కరవు నేలకో కదలిక... రవూఫ్

12 Feb, 2014 00:48 IST|Sakshi
కరవు నేలకో కదలిక... రవూఫ్

 నివాళి: ఇమామ్
 
 ఆయన హృదయం ఎంత సున్నితమో ఆయన సిద్ధాంత నిబద్ధత అంత కఠినం.  కమ్యూనిస్టు ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేశారు. ఒక కమ్యూనిస్టుగా, త్యాగమయ జీవిగా ప్రజలు గుర్తుపెట్టుకొనే రీతిలో ఆయన జీవితం గడిచింది. ఒక సామాన్య మానవుడిలా కనిపించే రవూఫ్ అంత పెద్ద విప్లవం కోసం కల కన్నాడని చెబితే గానీ తెలియదు.
 
 త్యాగానికీ, ఆత్మవిశ్వాసానికీ పీడిత ప్రజ ల పట్ల అవ్యాజ ప్రేమాభిమానాలకూ, ధైర్య సాహసాలకూ మారు పేరు మా రవూఫ్. అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగిన కామ్రేడ్ రవూఫ్ ఏ రోజూ తన రాజకీయ కార్యాచరణను, ఆలోచనలను ప్రాంతాలకు, మతాలకు, కులాలకు వర్తింపజేసుకొని రాజకీయాలు చేయలేదు. మార్క్స్ లెనిన్ మావో సిద్ధాంతాల ప్రాతిపదికన జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ పరి ణామాలను అధ్యయనం చేస్తూ ఆకళింపు చేసుకొని తన కార్యాచరణను ఎప్పుడూ జాతీ యస్థాయిలో ఒక విప్లవ పార్టీ నిర్మాణానికి అంకితం చేశారు. జీవితాంతం కమ్యూనిస్టుగా జీవించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ చిరునవ్వుతో వాటిని స్వీకరించేవారు. ఆ స్థాయికి ఆయన్ను తీసుకువెళ్లినది కమ్యూనిస్టు సిద్ధాంతంలో ఉన్న విశ్వాసమే. కమ్యూనిస్టు శ్రేణులకు ఆయన కామ్రేడ్ రవూఫ్. ప్రజలకు ‘రవూఫ్ సార్’. ఆయనకు కలకత్తా, పశ్చిమబెంగాల్, కేరళ, ఒరిస్సా, ఉత్తర భారతదేశంలో గణనీయమైన అనుచర వర్గం ఉంది.
 
 ప్రజ్ఞాపాటవాలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతలు, ఆదాయం సమకూర్చే న్యాయవాద వృత్తి ఉంది. కానీ ప్రజల కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం వాటిని త్యజించారు రవూఫ్. టంగుటూరి ప్రకా శం గారిని గుర్తుకు తెస్తూ ఉంటారు. ఆయన హృద యం ఎంత సున్నితమో ఆయన సిద్ధాంత నిబద్ధత అంత కఠినం. కమ్యూనిస్టు ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేశారు. ఒక కమ్యూనిస్టుగా, త్యాగమ య జీవిగా ప్రజలు గుర్తుపెట్టుకొనే రీతిలో ఆయన జీవితం గడిచిగింది. అనంతపురం జిల్లాలో అత్యధిక కాలం జైలు జీవితం గడిపిన వ్యక్తిగా కూడా కామ్రేడ్ రవూఫ్ గుర్తుండి పోతారు. తరిమెల నాగిరెడ్డి తర్వాత ఎక్కువ కాలం రహస్య జీవితం గడిపిన వ్యక్తి రవూఫ్. కదిరి సబ్ జైలు నుండి కలకత్తాలోని అలీపూర్ జైలు వరకు ఆయన జైలు జీవిత ప్రస్థానం సాగింది. అనేక కేసుల్లో ఆయనకు శిక్షలు పడ్డాయి. దేశంలోనే పేరుగాంచిన తరిమెల నాగిరెడ్డి కుట్ర కేసులాగే పార్వతీపురం కుట్ర కేసు ఒకటి. ఈ కుట్ర కేసులో దేశంలోని నక్సలైట్ నాయకులు కానూ సన్యాల్, సౌరెన్‌బోస్, నాగభూషణ పట్నాయక్, భువన్‌మోహన్ పట్నాయక్‌లతో పాటు మన రాష్ట్రానికి చెందిన చౌదరి తేజేశ్వరరావు, వసంతాడ రామలింగాచారి లాంటి అనేక వం దల మందిపై ఈ కేసు నమోదైంది. ఆ కేసుతో సంబంధం ఉన్న పలువు రిని కాల్చిచంపారు.
 
 అనంతపురం కరవు సహజంగానే రవూఫ్‌ను కదిలించింది. నల్లచెరువు దగ్గర ఒక భూస్వామి ఇంటి మీద ఆయుధా లతో జరిగిన దాడిలో ఆయన ఉన్నారు. వడ్డీ వ్యాపారుల పీడ నుంచి ప్రజలను రక్షించడం ఆయన జీవితంలో ఎన్నోసార్లు జరిగింది. రాష్ట్రంలో నక్సల్బరీ ఉద్యమ నిర్మాతలలో ఆయన ఒకరు. ఆయనది చారు మజుందార్ మార్గం. సీపీఐ ఎంఎల్‌తో విభేదించి సీపీఐ ఎంఎల్ రెడ్ ఫ్లాగ్ అనే పార్టీని స్థాపించారు.
 
 కమ్యూనిస్టు కార్యకర్తలు, కమ్యూనిస్టు పార్టీలు ఎలా ఉండాలి? ఇలాంటి ప్రశ్నలకు రవూఫ్ జీవితం నుంచి సమాధానాలు లభి స్తాయి. ఎవరైనా తాను కమ్యూనిస్టు అని అను కుంటే చాలదు. ఏ కొందరో మాది
 కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకుంటే సరిపోదు. కమ్యూనిస్టు పార్టీల్లో సభ్యులుగా నమోదు కావడంతోనే సరిపోదు. ఒక వ్యక్తి కమ్యూనిస్టని, అది కమ్యూనిస్టు పార్టీ అని ప్రజలు భావించాలి. ప్రజల ఆలోచనలలో అలా కమ్యూనిస్టు నాయకుడిగా, విప్లవ యోధుడిగా, త్యాగమూర్తిగా చిరకాలం నిలిచి ఉండి, ఇప్పుడు ధన్యజీవిగా నీరాజనాలందుకుం టున్న నాయకుడు రవూఫ్.
 
 ఆయన ఆరోగ్యం అందరినీ కలవరానికి గురి చేసినప్పటి మాట... రవూఫ్ ైవె ద్యసేవలకు అయ్యే వ్యయం గురించీ, వ్యక్తిగత బాగో గుల కోసం కొందరు వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడ్డారు. జిల్లాలో పేరు పొందిన స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో అండగా నిలుస్తామని ప్రతిపాదించారు. అందుకు ఆయన చిరునవ్వు నవ్వి... సున్నితంగా తిరస్కరిం చారు. నిజానికి ఆయన కుటుంబమూ లేదు. అయినా ‘నన్నూ నా బాగోగులు చూసుకోవడానికి నా మిత్రులు... ప్రజలు ఉన్నా’రంటూ కామ్రేడ్ రవూఫ్ తన ఆత్మస్థైర్యాన్ని చాటాడు. జీవితాంతం కమ్యూనిస్టుగానే ఉన్నాడని చెప్ప డం అందుకే. అనంతపురం జిల్లా చరిత్రలో చివరి సీనియర్ విప్లవ యోధుడు అస్తమిం చాడు. ఆయనకు నా సలామ్!
 
 (వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకులు)
 

మరిన్ని వార్తలు