తారలు దిగి వస్తే వెలుతురే!

12 Oct, 2015 01:23 IST|Sakshi
ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల భార్యలతో బాలీవుడ్ నటుడు పాటేకర్

హృదయం ఉండాల్సిన చోటే ఉన్న కొందరు సెలబ్రిటీలు మెల్లగానే అయినా స్థిరంగా రైతు ఆత్మహత్యలపై అడుగు ముందకు వేస్తుండటం మంచి పరిణామం. ఐదుగురు అగ్ర స్థాయి సెలిబ్రిటీలు విదర్భ, మరాఠ్వాడా లేదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నాలుగు లేదా ఐదు రోజులు పర్యటిస్తే జాతీయ చర్చ రైతు ఆత్మహత్యలపైకి మరలుతుంది. ఏదైనా టీవీ చానల్ సెలబ్రిటీలను అలా ఎందుకు తీసుకెళ్లదో నాకు అర్థం కాదు. సరిహద్దుల్లోని సైనికులను కలుసుకోడానికి సెలబ్రిటీలను తీసుకెళ్లగలిగినప్పుడు... వారు రైతులతో కలిసి గడిపేలా ఎందుకు చేయలేరు? జై జవాన్ అనే గానీ, జైకిసాన్ అని ఎందుకు అనొద్దు?
 
 రైతు ఆత్మహత్యల్లోని బాధను, విషాదాన్ని వ్యక్తం చేసేలా ఓ పాటను పాడాలని కొన్నేళ్ల క్రితం నేను సుప్రసిద్ధ పాకిస్తాన్ గాయని రేష్మాను కోరాను. ‘‘భాయ్ సాబ్, రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడు తున్నా రు? సిగ్గుతో నా తల కిందకు వాలిపోతోంది’’ అంటూ అపరాధ భావనను ధ్వనించే గొంతుతో ఆమె అడి గారు. మంచి, శక్తివంతమైన గీతాలను ఇవ్వమని ఆమె కోరారు. ఆమెకు చెల్లించగలిగేటంత డబ్బు నా వద్ద లేదని, అయినా సాధ్యమైనంత ఇస్తానని అన్నప్పు డామె..‘‘మీ దగ్గర ఓ చెప్పుందా?’’ అన్నారు. నేనేదో చెప్పేలోగానే ‘‘రైతుల కోసం నేను డబ్బులు అడిగితే చెప్పు తీసినా తలపై కొట్టండి’’ అన్నారు. అయితే శాయ శక్తులా ప్రయత్నించినా నేను శక్తివంతమైన గీతాలను ఆమెకు అందించలేక పోయాను.
 
 రైతుల కోసం నానా పాటేకర్...
 అందుకే నానా పాటేకర్ రైతులు ఆత్మహత్యలు చేసుకుం టున్న తీరుపట్ల ఆవేదనను వెలిబుచ్చడం చూసి మాటల కందని విధంగా చలించిపోయాను. అంతేకాదు, ఆయన ఆత్మహత్యలకు పాల్పడ్డ పలువురు రైతుల భార్యలకు రూ. 15,000 చెక్కులను ఇచ్చారు. ఆయన నెలకొల్సిన ఫౌండేషన్ ఇప్పటి వరకు ప్రజల నుంచి రూ. 80,000 వసూలు చే సింది. ‘‘రైతులు తమ ప్రాణాలు తామే తీసు కోగలుగుతున్నారంటే వారు ఇతరులను కూడా చంపగ లుగుతారు. ‘విప్లవం’ అనే ఆలోచన గట్టిగా పట్టిందంటే రైతులు నక్సలైట్లుగా మారుతారు.’’ ఇది, దేశ హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఓ టీవీ కార్యక్రమంలో అన్న మాటలను నాకు జ్ఞప్తికి తెచ్చింది. ‘‘నక్సలిజానికి అడ్డగించే అత్యుత్తమ రక్షణ కవ చం వ్యవసాయమే. వ్యవసాయాన్ని మీరు ఎంతగా ధ్వం సం చేస్తే, నక్సలిజం అంతగా పెరుగుతుంది’’ అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
 విధానకర్తలు ఇంత సరళమైన వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారనేది ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోతూనే ఉన్నాను. విధానపరమైన తప్పుడు దిశానిర్దేశన కథ దాని చుట్టూనే తిరుగుతోంది. సినిమా నటుడు అక్ష య్ కుమార్ కూడా నానా పాటేకర్‌లాగే ముందుకు వచ్చారు. ఆయన బృందం (అక్షయ్ అక్కడ లేరు కాబట్టి) మరాఠ్వాడాలోని బీడ్ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడ్డ 30 మంది రైతుల భార్యలకు ఒక్కొక్కరికి రూ. 50,000 చెక్కులను అంద జేశారని వార్తా కథనాల సమాచారం. కుటుంబ పెద్దను కోల్పోయిన 180 రైతు కుటుంబాల కోసం ఆయన రూ. 90 లక్షలను తీసి పెట్టారు. ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా భర్త చేస్తున్న పనిని మెచ్చుకుంటూ, ఇతరులు కూడా ఆయనతో కలవాలని ఒక ట్వీట్‌లో కోరారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న రైతులకు సహాయంగా మరో సెలబ్రిటీ?, క్రికెట్ ఆటగాడు అజింక్యా రహానే కూడా ముందుకొచ్చారు. హృదయం ఉండాల్సిన చోటే ఉన్న కొందరు సెలబ్రిటీలు(ప్రముఖులు) మెల్లగానే అయినా, స్థిరంగా  మరో అడుగు ముందకు వేయడానికి వస్తున్నారని తెలు సుకోవడం కచ్చితంగా ఉత్సాహం కలిగిస్తోంది. వారిలో కొందరు సినిమాల్లో రాబిన్ హుడ్ వంటి పాత్రలను పోషించినవారు. నిజ జీవితంలో కూడా అంతే దయను చూపుతున్నారు. బాగా పెద్ద తారల్లో కొందరు తమ సాటివారు రోజుకు రెండు పూటలు కడుపు నింపుకోలేని స్థితిలో, బతుకు ఈడ్వలేక పెనుగులాడుతుండటాన్ని ఇంకా పట్టించుకోకుండా ఉండటం నన్ను చాలా నిరుత్సాహపరుస్తోంది కూడా.
 
 సెలబ్రిటీలు పల్లెబాట పడితే ...
 ఇది తెలిసే నాకు సినీ ప్రపంచం నుంచి, క్రికెట్ క్రీడల నుంచి, ప్రజాజీవితం నుంచి ఐదుగురు అగ్రస్థాయి సెల బ్రిటీలు విదర్భ, మరాఠ్వాడా లేదా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో ఏకధాటిగా నాలుగు లేదా ఐదు రోజులు పర్యటించడమనే ఆలోచన పుట్టుకొచ్చింది. దాని గురిం చి ఒక స్వయం సహాయక సంస్థతో కూడా చర్చించాను. ఆ పర్యటన ద్వారా ఈ నిరంతర మృత్యు నర్తనపైకి దేశం దృష్టిని మరల్చవచ్చు. ఈ పర్యటనల్లో వాళ్లు రైతు కుటుంబాలను కలుస్తారు, రైతులతో మాట్లాడుతారు, పంట పొలాలను చూస్తారు, వారితో కలసి తింటారు, సాధ్యమైతే వారితో పాటే ఒకటి లేదా రెండు రాత్రులు ఆ గ్రామంలోనే నిద్రిస్తారు. కొందరు సెలబ్రిటీలు ఆశించే గౌరవ ప్రతిఫలాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించి, అలాంటి పర్యటనకు ఎంత భారీ వ్యయమవుతుందనే నేనీ విషయంలో ఇంతకు మించి ముందుకు పోలేకపోతున్నాను.
 
 జైకిసాన్ అని ఎందుకు అనొద్దు?
 ఈ ప్రతిపాదన ప్రధానంగా మీడియా దృష్టిని ఆకర్షించడానికి, తద్వారా దేశ అంతరాత్మను తాకడానికే. మీడియా గునుక దీన్ని దీన్ని 24/7 సమస్యగా చూస్తే, మరపున పడిపోయిన ఈ సమస్యపైకి  అది జాతీయ స్థాయి చర్చను మరలుస్తుంది. విధానకర్తలు, అధికా రంలో ఉన్నవారు దీన్ని  గమనించాల్సిన స్థితి ఏర్పడు తుంది. ఏదేమైనా ఒక మీడియా చానల్ సెలబ్రిటీలను తీసుకుని మరాఠ్వాడా లేదా విదర్భలకు ఎందుకు తీసు కెళ్లదో నాకు అర్థం కాదు. సరిహద్దుల్లోని సైనికులను కలు సుకోడానికి సెలబ్రిటీలను తీసుకెళ్లగలిగినప్పుడు... అలాగే వారు రైతులతో కలిసి గడపడానికి ఎందుకు ప్లాన్ చేయలేరు? జై జవాన్ మాత్రమేగానీ జైకిసాన్ అని ఎందుకు అనొద్దు?
 
సెలబ్రిటీలు ధార్మిక కార్యకలాపాలను దాటి ఇంకా ముందుకుపోయి, వ్యవసాయం చేయడం తిరిగి గర్వకారణం అయ్యేలా చేయడానికి అవసరమైన వ్యవ స్థాగతమైన మార్పుల దిశగా ఆలోచింపజేస్తే ఆ కృషి అత్యంత విలువైనదే అవుతుంది. అందుకు వాళ్లు వ్యవ సాయ సమస్యలను అర్థం చేసుకోవడం కోసం కొంత సమయాన్ని వెచ్చించి, కొన్ని పౌర సమాజ సంస్థలతో కలసి ఈ కృషిని ఇంకా ముందుకు తీసుకుపోతే అది కూడా జరుగుతుంది. సినిమా నిర్మాత మహేష్ భట్ ‘‘పాయిజన్ ఆన్ ద ప్లాటర్’’ (కంచంలో కాలకూట విషం) డాక్యుమెంటరీ ద్వారా అదే చేశారు. ఆమిర్ ఖాన్ తన సొంత శైలిలో ఇలాంటి సమస్యలపై జాగరూకతను పెంపొందింపజేస్తున్నారు. రానున్న నెలల్లో ఇంకా మరిం త మంది ఈ సమస్యపై ముందుకు వస్తారని ఆశిస్తున్నా ను. సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి మద్దతు పలకడం వల్ల పట్టణ జనాభాకు తిరిగి గ్రామీణ భారతంతో తిరిగి సంబంధం ఏర్పడటమే దీని వల్ల కలిగే మరో అత్యుత్తమ ఫలితం.
     (వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
 ఈ మెయిల్ : hunger55@gmail.com)
 - దేవీందర్‌శర్మ

>
మరిన్ని వార్తలు