పద్మవ్యూహంలో ప్రజారవాణా

26 Jul, 2016 01:27 IST|Sakshi
పద్మవ్యూహంలో ప్రజారవాణా

ముంబై నగరజీవికి తక్కిన అన్నింటికంటే సమయం చాలా ముఖ్యమైనది. సకాలంలో బస్సు దొరక్కపోవడం అంటే లోకల్ ట్రెయిన్‌ని పట్టుకోలేకపోవడం వంటిది కాదు. బస్సు మిస్సయితే అప్పాయింట్‌మెంట్లు కూడా తప్పిపోవచ్చు.
 
 కార్ల ధరలూ, వాటి ఇంధనం గురించి పెద్దగా పట్టించుకోరు కానీ, భారత్‌లో ప్రజలు అనేక కారణాలతో కార్లు కొంటుం టారు. ఒకటి. మీవద్ద డబ్బు ఉంటుంది. కాబట్టి ఒకటి లేదా ఎక్కువగా కార్లు కొంటారు. రెండు. మీవద్ద డబ్బులేదు కానీ మీకు అవసరమనిపించింది కాబట్టి దేన్నయినా తనఖా పెట్టి మరీ కొంటారు. మూడు. ప్రజా రవాణా వ్యవస్థ నరకప్రాయంగా మారింది కాబట్టి కొనాల్సిన అవసరం ఉంటోంది. పైగా, కారు ఒక హోదా చిహ్నం అయిపోయింది.
 
 కార్లలో తిరిగే జనాభా పెరుగుతున్నందున రహదా రులు ఇరుగ్గా మారిపోయాయి. చాలా నగరాల్లో ఏమా త్రం స్థలం లేదు. ప్రజారవాణా దుస్థితే కార్ల కొను గోలుకు ఒక ప్రోత్సాహకంగా ఉంటోంది. ఇది నిజంగానే ఒక విష వలయం. ఒకే ఒక్క చర్యతో దీన్ని తునాతున కలు చేయవచ్చు. ప్రజారవాణాలో పెట్టుబడులను వేగ వంతం చేయడమే. అయితే ఇదంత సులువైన అంశం కాదు. వస్తున్న కాసిన్ని పెట్టుబడులు కూడా డిమాండ్‌తో పోలిస్తే చాలా తక్కువే మరి.
 ఇక భారీ ఖర్చుతో కూడిన ప్రాజెక్టు విషయానికి వస్తే వాటి ప్రణాళికకే ఎక్కువ సమయం తీసుకుం టుంది. వాటి నత్తనడకన సాగటం వాటి లక్షణం.
 
 దీని ఫలితమే మరిన్ని కార్లకు డిమాండ్ ఏర్పడటం. కార్లు లేనివారికి ముంబై వంటి నగరంలో మోటార్‌బైకులు సురక్షితం కావు. బైకులకు ఎవ్వరూ దారి కల్పించరు. కిక్కిరిసిన కార్ల మధ్యలో బైకర్లు ఉక్కిరిబిక్కిరి అవుతుం టారు. అయినా వీటి సంఖ్య కూడా పెరుగుతుంటుంది. నగర ప్రణాళిక లోనే లోపం ఉంటోంది కనుక మీరు కార్ల కొనుగోలుదార్లను, వినియోగదార్లను తప్పుపట్టలేరు. దేశంలోనే అతి ఎక్కువగా కార్లు ఉన్న నగరం ముంబై. నిజానికి కారు కొని నడపడానికి ఏదైనా అడ్డంకి ఉందంటే అది పార్కింగ్ స్థలాలు లేకపోవడమే. కారు డ్రైవింగ్ ఎంత అలసట గొలుపుతున్నప్పటికీ, డ్రైవర్లకు పెట్టవలసిన వ్యయం కారణంగా కారు యజమానులు సుదూర ప్రాంతాలకు కూడా తామే నడుపుకుంటూ వెళు తుంటారు. పైగా చాలా పెద్దనగరం కాబట్టి, యజమా నిని దింపిన తర్వాత అతడి కుటుంబం ఉప యోగించు కోవడానికి  డ్రైవర్లు ఆ కారును వెనక్కు తీసుకెళ్లలేరు. వారు తోటి డ్రైవర్లతో కలసి కారు బ్యానెట్లపై కూర్చుని వృథా కాలక్షేపం చేస్తూ పేకాట ఆడుతూ ఉంటారు. కారు పార్కు చేసి ఉంచడమే డ్రైవర్ పని అన్నమాట.
 
 దాదాపు 29 సంవత్సరాల నా నగర జీవితంలో పాదచారులు తిరిగే ప్రాంతాలనుకూడా పార్కింగ్ కోసం ఆక్రమించుకునేంతగా పరిస్థితి రాన్రానూ దిగజారుతోనే వస్తోంది. ఇకపోతే, భవనాల వెలుపలి ప్రాంతంలో రాత్రిపూట పార్కింగ్ చేసేవారినుంచి రుసుము వసూలు చేయడానికి నగరపాలక సంస్థ తలపెట్టిన పథకం తీవ్ర వ్యతిరేకతను చవిచూసింది. పార్కింగ్ స్థలాల కోసం, ముందే నిర్మించిన భవనాలను మార్పు చేసే వీలులేదు. కొత్త భవనాలను నిర్మించాలంటే ప్రతి అపార్టుమెంటు లోపలే పార్కింగ్ స్థలం ఉండేలా నిబంధనలు ఉన్నాయి.
 
 అయితే ఇది నూతన నిర్మాణాలకు మాత్రమే వర్తి స్తుంది. మెర్సిడెజ్, బీఎమ్‌డబ్ల్యూ వంటి విలాసవంత మైన కార్లు రోడ్డు పక్కనే పార్కు చేయడం తప్పితే వేరే గత్యంతరం లేదు. నగరంలో ఏ ప్రాంతాన్ని చూసినా డ్రైవ్ చేయడానికి కాకుండా నడవడానికి మాత్రమే పని కొచ్చేలా కనిపిస్తుంటుంది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది కాబట్టి మీరు డ్రైవ్ చేయలేరు. ఒక ఫ్లాట్‌కు ఒక పార్కింగ్ స్థలం అంటూ తీసుకొచ్చిన నూతన భవన నిర్మాణ నిబంధనలు బిల్డర్లకు అదనపు డబ్బు సంపాదించుకోవడంలో సహాయం చేస్తున్నాయి. దీన్ని పురపాలక సంస్థ అసలు పట్టించుకోదు.
 
 మరొకవైపున, నగరం వింత పరిస్థితిలో చిక్కుకు పోయింది. బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై - ట్రాన్స్‌పోర్ట్ (బీఈఎస్‌టీ) పేరిట ఉన్న ప్రజారవాణా సంస్థ నగ రంలో అన్ని ప్రాంతాలకూ సేవలందించేలా చక్కటి రూట్ ప్లాన్‌ని కలిగి ఉన్నప్పటికీ, వాటిని ప్రజలకు అను కూలంగా నడపడం లేదు. కార్ల ట్రాఫిక్ బస్సు వేగాన్ని మందగింపజేస్తోంది. ఒక బస్సు రోజుకు కనీసం 200 కిలోమీటర్లు ప్రయాణించడం అసాధ్యంగా మారింది.
 
 ఫలితంగా, ఒక మార్గంలో అన్ని బస్సులు తిరగడం అసాధ్యమైపోయింది, ముంబై నగరజీవికి తక్కిన అన్నిం టికంటే సమయం చాలా ముఖ్యమైనది. బస్సు రాకపో వడం, దొరక్కపోవడం అనేది లోకల్ ట్రెయిన్‌ని పట్టు కోలేకపోవడం వంటిది కాదు. బస్సు మిస్సయితే అప్పా యింట్‌మెంట్లు తప్పిపోవచ్చు. అమూల్యమైన సమ యాన్ని కోల్పోవచ్చు కూడా. ముంబైలో నివసించే వ్యక్తికి విహారం అంటే తెలియదు. నిర్దిష్ట ప్రయోజనంతోటే అతడు నడుస్తుంటాడు. ఎందుకంటే అతని వ్యక్తిత్వంలో సమయపాలన చాలా ముఖ్యమైన అంశం మరి.
 
 ముంబైలో నివసించేవారి జీవితంలో స్థానిక రైళ్ల గాథ మరొక నిరాశాపూరితమైన భాగం. అయితే ప్రతి రోజూ సుదూర ప్రయాణాలు చేయవలసిన అవసరం వల్ల ప్రయాణికులు కార్లను కొనలేరు, ఉపయోగించ లేరు. వాళ్లు నిజంగా కార్లను కొంటే సగం పనిగంటలను పనిస్థలానికి చేరుకోవడానికి, మిగిలిన సగం పనిగంట లను ఇంటికి వెళ్లడానికి వెచ్చించాల్సి ఉంటుంది. అంటే వారు చేసే పని ఏమీ ఉండదనే దీనర్థం. పైగా కారు యజమానిగా మారాలన్న ఆలోచనను వారి ఆర్థిక స్థితి నీరుగారుస్తుంది.కానీ స్టేషన్ నుంచి పనిచేసే చోటుకి, లేదా ఇంటికి వెళ్లడానికి కార్లతో పోటీ పడవలసి వచ్చిన ప్పుడు మాత్రం వారు వాటిని శాపనార్థాలు పెడతారు.
 
రోడ్లపై కార్లు కిక్కిరిసిపోవడం, రోడ్డు పక్కన పార్కు చేసిన కార్ల వల్ల రహదారులు ఇరుగ్గా మారడం అనేవి బస్సుల వేగాన్ని మందగింపజేస్తుంటాయి. దీంతో ప్రజా రవాణా సంస్థ నష్టాల్లో కూరుకుపోతుం టుంది. డిమాండ్, సరఫరా అనే సమీకరణ రేఖను అధిగమించడం ముంబై ప్రజా రవాణా సంస్థకు సాధ్యం కావటం లేదు. డిమాండును తీర్చనందున రోడ్లపై కార్ల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో అది తన్ను తాను దెబ్బ తీసుకుంటోంది. ప్రయాణికులను ఆకర్షించడానికి ఈ మధ్యే ప్రయాణ చార్జీలపై అది కోత విధించింది. ప్రైవేట్ ఆపరేటర్‌కు ఈ స్థితి కలిగితే తన సంస్థను మూసివేయడం తప్ప మరొక మార్గం ఉండేది కాదు.
 వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 - మహేష్ విజాపుర్కార్
 ఈ మెయిల్ : mvijapurkar@gmail.com

>
మరిన్ని వార్తలు