విద్యలో సమానావకాశాలు ఏవి?

31 Oct, 2014 00:11 IST|Sakshi
విద్యలో సమానావకాశాలు ఏవి?

విద్యపై పెట్టిన పెట్టుబడిని మిగిలిన రంగాలపై పెట్టిన పెట్టుబడిగానే భావించాలి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, రవాణా, గనులు వగైరా ఉత్పాదక రంగాల మీద పెట్టిన ఖర్చుగానే భావించాలి. ఎందుకంటే విద్యా రంగం మీద పెట్టిన పెట్టుబడి వల్లనే ఆ రంగాలు ఆ స్థాయికి వెళ్లాయన్నది వాస్తవం.
 
ఉన్నత ప్రమాణాలతో ప్రజలందరికీ విద్యనం దించాలనే ఆకాంక్ష 67 ఏళ్ల స్వాతంత్య్ర భారతదే శంలో, రాజ్యాంగం ఆమో దించిన 65 ఏళ్ల కాలంలో కూడా తీరలేదు. అందు కనే అందరికీ ఉచిత, సమాన విద్యనందించా లని ఈ నాటికీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ నాటికీ ఎస్సీ అమ్మాయిల్లో 80 శాతం, ఎస్టీ అమ్మా యిల్లో 90 శాతం మంది 10వ తరగతి కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. ఏ దేశమైనా సామాజికం గా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అందుకు ప్రా థమికంగా ప్రజలందరినీ ముందు విద్యావంతు లను చేయాలి. ఈ దిశలో ఆచరణాత్మక ప్రయత్నా లు జరగలేదు. 1937లో వార్ధాలో జరిగిన జాతీయ విద్యా సదస్సులో బేసిక్ విద్యను అమలు చేయాలనే తీర్మానం ఆమోదం కోసం గాంధీ చాలా కష్టపడవల సివచ్చింది. రాజ్యాంగ రచన సమయంలో విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని రాజ్యాంగ సభలో డా॥బి.ఆర్.అంబేద్కర్ ప్రతిపాదించారు. కానీ రాజ్యాంగ సభలోని ప్రాథమిక హక్కుల కమిటీలో గల సభ్యులు విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చ డానికి వ్యతిరేకించారు.

ఇటీవల జరిపిన ఒక సర్వే ప్రకారం దేశంలో 40 శాతం ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు లేవు, 22 శాతం ప్రాథమిక పాఠశాలలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి, ఒకే గదిలో నడిచే పాఠశాలలు లక్ష కు పైగానే ఉన్నాయి. ఇవన్నీ గ్రామాల్లోనే ఉన్నాయి. చాలా పాఠశాలల్లో నల్లబల్లలు కూడా లేవు. 72 శాతం పాఠశాలల్లో మంచినీటి వసతి లేదు, 89 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. బాలికలకు సరైన వసతులు లేని కారణంగా ఒక దశలో బడి మానేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏటా 3 శాతం నుంచి 5 శాతం వరకు పిల్లలు తగ్గుతున్నారు.

ఆర్థిక, విద్య హక్కు, పని హక్కులను ప్రభుత్వ మే ప్రజలందరికీ అందించే ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని 41వ ఆర్టికల్ ఆదేశిస్తున్నది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ నుంచి 10 ఏళ్లలో 14 ఏళ్ల వయసుగల బాల బాలికలందరికీ నిర్బంధంగా ఉచితంగా విద్యనందించటానికి రా జ్యం కృషి చేయాలని రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్ ఆదేశించింది. వీటి అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధి తో కృషి చేస్తే ఈనాడు భారతదేశంలో నిరక్షరాస్యత ఉండేది కాదు. ప్రభుత్వరంగ విద్య దుస్థితికీ, అంద రికీ విద్యను అందించాలన్న పట్టుదల లోపించడా నికి కారణం-విద్యపై చేసే ఖర్చును అనుత్పాదక వ్యయంగా ప్రభుత్వాలు భావించడమే. కానీ విద్య పై పెట్టిన పెట్టుబడిని మిగిలిన రంగాలపై పెట్టిన పెట్టుబడిగానే భావించాలి. వ్యవసాయం, పరిశ్రమ లు, సేవలు, రవాణా, గనులు వగైరా ఉత్పాదక రం గాల మీద పెట్టిన ఖర్చుగానే భావించాలి. ఎందు కంటే విద్యారంగం మీద పెట్టిన పెట్టుబడి వల్లనే ఆ రంగాలు ఆ స్థాయికి వెళ్లాయన్నది వాస్తవం.

స్వతంత్ర భారతదేశంలో విద్యారంగం అభి వృద్ధి కోసం నియమించిన రాధాకృష్ణన్ కమిషన్ (1948), సెకెండరీ విద్యపై నియమించిన ముదలి యార్ కమిషన్ (1952), కొఠారీ కమిషన్ (1966) ఇచ్చిన నివేదికలు, సూచనలు కొన్ని ఆశలను చిగు రింప చేశాయి. కానీ వీటిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. కొఠారీ కమిషన్ సూచనలు కొంత వరకు ప్రగతిశీలకంగానే ఉన్నాయి. ఉమ్మడి పాఠ శాల విద్యా విధానం ఉండాలని ఈ కమిషన్ చేసిన సిఫారసు అందరినీ ఆకర్షించింది. వీటిని అమలు చేయాలన్న డిమాండ్ ఈనాటికీ ఉంది.
 1986లో వచ్చిన విధానం ఉమ్మడి పాఠశాల సూచనకు స్వస్తి చెప్పడమే కాకుండా, చిన్నస్థాయి పాఠశాల విధానానికి బాటలు వేసింది. విద్యను ప్రైవేటు రంగానికి అప్పగించే పద్ధతికి దారి చూపిం ది. ఫలితంగా విద్య సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయింది. 1990 తరువాత వచ్చిన నూత న ఆర్థిక విధానాలు విద్యను ప్రైవేటు రంగం నుంచి వ్యాపార , మార్కెట్ సరుకుగా కార్పొరేట్ రంగంలోకి తరలించాయి. ఇప్పుడు విద్యను ఈ శక్తులు లాభ సాటి వ్యాపారంగా భావిస్తున్నాయి. విద్యలో వ్యాపా ర ధోరణులు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరు ద్ధం. 2010లో వచ్చిన విద్యా హక్కు చట్టం ఈ వ్యా పార ధోరణిని చట్టరీత్యా బలోపేతం చేసింది. దీనికి తోడు ఎన్డీఏ హయాంలో విద్య కాషాయీకరణ ప్ర క్రియ మొదలై, ఇప్పుడు కూడా సాగుతోంది. రొమి ల్లా థాపర్ పుస్తకాలు తగులబెట్టాలని సుబ్రహ్మణ్య స్వామి పిలుపునివ్వడం విద్యను మతతత్వం వైపు తీసుకు వెళ్లే ప్రమాదాన్ని సూచిస్తున్నది. ఈ నేపథ్యంలో రాజ్యాంగం మేరకు విద్యను లౌకిక సూ త్రాల ఆధారంగా సంరక్షించుకోవలసిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే నవంబర్ 2 నుంచి డిసెంబర్ 4 వరకు అఖిల భారత స్థాయిలో ‘విద్య పోరాట యాత్ర’ను అఖిల భారత విద్యా హక్కు వేదిక చేపట్టింది. విద్యా రంగ సమస్యలను ప్రజల లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో సాగుతున్న ఈ యాత్ర భోపాల్‌లో ముగుస్తుంది.

(విద్యాపరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు)     కె. నారాయణ
 
 

మరిన్ని వార్తలు