బాబూ! ఏదీ ప్రత్యేక హోదా?

17 Aug, 2015 23:36 IST|Sakshi
బాబూ! ఏదీ ప్రత్యేక హోదా?

సందర్భం
 

మోదీ, బాబుల అభివృద్ధికి అర్థం... దేశాన్ని, రాష్ట్రాన్ని కార్పొరేటు గుత్తాధిపతుల భోజ్యంగా మార్చేయడమే. ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి లభించే రాయితీలు, నిధులు దుర్వినియోగం కాకుండా ఉద్యమకారులు జాగ్రత్త వహించాలి.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఏపీకి వాగ్దానం చేసిన ప్రత్యేక హో దాను కోరుతూ రాష్ట్ర వ్యాప్త విస్తృత ప్రజా ఉద్యమాలు ఆరంభమైనాయి. ప్రత్యేక హో దా సాధన కోసం మొదటి నుంచి చొరవతో కృషి చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఢిల్లీలో నిర్వ హించిన భారీ ధర్నా ఈ సమస్యకు జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చింది. కాగా, తిరుపతిలో మునికోటి విషాదకరమైన రీతిలో ఆత్మాహుతికి పాల్పడి ప్రాణాల ర్పించడంతో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంది. దీంతో గాలివాటం మాటకు మారుపేరైన చంద్రబాబు సైతం అదే పాట అందుకున్నారు. 14 నెలలుగా ప్రత్యేక హోదా ఊసే ఎత్తని బాబు నిద్రాహారాలు మాని ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తున్నారని ‘తెలుగు’ తమ్ముళ్ల భజన మొదలైంది. సింగపూర్, జపాన్, చైనా, ఇస్తాం బుల్ తదితర ప్రపంచ నగరాలను తలదన్నేలా నిర్మించే రాజధానీ, అందులో పుట్టుకురానున్న ఆకాశహార్మ్యాలు, ఫ్లైఓవర్లు, మెట్రోలు, నదీ విహార విలాసాలు, పర్యాటక కేంద్రాలు, షాపింగ్ మాల్స్, ఫైవ్‌స్టార్ హోటళ్ల గోల తప్ప బాబు నోట మరే మాటా రాష్ట్ర ప్రజ విని ఉండ లేదు. హఠాత్తుగా ఆయన ప్రత్యేక హోదా అనడం విడ్డూరమే.

వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ఆ పార్టీ నేత జగన్‌మోహన్ రెడ్డి ఇంతకాలం ఓపికగా ప్రజలకు విభజన వలన కలిగిన నష్టాలను అధిగమించడానికి ప్రత్యేక హోదా ఎలా, ఎంతగా తోడ్పడుతుందో వివరించారు. అదే సమ యంలో టీడీపీ మంత్రులు, నేతలంతా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తెస్తామని చెబుతూ వచ్చారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఒకటేనన్నట్టు ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. కేంద్రంలో అధికారం తమదేనని ఏమైనా సాధించగలమని మాట్లాడారు. ఇప్పుడు ప్రజల నాడిని గ్రహించి ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారు. హక్కుగా నిలదీసి సాధించుకోవాల్సిన ప్రత్యేక హోదా కోసం ‘మ్యావ్! మ్యావ్!’ అంటున్నారు. మోదీ చుట్టూ తోకాడించుకుంటూ తిరగడానికి ఢిల్లీ ప్రయాణాలు క డుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీతో పాటూ సీపీఐ, సీపీఎంలేగాక కాంగ్రెస్, సినీ నటుడు శివాజీ ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో ఉన్నారు. చేగువేరాకు, మోదీకి  సులువుగా ముడిపెట్టేయగల ‘రాజకీయ వేత్త’ గా రాటుదేలిన పవన్ కల్యాణ్ తన ‘జనసేన’తో సహా తాజాగా ఈ ఉద్యమంలో చేరారు.

ముందు ముందు ఈ ఉద్యమం ఒకప్పటి ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ ఉద్యమంలా వ్యాపించేట్టు కనిపి స్తోంది. ఈ దృష్ట్యా ఉద్యమంలో పాల్గొంటున్న పార్టీలు, ప్రజలు ఒక విషయంలో జాగరూకులై ఉండాల్సి ఉంది. ఒకప్పుడు మనం  సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగా రం ప్రభుత్వ రంగంలో ఉండి. రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు ఉపయోగపడింది. కానీ మోదీ, బాబు చెప్పే అభివృద్ధికి అర్థం ఒక్కటే... దేశాన్ని, రాష్ట్రాన్ని కార్పొరేటు గుత్తాధి పతుల భోజ్యంగా మార్చేయడమే. పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, ‘అభివృద్ధి’ కోసం భూములు కోల్పోయి దిక్కులేనివారయ్యే రైతులు, రోజు కూలీల స్థాయికి దిగ జారుతున్న పారిశ్రామిక కార్మికులు, ప్రైవేటు ఉద్యో గులు, ప్రభుత్వరంగ కాంట్రాక్టు కూలీలు, పెరుగుతున్న నిరుద్యోగులు వారికి కనబడరు. ఇలాంటి పరిస్థితిలో ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకున్నా అది ఈన గాచి నక్కల పాలు చేసిన చందం కాకుండా చూసు కోవాల్సి ఉంది. ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి లభించే రాయితీలు, నిధులు దుర్వినియోగం కాకుండా జాగ్రత్త వహించాలి. జాతీయ హోదాతో, కేంద్రం నిధు లతో నిర్మించాల్సిన పోలవరాన్ని పక్కనబెట్టి, అస్మదీ యులకు లాభం చేకూర్చే పట్టిసీమను నిర్మిస్తున్న ఘను లు వీళ్లు, ఏమైనా చేయగలరు! ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు చేరేలా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ఉద్యమిస్తున్న ప్రజలు, పార్టీలు, నేతలదే.

‘రుణ మాఫీ’ వాగ్దానంతో నమ్మించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రైతులకు, డ్వాక్రా మహిళలకు మొండి చెయ్యి చూపిన వైనం ఎవరూ మరచిపోలేదు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి మొదలైన టీడీపీ ప్రభుత్వ వాగ్దాన భంగాల జాబితాను రాయాలంటే రామకోటం త. పైగా ‘‘నేను నిప్పుని, నిప్పుని’’అని నిత్య జపం చేసే బాబు, ఆయన అస్మదీయుల అవినీతి అడుగడుగునా కనిపిస్తూనే ఉంది. ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో  ‘‘నికార్సయిన నిప్పు’’ ‘‘ఆంధ్రా హజారే’’ బాబు భ్రష్ట చరిత్రను ప్రజలంతా కళ్లారా చూశారు, చెవులారా విన్నారు. అయినా సిగ్గు విడిచి ఎంఎల్‌ఏలను కొంటూ రెండ్ హ్యాండెడ్‌గా దొరికిన తమ ఎంఎల్‌ఏ రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పట్టాడు. చేసిన సిగ్గుచేటు పనికి పశ్చా త్తాపం ప్రకటించడానికి బదులు అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌లు చేశారంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఎదు రు దాడికి దిగిన ఘనుడు చంద్రబాబు. పన్నెండే ళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు సైతం తన ఘనత వల్లే వచ్చాయన్నట్టుగా ప్రచారం చేసుకోగలిగిన అల్ప త్వం ఆయనది. ఆ అల్పత్వానికి దాదాపు ముప్పయి నిండు ప్రాణాలు బలి కావాల్సి వచ్చింది. రాజకీయ సన్యాసం స్వీకరించాల్సినంతటి మహా నేర భారాన్ని మోస్తూ కూడా.. ఇదేమి ఘోరమంటే, ‘శవ రాజకీ యాలు చేస్తున్నార’ని ఎదురు దాడి చేయగల అమా నవీయత బాబుకే స్వంతం. అందుకే ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వారంతా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే చీమలు చేసిన పుట్టలో పాములు దూరిన చం దం అయ్యే ప్రమాదం ఉంది. ఈ జాగరూకతతో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం మహోధృతంగా సాగాలని కోరుకుందాం.

 http://img.sakshi.net/images/cms/2015-08/51439835628_Unknown.jpg








ఏపీ విఠల్
వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు
ఫోన్: 98480 69720
 
 

మరిన్ని వార్తలు