! ఆ బోడిబిక్కుల యుక్తి సాగితే మనకి పుట్టెడు తరినేలన్నా మిగలదు. మనం ఇక్కడ నుండి వలస పోవాల్సిందే’ అన్నాడు గోలశాస్త్రి.
 ‘అదే మంచిది. ఇక్కడ పెళ్ళీ పెటాకులు లేకుండా ఎన్నాళ్ళుంటాం? ఉండటానికి పాతిక బ్రాహ్మణ కుటుంబాలు. కానీ ఈడొచ్చిన పిల్ల ఒక్కర్తీ లేదు’ అన్నాడు కటిభట్టు.
 ‘అదేం? నీ మామ నకరశాస్త్రి పిల్లనివ్వటానికి సిద్ధంగా ఉన్నాడుగా?’
 ‘ఆహా! మా శెట్టిమామ కూతురికి నిండా ఆరేళ్లు లేవు. అది పెద్దదై కాపురానికి వచ్చేటప్పటికి నాకు ముప్పై నిండుతాయ్. అయ్యేది కాదులే. ఏ కాశీకో పోతే పుణ్యమూ పురుషార్థమూనూ’
 ‘నీకు అదైనా ఉంది! నా తలరాతకి ఈ జన్మలో పెళ్ళే కాదేమో. చూడు, పెన్నేరులో నీళ్ళు లేవు. ఆషాడం వచ్చినా ముంగారు జల్లులు లేవు. ఈ ఏడు కూడా వర్షాలు ఎండగట్టితే పిల్లాజల్లాతో అందరూ ఏ కంచికో కళింగానికో వలస పోవాల్సిందే’ అన్నాడు గోలశాస్త్రి.
 ‘అయినా నాకు తెలీకడుగుతా గోలప్పా, మా బనవాసిలో (పశ్చిమ కర్నాటక) వైశాఖ మాసానికి ముంగారుమళ వస్తాది గదా. ఇక్కడ ఎందుకింత ఆలస్యం?’ అన్నాడు కటిభట్టు.
 ‘ఏమో? కంచి పంచాంగం లెక్కకీ మీ గోకర్ణం (కర్ణాటకలో అరేబియా సముద్రతీరం) లెక్కకీ నెలన్నర తేడా. ఈ దేశంలో వానమబ్బులు తూర్పు నుండి వస్తాయట. ఎందుకంటే పరశురాముడు వరుణదేవుడిని జయించి కొంకణంలో ముందుగా వానలు కురవాలని ఆదేశించాడట. నెల గడిచినా వానలు పడకపోయేసరికి అగస్త్యమహర్షికి కోపం వచ్చి తూర్పు సముద్రాన్ని చిలికి తీరంలో వానలు పడేలా చేసాడట. అందుకే నెలరోజులు ఆలస్యం’.
 ‘సరేగానీ వానలు పడ్డాకైనా ఈ బోయలు సవుడు నేలలకి పోతారంటావా?’
 ‘అదేగదా చెప్పేది! ఈసారి బోయకొట్టాలు పశ్చిమానికి పోవంట. అటువైపు మేల్‌పాకనాటి (కడప జిల్లా బద్వేలు, మైదుకూరు ప్రాంతం) కురుబల నుండి వాళ్ళ మందలకి ప్రమాదం ఎక్కువయిందట. అందుకే ఈ తూర్పునాటిలో పన్నెండు కొట్టాలు వేసారు. బౌద్ధుల మద్దతుతో రేపు పంటభూములను ఆక్రమించుకుంటారట’ అన్నాడు గోలశాస్త్రి.
 ‘అదిగో ఆ చెట్టు కింద మన కోదండరామశాస్త్రి పాకనాటి పల్లవరాజు వీరకూర్చతో భేటీ వేశాడు. పద చూద్దాం, ఏం నిర్ణయం చేస్తారో?’
 ‘ఆహ్! పల్లవరాజు. కృష్ణకు దక్షిణాన పల్లెకొక పల్లవరాజు. వీళ్లు బోయలను ఏమీ చేయలేరు’.
 ‘ఈ బోయలు మంచి వీరులు. వీళ్ళతో విరోధం పెట్టుకోకుండా మన పక్షానికి తెస్తే మనకూ పాకనాటి పల్లవులకీ ఎదురు ఉండదు. ఆలోచించు’ అన్నాడు కటిభట్టు.
 ‘వాళ్లను దారికి తేవాలంటే ముందు బౌద్ధుల అడ్డు తొలగాలి’ అన్నాడు గోలశాస్త్రి.
 సభ అదే అభిప్రాయంతో ముగిసింది.
 బరిసెలు, కొడవళ్ళు, పలుగులు, పారలు అవి కూడా దొరక్కుంటే చేతికందిన కర్రలు, రాళ్లతో, ఆడామగ తేడా లేకుండా ఊరి జనం సింహపరిషత్తు బౌద్ధారామంపైకి ఉరికారు. వందమంది రౌతులలో వీరకూర్చ పల్లవుడు. కోదండరామశాస్త్రి కూడా కత్తిపట్టి వారిని ఉత్తేజపరుస్తూ ముందు సాగాడు. రెండు ఘడియల్లో కొండమీది సింహపరిషత్తు నేలమట్టమయింది. వందకు పైగా భిక్షువులు నేలకొరిగారు.  మిగిలినవాళ్లు పెన్నేరు దాటి కాళ్లకి బుద్ధిచెప్పారు.
 ఇక పాకనాటి వీరకూర్చ పల్లవునికి తిరుగు ఉండదు.
బౌద్ధుల పీడ వదిలింది. ఇక బోయవీరుల్ని బ్రాహ్మణ సమాజంలో కలుపుకోవడమే తరువాయి. మంగళవారం కొండ మీద నరసింహుని విగ్రహప్రతిష్ఠ. జాతరకి బోయదొరలని, గణాచారులని కూడా పిలవాలని కోదండరామశాస్త్రి తీర్మానం చేసాడు. వారిని ఆహ్వానించే పని గోలశాస్త్రి, కటిభట్టులకే పురమాయించాడు. నలుగురు పంటకాపు యోధులు తోడురాగా, ఉదయాన్నే గుర్రాలపై పశ్చిమదిశగా బయలుదేరారు.
 
కోసుదూరం సాగారో లేదో, ఏటిగట్టున పొలాల్లో  మేస్తున్న ఆలమంద. ముక్కుతాడు వేసిన ఏడడుగుల కోడెగిత్తపై స్వారీచేస్తూ వారి వంకకి వచ్చిందోక బోయపిల్ల. వయస్సు పదహారుండొచ్చు. చామనఛాయ దేహం, పొడగరి. మడిచి వెనక్కి దోపిన ఆవడా, వల్లెవాటులో, కోడెదూడ పైనుండే ‘ఏడకి పోవాలా?’ అంటూ కళ్లెగరేసింది.
 ‘గణాచారి బసవప్ప ఉండే కొట్టానికి దారి చెబుతావే పిల్లా?’ అడిగాడు గోలశాస్త్రి.
 ‘మీ బాపనయ్యలకి మాయప్పతో ఏందీ పనీ?’ ముఖం మీదకు జారుతున్న ముంగురులని వెనక్కి తోస్తూ అడిగింది.
  ‘నీకెందుకే పెద్దోళ్ల విషయం? దారి చెప్పు చాలు’ అంటూ గుర్రాన్ని కాస్త ముందుకు నడిపించాడు.
 ‘ఓహోయ్! ఈ మంగమ్మకే తెలీని పనా? పేరూ పనీ చెప్పి ముందుకి అడుగెయ్యి. మందలని మీదకి తోలినానంటే నీవూ నీ గుర్రాలు పెన్నేరులో పడతారు, తెలుసునా?’ తలెగరేసి ముక్కు ఎగబీలుస్తూ ఆ పిల్ల చేసిన సవాలుకి వారందరికీ నవ్వాగలేదు.
 ‘నెరజాణవేనే! సరెలే. నీమాట ఎందుకు కాదనాలి? బసవప్ప పాకలో మంగమ్మ అనే పెంకిపిల్ల ఉందట. దాన్ని నాకిచ్చి మనువు చేస్తాడేమో అని అడిగేందుకు పోతున్నా. ఏమంటావ్?’ అంటూ కన్ను గీటాడు గోలశాస్త్రి.
 అతడి మాటలకి ఆ కన్నెపిల్ల ముఖాన్ని సిగ్గు ముంచేసింది. ‘నా ఎనకమాలే రండి,’ అనే తడబడే మాటలతో, కోడెని వెనక్కి మళ్లించి, బోయకొట్టాం వైపునకి ఉరికించింది.

రైతాంగం - పంచాంగం
క్రీ.శ.4వ శతాబ్దం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశమంతటా రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. సముద్రగుప్తుడి అలహాబాద్ స్తంభ శాసనంలో శ్రీకాకుళం నుండి మద్రాస్ వరకూ గల  కోస్తాంధ్రలో అతడు ఓడించిన రాజులు పన్నెండు మంది. అంటే ఇప్పుడున్న తొమ్మిది జిల్లాలకి పన్నెండు మంది రాజులు. ఇక రాయలసీమలో బాణ, చోడ, గాంగ, చూట వంశాలు వేరువేరు  ప్రాంతాలలో రాజ్యం చేసాయి. ఈ సమయంలోనే శతాబ్దాల కొలదీ ఎంతోలాభసాటిగా సాగిన వాణిజ్యం కుంటుపడింది. దీనికి ముఖ్యకారణం రోమన్ సామ్రాజ్యంలో ఆర్థిక సంక్షోభం. అంటువ్యాధులు, జర్మన్ బార్బేరియన్ దాడులతో  రోమ్ నగరం మునుపటి వైభవాన్ని కోల్పోయింది. ఆంధ్రదేశపు ఆర్థికవ్యవస్థకి జీవగర్ర అయిన నేత పరిశ్రమకి, హస్తకళలకి గిరాకీ పడిపోయింది. పట్టణాలు నిర్మానుష్యమై పాడుబడసాగాయి. జీవనాధారానికి వ్యవసాయం, పశుపోషణ తప్ప వేరే దారిలోదు. భూమిపై వత్తిడి పెరిగింది. కొత్తభూములు సాగుకి తెచ్చే ప్రయత్నం సంచార ఆటవిక జనజాతులతో స్పర్థకి దారి తీసింది.  
 
 అటువంటి అరాచక పరిస్థితులలో కూడా ఆంధ్రప్రాంతానికి ఉత్తరాది నుంచి వేలకొలదీ బ్రాహ్మణ కుటుంబాలు వలస వచ్చాయి. తెలుగు బ్రాహ్మణులలో గౌడ, సారస్వత, కాన్యాకుబ్జ, మైథిలీయ, ఔత్కళ బ్రాహ్మణులు ఈ కోవకు చెందినవారే. శర్మ, శాస్త్రి, భట్టు అనే నామాంతాలు కూడా ఆ విధంగా వచ్చినవే. ఆనాటి శాసనాలలో గంగాతీరం నుంచి వచ్చిన అనేక బ్రాహ్మణ సమాజాల ప్రస్తావన ఈ వాదాన్ని బలపరుస్తుంది. సారవంతమైన కృష్ణా గోదావరీ మధ్య ప్రాంతాలలోనే గాక ఈ బ్రాహ్మణ సమూహాలు శుష్క భూములైన రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి. వ్యవసాయ విస్తరణలో నేర్పు చూపి స్థానిక జనజాతులని గ్రామీణ సామాజిక  వ్యవస్థలో కలుపుకోగలిగిన నాయకులు బలోపేతులై స్వతంత్ర రాజ్యాలు స్థాపించగలిగారు. ఈ నూతన పాలక వర్గానికి బ్రాహ్మణులు ముఖ్యంగా రెండు విధాలుగా సహకరించారు.
 
 1. గ్రామీణ సమాజంలో కలసిన జనజాతులకు వృత్తి బృందాలకు వర్ణవ్యవస్థలో నిర్ణీతమైన స్థానం ఏర్పరిచి యాజమాన్య వ్యవస్థ ద్వారా రాజుకి, రైతుకి, గ్రామానికి మధ్య వర్తిత్వం నిర్వహించటం.
 2. సామాన్యంగా శూద్రవర్ణం నుంచి వచ్చిన ఈ స్థానిక నాయకులకి పౌరాణిక సూర్యచంద్ర వంశాల వారసత్వం కల్పించి వారికి క్షత్రియ హోదా, దానికి తగిన హంగులు, బిరుదులూ ఇచ్చి రాజ్యార్హత ఖరారు చేయటం.
 అందుకు ప్రతిఫలంగా బ్రాహ్మణులు స్థానిక నాయకుల వద్ద నుంచి బ్రహ్మదాయ (బ్రాహ్మణులకు ఇచ్చిన దానం), దేవాదాయాలు (గుడికి) గ్రహించి భూస్వాములై సమాజంలో ప్రముఖ వర్గంగా ఎదిగారు. ఈ ప్రక్రియలో బౌద్ధ జైన వ్యవస్థలు వెనుకబడి తమ ప్రాముఖ్యాన్ని కోల్పోసాగాయి. ఆ కాలం నుంచి శాసనాలు ముఖ్యంగా బ్రాహ్మణులకు, దేవాలయాలకు చేసిన దానాలనే ప్రస్తావిస్తాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని అనేక శాసనాలలో రాజులు బోయబ్రాహ్మణులకు భూదానాలు ఇచ్చిన ప్రసక్తి ఉంది. కొండనగూరు శాసనంలో బోయలు దానగ్రహీతలుగానే కాక  సాక్షులుగా సంతకాలు చేశారు. అంటే, ఆనాటి ఆర్థిక, రాజకీయ చట్రంలో ప్రాముఖ్యం ఉన్న జనజాతులకు గ్రామీణ సమాజంలోని ఉచ్ఛవర్ణాలలో స్థానం కల్పించారని అర్థమవుతుంది.
 
కృషి పారాశరం. సూర్యసిద్ధాంతం వంటి గ్రంథాలు ఆనాటి బ్రాహ్మణులకు వ్యవసాయ శాస్త్రంలో, ఋతు కాలమానంతో ఉన్న పరిచయాన్ని తెలుపుతాయి. వైదిక క్రతువులు, ఆలయాల నిర్వహణ, ఇంట్లో చేసుకునే అన్నప్రాసన, వివాహం వంటి కార్యాల పౌరోహిత్యం బాధ్యతలు తమ చేతిలో ఉంచుకొని గ్రామీణ ప్రజని సామాజిక చట్రంలో బిగించడంలో సఫలులయ్యారు. ఇప్పటికీ మన తెలుగు రైతులకి కొత్త సంవత్సరం బాపనయ్య చెప్పే పంచాంగంతో గానీ మొదలవదు.
 ఊళ్లో అంతా గోలగా ఉంది. బ్రాహ్మణ పెద్ద కోదండరామశాస్త్రి తీవ్ర మంత్రాంగం చేస్తున్నాడు.
 కారణం? బోయలు వ్యవసాయ భూమ్మీద కన్నేశారు. బౌద్ధులు వాళ్లకు వంత పాడుతున్నారు. అదే జరిగితే ఇంకేమైనా ఉందా?
 ‘ఆ సింహపరిషత్తు బౌద్ధులకి మన బ్రాహ్మణులంటే పడదు. ఈ పాకనాటి (ప్రకాశం, నెల్లూరు జిల్లాలు) సాగునేలపై హక్కు బోయవాళ్లదేనంటున్నారు! ఆ బోడిబిక్కుల యుక్తి సాగితే మనకి పుట్టెడు తరినేలన్నా మిగలదు. మనం ఇక్కడ నుండి వలస పోవాల్సిందే’ అన్నాడు గోలశాస్త్రి.
 ‘అదే మంచిది. ఇక్కడ పెళ్ళీ పెటాకులు లేకుండా ఎన్నాళ్ళుంటాం? ఉండటానికి పాతిక బ్రాహ్మణ కుటుంబాలు. కానీ ఈడొచ్చిన పిల్ల ఒక్కర్తీ లేదు’ అన్నాడు కటిభట్టు.
 ‘అదేం? నీ మామ నకరశాస్త్రి పిల్లనివ్వటానికి సిద్ధంగా ఉన్నాడుగా?’
 ‘ఆహా! మా శెట్టిమామ కూతురికి నిండా ఆరేళ్లు లేవు. అది పెద్దదై కాపురానికి వచ్చేటప్పటికి నాకు ముప్పై నిండుతాయ్. అయ్యేది కాదులే. ఏ కాశీకో పోతే పుణ్యమూ పురుషార్థమూనూ’
 ‘నీకు అదైనా ఉంది! నా తలరాతకి ఈ జన్మలో పెళ్ళే కాదేమో. చూడు, పెన్నేరులో నీళ్ళు లేవు. ఆషాడం వచ్చినా ముంగారు జల్లులు లేవు. ఈ ఏడు కూడా వర్షాలు ఎండగట్టితే పిల్లాజల్లాతో అందరూ ఏ కంచికో కళింగానికో వలస పోవాల్సిందే’ అన్నాడు గోలశాస్త్రి.
 ‘అయినా నాకు తెలీకడుగుతా గోలప్పా, మా బనవాసిలో (పశ్చిమ కర్నాటక) వైశాఖ మాసానికి ముంగారుమళ వస్తాది గదా. ఇక్కడ ఎందుకింత ఆలస్యం?’ అన్నాడు కటిభట్టు.
 ‘ఏమో? కంచి పంచాంగం లెక్కకీ మీ గోకర్ణం (కర్ణాటకలో అరేబియా సముద్రతీరం) లెక్కకీ నెలన్నర తేడా. ఈ దేశంలో వానమబ్బులు తూర్పు నుండి వస్తాయట. ఎందుకంటే పరశురాముడు వరుణదేవుడిని జయించి కొంకణంలో ముందుగా వానలు కురవాలని ఆదేశించాడట. నెల గడిచినా వానలు పడకపోయేసరికి అగస్త్యమహర్షికి కోపం వచ్చి తూర్పు సముద్రాన్ని చిలికి తీరంలో వానలు పడేలా చేసాడట. అందుకే నెలరోజులు ఆలస్యం’.
 ‘సరేగానీ వానలు పడ్డాకైనా ఈ బోయలు సవుడు నేలలకి పోతారంటావా?’
 ‘అదేగదా చెప్పేది! ఈసారి బోయకొట్టాలు పశ్చిమానికి పోవంట. అటువైపు మేల్‌పాకనాటి (కడప జిల్లా బద్వేలు, మైదుకూరు ప్రాంతం) కురుబల నుండి వాళ్ళ మందలకి ప్రమాదం ఎక్కువయిందట. అందుకే ఈ తూర్పునాటిలో పన్నెండు కొట్టాలు వేసారు. బౌద్ధుల మద్దతుతో రేపు పంటభూములను ఆక్రమించుకుంటారట’ అన్నాడు గోలశాస్త్రి.
 ‘అదిగో ఆ చెట్టు కింద మన కోదండరామశాస్త్రి పాకనాటి పల్లవరాజు వీరకూర్చతో భేటీ వేశాడు. పద చూద్దాం, ఏం నిర్ణయం చేస్తారో?’
 ‘ఆహ్! పల్లవరాజు. కృష్ణకు దక్షిణాన పల్లెకొక పల్లవరాజు. వీళ్లు బోయలను ఏమీ చేయలేరు’.
 ‘ఈ బోయలు మంచి వీరులు. వీళ్ళతో విరోధం పెట్టుకోకుండా మన పక్షానికి తెస్తే మనకూ పాకనాటి పల్లవులకీ ఎదురు ఉండదు. ఆలోచించు’ అన్నాడు కటిభట్టు.
 ‘వాళ్లను దారికి తేవాలంటే ముందు బౌద్ధుల అడ్డు తొలగాలి’ అన్నాడు గోలశాస్త్రి.
 సభ అదే అభిప్రాయంతో ముగిసింది.
 బరిసెలు, కొడవళ్ళు, పలుగులు, పారలు అవి కూడా దొరక్కుంటే చేతికందిన కర్రలు, రాళ్లతో, ఆడామగ తేడా లేకుండా ఊరి జనం సింహపరిషత్తు బౌద్ధారామంపైకి ఉరికారు. వందమంది రౌతులలో వీరకూర్చ పల్లవుడు. కోదండరామశాస్త్రి కూడా కత్తిపట్టి వారిని ఉత్తేజపరుస్తూ ముందు సాగాడు. రెండు ఘడియల్లో కొండమీది సింహపరిషత్తు నేలమట్టమయింది. వందకు పైగా భిక్షువులు నేలకొరిగారు.  మిగిలినవాళ్లు పెన్నేరు దాటి కాళ్లకి బుద్ధిచెప్పారు.
 ఇక పాకనాటి వీరకూర్చ పల్లవునికి తిరుగు ఉండదు.
           
బౌద్ధుల పీడ వదిలింది. ఇక బోయవీరుల్ని బ్రాహ్మణ సమాజంలో కలుపుకోవడమే తరువాయి. మంగళవారం కొండ మీద నరసింహుని విగ్రహప్రతిష్ఠ. జాతరకి బోయదొరలని, గణాచారులని కూడా పిలవాలని కోదండరామశాస్త్రి తీర్మానం చేసాడు. వారిని ఆహ్వానించే పని గోలశాస్త్రి, కటిభట్టులకే పురమాయించాడు. నలుగురు పంటకాపు యోధులు తోడురాగా, ఉదయాన్నే గుర్రాలపై పశ్చిమదిశగా బయలుదేరారు.

కోసుదూరం సాగారో లేదో, ఏటిగట్టున పొలాల్లో  మేస్తున్న ఆలమంద. ముక్కుతాడు వేసిన ఏడడుగుల కోడెగిత్తపై స్వారీచేస్తూ వారి వంకకి వచ్చిందోక బోయపిల్ల. వయస్సు పదహారుండొచ్చు. చామనఛాయ దేహం, పొడగరి. మడిచి వెనక్కి దోపిన ఆవడా, వల్లెవాటులో, కోడెదూడ పైనుండే ‘ఏడకి పోవాలా?’ అంటూ కళ్లెగరేసింది.
 ‘గణాచారి బసవప్ప ఉండే కొట్టానికి దారి చెబుతావే పిల్లా?’ అడిగాడు గోలశాస్త్రి.
 ‘మీ బాపనయ్యలకి మాయప్పతో ఏందీ పనీ?’ ముఖం మీదకు జారుతున్న ముంగురులని వెనక్కి తోస్తూ అడిగింది.
 
 ‘నీకెందుకే పెద్దోళ్ల విషయం? దారి చెప్పు చాలు’ అంటూ గుర్రాన్ని కాస్త ముందుకు నడిపించాడు.
 ‘ఓహోయ్! ఈ మంగమ్మకే తెలీని పనా? పేరూ పనీ చెప్పి ముందుకి అడుగెయ్యి. మందలని మీదకి తోలినానంటే నీవూ నీ గుర్రాలు పెన్నేరులో పడతారు, తెలుసునా?’ తలెగరేసి ముక్కు ఎగబీలుస్తూ ఆ పిల్ల చేసిన సవాలుకి వారందరికీ నవ్వాగలేదు.
 ‘నెరజాణవేనే! సరెలే. నీమాట ఎందుకు కాదనాలి? బసవప్ప పాకలో మంగమ్మ అనే పెంకిపిల్ల ఉందట. దాన్ని నాకిచ్చి మనువు చేస్తాడేమో అని అడిగేందుకు పోతున్నా. ఏమంటావ్?’ అంటూ కన్ను గీటాడు గోలశాస్త్రి.
 
అతడి మాటలకి ఆ కన్నెపిల్ల ముఖాన్ని సిగ్గు ముంచేసింది. ‘నా ఎనకమాలే రండి,’ అనే తడబడే మాటలతో, కోడెని వెనక్కి మళ్లించి, బోయకొట్టాం వైపునకి ఉరికించింది.
           
 నరసింహుని విగ్రహ ప్రతిష్ఠరోజు పెద్ద ఆర్భాటం జరిగింది. వీరకూర్చ పల్లవరాజు తలపై నాగమణితో పుట్టిన మహాభారత వీరుడని అశ్వద్ధామ వంశంలో పుట్టాడని కోదండశాస్త్రి ప్రకటించాడు. సామూహిక ఉపనయనంలో గణాచారి బసవప్ప బసివిశాస్త్రిగా మారాడు. అతడి కూతురు మంగమ్మ నూరు గోవుల వరదక్షిణతో గోలశాస్త్రికి ఇల్లాలయింది. బోయలు దారికి వచ్చినందుకు ఆనందం పట్టలేని వీరకూర్చ రాజు పాతికమంది బోయదొరల సాక్షిగా మేల్‌పాకనాడలో నూరు పన్నాసల భూమిని బోయబ్రాహ్మణుడు బసివిశాస్త్రికి అమ్మవారి ఆలయాల నిర్మాణం కొరకు సకల కర పరిహారంగా ధారాదత్తం చేసాడు. బోయల పెద్దదొర నాగరాజు కురుబలపై యుద్ధానికి పల్లవ సేనకి సాయంగా పదివేల బోయవీరులని నడిపించేందుకు ఒప్పందం చేసుకొని, దానికి హామీగా అతడి కూతుర్ని రాకుమారుడు సింహవర్మకి రాణిగా సమర్పించాడు.ఆ వివాహం దక్షిణాపథంలో పల్లవ ప్రాభవానికి నాంది పలికింది.
 saipapineni@gmail.com

మరిన్ని వార్తలు