ప్రైవేట్ విద్యాసంస్థల ‘తనిఖీ’ తప్పదా?

5 May, 2016 00:39 IST|Sakshi

చాలా ప్రైవేట్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు అనే విషయం బహిరంగ రహస్యం. ఇక్కడ మౌలిక సదుపాయాలు అంటే మొదటిది. టీచింగ్ స్టాఫ్. రెండవది నాన్ టీచింగ్ స్టాఫ్. మూడవది ప్రయోగశాలలు, నాలుగవది తరగతి గదులు మొదలైనవి. వీటిలో ఒక్కొక్క దానిని గురించి పరిశీ లించినట్లయితే మొదటిది టీచింగ్ స్టాఫ్. చాలా కళాశాలలు సరిపడా అధ్యాపకులను నియమించు కోవడం లేదు.
 
 ఉదాహరణకు ఒక కళాశాల బీఎస్‌సీ, బీజెడ్‌సీకి రెండు సెక్షన్‌లకు అనుమతి తీసుకుని ఒకే సెక్షన్‌కి అధ్యాపకుడిని నియమించుకుని కళాశాలను నడ పడం. పోనీ.. ఆ  అధ్యాపకుడు అయినా ఆ కళాశా లలో ఫుల్‌టైమ్ చేస్తాడా అంటే అదీ ఉండదు. ఒకే అధ్యాపకుడు అదే పట్టణంలో రెండు మూడు కళాశా లల్లో బోధిస్తాడు. దీనివలన కళాశాలలు వేతనాలు తగ్గించుకుని లాభపడటం, విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది. రెండోది నాన్ టీచింగ్ స్టాఫ్. అటెం డర్ నుంచి ప్రిన్సిపాల్ వరకు అందరూ దీనికిందికే వస్తారు. ఇక్కడ ప్రధానమైన లోపం ఎక్కడ కనపడు తుంది అంటే ప్రయోగశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌లు. లైబ్రరీలో లైబ్రేరియన్‌లు అసలుకే ఉండరు. ఎందు కంటే కళాశాలలో ప్రయోగశాలలు లైబ్రరీలు అంతంత మాత్రమే కాబట్టి, ఇక మూడవది ప్రయోగ శాలలు. ఇవి పేరుకే ఉంటున్నాయి. రూము ముందు ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ అని ఉంటుంది కానీ ల్యాబ్‌లో సరైన ప్రయోగ పరికరాలు ఉండవు. నాలుగవది లైబ్రరీ సౌకర్యం. చాలా కళాశాలల్లో లైబ్రరీ మొత్తం ఒక్క బీరువాకే పరిమితమై కని పిస్తుంది. వాస్తవానికి విద్యార్థులందరికి సరిపడా పుస్తకాలు ఉండాలి. కాని చాలా చోట్ల మనకు అలాంటి పరిస్థితి కనబడదు. ఇక ఐదవది. తరగతి గదులు, అనుమతి పొందిన గ్రూపులకు సరిపడ తరగతి గదులు చాలా కళాశాలల్లో మనకు కనబడవు. కొన్ని కళాశాలల్లో వివిధ గ్రూపుల విద్యార్థులను కలిపి పాఠాలు బోధిస్తారు.
 
 ఇక ముఖ్యమైన అంశం ఏమంటే ప్రైవేటు కళా శాలలు.. క్లాసులకే రాని పిల్లలకు కూడా హాజరు శాతం వేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొంది లబ్దిపొం దుతున్న విషయం మనం గమనించాలి. ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నప్పుడు వాటిని తీసుకుంటున్న కళాశాలలు మౌలిక సదుపా యాలను కల్పించి విద్యావ్యవస్థ అభివృద్ధికి దోహద పడాలి. లేకుంటే విద్యావ్యవస్థకు పెను ప్రమాదం పొంచివుండే కాలం ఎంతో దూరంలో లేదు.
 పై కారణాల వల్ల ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల్లో తనిఖీలు చేసి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రయోగశాలలు, లైబ్రరీ సౌకర్యం, సరిపడ తరగతి గదులు గల కళాశాలలకు మాత్రమే అనుమతి ఇచ్చి, ఎవరైతే విద్యార్థులు కళాశాలలకు సక్రమంగా హాజరవు తారో వారికే స్కాలర్‌షిప్‌లు అందేలాగా చర్యలు తీసుకోవాలి. దీనికోసం విద్యార్థు లందరూ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తీసుకు వస్తున్న బయో మెట్రిక్ విధానం విద్యార్థులతోపాటు, అధ్యాపకులకి  కూడా వర్తించేటట్టు చేయాలి.
 మోదాల్ మల్లేష్, జంతుశాస్త్ర అధ్యాపకులు, పాలెం, నకిరేకల్, నల్లగొండ
 మొబైల్: 9989535675
 
  నీటి కొరతపై చర్యలేవీ?
 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మున్సి పాలిటీలు, నగర పంచాయితీలు, గ్రామాల్లో ప్రజలు తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొంటు న్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం మూలాన భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గ్రామాల్లో ముఖ్యంగా బావుల్లో నీరు లేకపో వడం, బోర్‌లు నడవకపోవడం మూలాన ప్రజలు నానాయాతన పడుతున్నారు. మున్సిపా లిటీలు, నగర పంచాయితీలలో నల్లాల ద్వారా నీరు సరఫరా కావడం లేదు. గ్రామ, నగర పంచాయితీల పాలక వర్గాలు ప్రజలకు తాగు నీటిని అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. ట్యాంకర్ల ద్వారా వారానికి ఓసారి నీటి సరఫరా జరుగుతున్నా అందరికీ నీరు అందడం లేదు. ప్రభుత్వం స్పందించి ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలి. కష్టకాలంలో స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.
- కామిడి సతీష్‌రెడ్డి, పరకాల, వరంగల్ జిల్లా

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు