ఆయన ఒక అంకెల మాంత్రికుడు

10 Sep, 2014 00:40 IST|Sakshi
ఆయన ఒక అంకెల మాంత్రికుడు

బాల్యంలో ఎక్కాలతో ఆటాడుకున్న ఆ బాలుడు గణాంకశాస్త్రంలో మేటి శాస్త్రజ్ఞుల సరసన నిలబడ్డారు. సాంఖ్యశాస్త్రం పేరు చెబితే నేటికీ
 డా॥సి.ఆర్.రావు గురించి తప్పక పేర్కొంటారు. 14 పుస్తకాలు, 350 పరిశోధనా పత్రాలు వెలువరించిన వీరు నేటికీ పరిశోధిస్తూనే ఉన్నారు.
 
అమోఘమైన ప్రతిభ, అపారమైన పట్టుదల, అమితమైన భాషాభిమానం, అమేయమైన దేశ భక్తి - ఒకే వ్యక్తిలో మేళవించడం అసాధా రణ సందర్భం! అలాంటి వ్యక్తి జగదీశ్ చంద్రబోస్, శ్రీనివాస రామానుజం, సీవీ రామన్, హరగోవింద ఖొరానా, సత్యేంద్రనాథ్ బోస్, హోమీ జహంగీర్ భాభా, జి.ఎన్.రామచం ద్రన్, హరీష్ చంద్ర వంటి మహామహుల సరసన నిలవడం ఇంకా అపురూ పం!! ఈ అంకెల అద్భుతం, గణాంక శాస్త్ర శిఖరం పేరు డా॥కల్యంపూడి రాధాకృష్ణా రావు. ఈ పూర్తి పేరుతో పేర్కొంటే ఈయన  తెలుగువాడని మనకు తెలియవచ్చు కానీ, ప్రపంచంలో చాలా మందికి తెలియకపో వచ్చు. ఎందుకంటే డా॥సి.ఆర్. రావుగానే వారు అంతర్జాతీయ కీర్తి పొందారు.

93 ఏళ్లు నిండిన ఈ ముదుసలి ఇంకా యావత్ ప్రపంచం గర్వించే రీతిలో నేటికీ స్టాటిస్టిక్స్ పరిశోధన చేస్తున్నారు. వారి దేశ భక్తి గురించి విశదం చేసే రెండు సందర్భాలు చూద్దాం. 1963లో డా॥సి.ఆర్.రావు గారికి భట్నాగర్ అవార్డు ప్రకటించారు. ఆ సమ యంలో మన దేశం చైనాతో యుద్ధంలో పోరాడుతోంది. అప్పటి ప్ర ధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ అవార్డు ప్రదానం చే స్తూ పదివేల రూపాయల నగదును రావు గారికి అం దించారు. ‘ఈ డబ్బు నాకన్నా దేశానికే ఎక్కువ అవసరమం’టూ ప్రధాన మంత్రి నిధికి విరాళంగా తిరిగి ఇచ్చారు. దాంతో నెహ్రూ పొంగిపోయి ఆయ న్ను కావులించుకున్నారు. ఇది 1963 ముచ్చట. 2010 సంగతి చూద్దాం. రావు జీవిత కాలపు కృషికి ఇండియా సైన్స్ అవార్డు పేర 25 లక్షల రూపా యల అవార్డును నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రదానం చేశారు. ఈ అవార్డును హైద రాబాద్‌లో స్వీకరిస్తూ - ఆ ధనంతో గణితం, గణాంకశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ రంగాల కొరకు ప్రపంచస్థాయి సంస్థను ప్రారంభి స్తున్నట్లు ప్రకటించారు. దాంతో పొంగిపో యిన ప్రధాని రూ.15 కోట్లు మంజూరు చేశా రు. రావు సతీమణి భార్గవి తాను దాచుకున్న నగలు, ధనం ఈ సంస్థకు విరాళంగా ఇవ్వడం కొసమెరుపు. అలా ఏర్పడినదే సీఆర్ రావ్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్.

జాతీయ, అంతర్జాతీ య విశ్వవిద్యాలయాలు ఆయనకు 30కి పైగా డాక్ట రేట్లు ఇచ్చాయి. అలా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చిన గౌరవ డాక్టరేట్‌ను స్వీకరిస్తూ - థీసెస్సు రాని డాక్టరేటు తీసుకుంటానం టే, అప్పుడు తిరస్కరించి ఇప్పుడు పళ్లెంలో పెట్టి ఇస్తున్నారని ఆయన చమ త్కరించారు. దరఖాస్తు చే యడంలో రెండు రోజులు ఆలస్యమైందని నాటి ప్రిన్సిపల్ విస్సా అప్పా రావు, వైస్ చాన్స్‌లర్  సీఆర్ రెడ్డి కుదరదన్నా రు మరి. అప్పట్లోనే ఆర్మీ సర్వే యూనిట్‌లో మేథమేటిషియన్ ఉద్యోగం కోసం కలకత్తా వెళ్లారు. అక్కడ ఎంపిక కాలేదు, కానీ బస చేసిన హోటల్ దగ్గర పరిచయమైన సుబ్ర మణ్యం ఒక గొప్ప పనిచేశాడు. కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూ ట్‌లో పనిచేస్తున్న డా॥మహల్నాబీస్ గారికి పరిచయం చేశారు. శిక్షకుడిగా చేరి, అక్కడే ఎంఏ స్టాటిస్టిక్స్ చేసి - అదే సంస్థలో పదవీ విరమణ చేశారు రావుగారు.

సాంఖ్యశాస్త్రం లేదా గణాంకశాస్త్రం గురిం చి చెప్పుకొన్నప్పుడు రావు గురించి తప్పక పేర్కొంటారు. అంత గొప్పది మరి ఆయన కృషి. పాతికేళ్ల వయసులో ప్రతి పాదించిన ‘క్రామర్-రావ్’ ఇనీక్వాలిటీ ఎంతో పేరు గాంచింది. ఇంకా వారి పేరుతో పలు ఆవిష్కరణలున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ గౌరవాన్ని పొందిన సిద్ధాంతాలు. 14 పుస్తకాలు, 350 పరిశోధనా పత్రాలు వెలు వరించిన వీరు నేటికీ పరిశోధన చేస్తున్నారు.

జీవిత వివరాలు: కర్ణాటకలో ఉండే హవి న హడగల్లిలో సి.దొరైస్వామి నాయుడు - లక్ష్మీకాంతమ్మ దంపతులకు 1920, సెప్టెంబర్ 10న రాధాకృష్ణ జన్మించాడు. అష్టమ సంతా నానికి శ్రీకృష్ణుడి పేరు పెట్టుకోవడం ఒక సం ప్రదాయం. గూడూరు, నందిగామ, నూజి వీడు, విశాఖపట్నంలలో విద్యాభ్యాసం సాగిం ది. తండ్రి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా పని చేస్తూ, బదిలీ కావడమే కారణం. తల్లి ప్రేర ణతో, చాలా చిన్న వయసులో ఎక్కాలే కాదు, వేటూరి ప్రభాకరశాస్త్రి చాటు పద్య మణిమం జరిని కూడా ఆరాధించాడు. ఎనిమిదో తరగతి నుంచి విశాఖపట్నంలోని మిసెస్ ఏవీఎన్ కాలేజీలో చదివారు. అక్కడే చదివిన విఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ తన తండ్రి పేర చంద్రశేఖర్ అయ్యర్ స్కాలర్‌షిప్ ఏర్పరి చా రు. దీన్ని సి.ఆర్.రావు రెండుసార్లు పొందడం విశేషం.

 (వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త)  డా॥వేణుగోపాల్
 
 

మరిన్ని వార్తలు