ద్రవిడియన్ వర్సిటీ లీలలు

4 Jul, 2015 00:43 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రా లకు చెందిన పీహెచ్‌డీ స్కాలర్లు (2007-08, 2008- 09 బ్యాచ్‌లకు చెందినవారు) తమ పరిశోధనా గ్రం థాలను ద్రవిడియన్ యూనివర్సిటీకి నాలుగేళ్ల క్రిత మే సమర్పించినా వాటిని మూల్యాంకనకు ఇంతవర కు పంపలేదని తెలిసింది. కొంత మంది స్కాలర్లు హైకోర్టు నుండి ‘మూల్యాంకన’ ‘వైవా’లను వెంటనే జరపమని ఆర్డర్లు తెచ్చుకున్నా, డీయూ వారు ఖాత రు చేయడం లేదు. యూనివర్సిటీ ఎదుట ధర్నాలు చేయగా ఈ ఏడాది జనవరి- ఫిబ్రవరి నెలలో రీసెర్చి స్కాలర్ల గైడ్లను డీయూకు రప్పించుకుని వారి సర్టిఫి కెట్లను పరిశీలించి పంపారు.

ఇది జరిగి ఐదు నెలలు గడచినా ఫలితం సున్నా. కోర్టు తీర్పు రాలేదనే వంక తో స్కాలర్ల జీవితాలతో ద్రవిడియన్ విశ్వవిద్యాల యం ఆడుకుంటున్నది. స్కాలర్ల ప్రమోషన్లు, ఆర్థిక వెసులుబాట్లు ఆగిపోయాయి. కొందరు రిటైరయ్యా రు. ఈ స్కాలర్లలో ఎక్కువ భాగం దక్షిణాది రాష్ట్రాల వారు కావడం వల్ల - ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులం దరూ తక్షణ చర్యలు తీసుకోవాలని మనవి. ఆంధ్ర ఫ్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలోనే (చిత్తూరు జిల్లా) ద్రవిడి యన్ యూనివర్సిటీ ఉన్నది.

ముఖ్యమంత్రిని హైద రాబాద్‌లో కొందరు స్కాలర్లు గత సంవత్సరం జూలై 7న స్వయంగా కలసి, పరిస్థితిని వివరించి వినతి పత్రాన్ని ఇచ్చి, వారి నుంచి హామీ పొందినా, తదు పరి వారికి ఎన్ని రాతపూర్వక విన్నపాలు చేసుకున్నా ఏళ్లు గడుస్తున్నా- రీసెర్చి స్కాలర్లకు న్యాయం లభిం చకపోవడం లేదు. దక్షిణాది స్కాలర్ల ప్రయోజనా లను కాపాడేందుకు ఏపీ ముఖ్యమ్రంతి డీయూపై దృష్టి పెట్టాలని మా అభ్యర్థన.
 ఎన్.ఎస్.ఆర్.మూర్తి  రీసెర్చి స్కాలర్
 (రిటైర్డ్ ఎంప్లాయి), హైదరాబాద్ 94900 56843
 
 

మరిన్ని వార్తలు