విరాటపర్వం: సురేంద్రనాథ్ వ్యాఖ్యానం

22 Mar, 2014 03:45 IST|Sakshi
విరాటపర్వం: సురేంద్రనాథ్ వ్యాఖ్యానం

వింటే భారతం వినాలి. అయితే ఎవరి నోట వినాలి? ఎవరు యోగ్యులో, ఎవరు పండితులో, ఎవరు మహాభారత హృదయ ప్రవేశం ఎరగినవారో, ఎవరు అందలి మాయను, మర్మాన్ని, మహా దర్శనాన్ని విడమర్చి సాక్షాత్కారింపచేయగలరో వారి నోటి గుండా వినాలి. అప్పుడే ఆ రుచి తెలుస్తుంది. సాంప్రతి సురేంద్రనాథ్ భారతాన్ని ఔపోసన పట్టారు. మహా భారత వ్యాఖ్యాతగా వాసికెక్కారు. ముంబైలోని తెలుగు కుటుంబాలు గత మూడు నాలుగేళ్లుగా ప్రతి ఆదివారం ఆయన ద్వారా మహాభారత వ్యాఖ్యానం చెప్పించుకుని ఆ పంచమవేదాన్ని ప్రీతిపాత్రం చేసుకుంటున్నాయి.

అంతే కాదు ఆ వ్యాఖ్యానాలను  పుస్తకాలుగా కూడా వెలువరించబూనుకున్నాయి. ఆ వరుసలో మొదటగా వచ్చిందే ఈ విరాటపర్వం. వ్యాసభారతం- అంటే మూలం ఆధారంగా సాగుతున్న ఈ వ్యాఖ్యానం వల్ల కాలక్రమంలో వచ్చిన అనేకానేక భారతాల వల్ల వాటిలో చోటు చేసుకున్న ప్రక్షిప్తాల వల్ల ఏర్పడిన కొన్ని అయోమయాలు సందేహాలు దురభిప్రాయాలు దూరం చేసుకోవచ్చు. ఇందులోని కొన్ని వ్యాఖ్యానాలు- ముఖ్యంగా ద్రౌపది గాంభీర్యం, కీచుకుని ఆరాటం, సుదేష్ణ ఓదార్పు, ఉప కీచకుల శోకం వంటివి చదివి తీరదగ్గవి.
 

రసోభ్యుదయోల్లాసి- విరాటపర్వం- మొదటిభాగం                                                                                                                      సాంప్రతి సురేంద్రనాథ్ వ్యాఖ్యానం; వెల: రూ.100;
 ప్రతులకు: 040-27832081, 98480 60579
 

మరిన్ని వార్తలు