లెజిస్లేచర్ పరువుకు పరీక్ష

9 Dec, 2013 23:40 IST|Sakshi
లెజిస్లేచర్ పరువుకు పరీక్ష

 ఫెడరల్ స్ఫూర్తిని ధ్వంసం చేస్తూ విభజించి-పాలించే పాలకపక్షాలను అదుపు చేయడానికి ‘అధికరణ-3’కు స్పష్టమైన సవరణ తీసుకురావాలని 12వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ శాసనసభ (ఈ లోపు పాలకులు అవకాశవాదానికి పాల్పడకపోతే, గీతే) సమావేశాలు తీర్మానం
 ద్వారా స్పష్టం చేయాలి!
 
 ‘‘రాజ్యాంగబద్ధమైన నీతీ, ఏ ది సరైనది, ఏది కాదు అన్న విచ క్షణాయుతమైన నైతికత మని షికి స్వభావ సిద్ధంగా అబ్బే గు ణం కాదు. ఆ నీతిపాఠాన్ని ఆచ రణలో అలవరచుకోగల గాలి. మన ప్రజలూ, నాయకులూ ఇం కా ఆ నీతిని అలవరచుకోవలసి ఉంది! ప్రజాస్వామ్యం అనేది భారతభూమికి పైపై అలంకరణ మాత్రమే. ఎందుకంటే, భారతభూమి ప్రధానంగా ప్రజాస్వామ్య విరుద్ధ స్వభావం గల దేశం కాబట్టి!’’    - డా. బీఆర్ అంబేద్కర్
 
 స్వాతంత్య్రానంతర భారతంలో ఏ అనుభవాలను ఊహించి రాజ్యాంగ నిర్మాతలలో అగ్రేసరుడైన డాక్టర్ అంబేద్కర్ ఇలాంటి అభిప్రాయానికి రావలసివచ్చిందో, 65 సంవత్సరాల తరవాత నేటి పాలక పక్షాల ఆచరణ చూస్తే తెలుస్తుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలలో (సమా ఖ్య) వ్యవస్థ అంతర్భాగమేనని రాజ్యాంగం ఘోషిస్తూ ఉంటుంది. ఆ సూత్రాన్ని పాలకపక్షాలు అడుగుడుగునా నిర్వీర్యం చేస్తూనే ఉన్నాయి.
 
 బ్రూట్ మెజారిటీ వల్లే...
 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చాక, మొదట ఎని మిది,తొమ్మిది సంవత్సరాల వరకో తప్ప 1959 నుంచీ కాంగ్రెస్‌పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనలకు బ్రూట్ మెజారి టీనే ఆశ్రయించింది! పార్లమెంటు, శాసనసభల అధికారా లను రాజ్యాంగ నిర్ణేతలు స్పష్టంగా విభజించినా పార్లమెం టులో ‘బ్రూట్’ మెజారిటీ చాటున కాంగ్రెస్ పాలకపక్షం (తర్వాత మితవాద బీజేపీ) రాష్ట్రాల జాబితాను క్రమంగా ‘చెదల’ మాదిరిగా తినేస్తూ వచ్చింది. అలాగే కేంద్రమూ - రాష్ట్రాలూ సమాన హోదాలో పంచుకోవలసిన పాలనాం శాల జాబితాలోకి కూడా పాలకపక్షాలు చొరబడి రాష్ట్ర ప్రభుత్వాల, రాష్ట్రాల లెజిస్లేచర్ల అధికార పరిధిని తొలుచు కుంటూ వచ్చాయి. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లును పార్లమెంటు ఆమోదించ డానికి ముందు రాష్ట్రప తికి పంపించి, అక్కడి నుంచి శాసనసభల ఆమోదానికి లేదా చర్చకు లేదా ఓటింగ్ ద్వారా సభ్యుల అభిప్రాయా లను నమోదు చేయడానికి పంపించడం ప్రజాస్వామిక పద్ధతీ, రాజ్యాంగ నిర్దేశమూ!
 
 అప్పుడు జరిగింది ఇదే!
 కాని అదే కాంగ్రెస్ పాలనలో, అదే పార్లమెంటులో తన బ్రూట్ మెజారిటీ ద్వారా 1955 డిసెంబర్ 24న ఏం జరి గిందన్నది నేడు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ జన ప్రతిపాదన సందర్భంగా శాసనసభ్యులకు కనువిప్పు కావలసిన విషయమది. రాష్ట్ర శాసనసభ గౌరవ సభా పతిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌కూ, ప్రస్తుతం రాష్ట్ర శాసన సభ గౌరవ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ రాష్ట్ర విభ జన బిల్లుపై ఓటింగ్ జరుగుతుందనీ, కేవలం ‘అభిప్రా య’ ప్రకటనతోనే సరిపెట్టుకోబోమన్న భ్రమల్లో ఉన్నారు. అలాగే బోలెడంత ఖర్చుచేసి విద్యావంతుడై విదేశాల నుం చి వచ్చి శాసనసభ్యుడైన ఓ ఎన్‌ఆర్‌ఐ మిత్రుడికి కూడా 1995లో రాజ్యాంగంలోని ‘ఆర్టికల్-3’కి సంబంధించి వచ్చిన సవరణ ఏమిటో, ఆ రాజ్యాంగ సవరణకు ముం దున్న గౌరవమైన ్ర‘పోవిజో’ ఏమిటో ‘యాది’ ఉన్నట్లు కనిపించదు!
 
 ఆ సవరణకు ముందు...
 1955 నాటి సవరణకు ముందున్న ‘ప్రొవిజో’లో ఏముం దో డాక్టర్ దుర్గాదాస్ బసు (భారత రాజ్యాంగం మీద పది సంపుటాల వ్యాఖ్యానం రాశారు) వెల్లడించేదాకా చాలా మంది అయోమయావస్థలోనే ఉండిపోయారు! 1955 డిసెంబర్ దాకా ఉన్న రాజ్యాంగంలోని ‘3వ అధికరణ’ తాలూకు ఆ ‘ప్రొవిజో’ (అంశం) ఏమిటి? కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆయా శాసనసభ లకు ‘ప్రస్తావన’గా పంపి, వాచా మాత్రమే అభిప్రాయం తెలుసుకోవడం కాదు. శాసనసభ ‘నిశ్చితాభిప్రాయా’న్ని (‘టు ఎసర్టయిన్’) పొందాలని ఆ ‘ప్రొవిజో’ నిర్దేశించిం ది. ‘నిశ్చితాభిప్రాయ’ ప్రకటనకు సభ్యుల ఓటింగ్ అనివా ర్యం! అయితే ఉత్తరోత్తరా కేంద్రం మైనారిటీలో పడిపోయే స్థితి తలెత్తినా, లేదంటే ఆ ‘ప్రొవిజో’ వల్ల శాసనసభలో ఓటింగ్ ఫలితంగా తన బిల్లు ఓడిపోయే స్థితికి వచ్చినా కేం ద్రంలో తన ఉనికికే ఎసరు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కనుకనే ఆ ప్రొవిజోలోని ‘ఎసర్‌టైన్’ అన్న పదాన్ని తొలగించి 1955లో ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి శాసనసభకు బిల్లును ఉత్తుత్తిగా ‘ప్రస్తా వన’ (రిఫర్) చేస్తే చాలునన్న పదాన్ని చేర్చింది! నేడు తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికి శాసనసభకు ఈ నెల 12వ తేదీన వస్తుందని చెబుతున్న విభజన ముసాయిదా బిల్లును, ఆ కొత్త ప్రొవిజో ప్రకారమే పంపుతున్నారని మర వరాదు. అందువల్లనే రాజకీయ పాలనాశక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగంలోని ‘3 అధికరణ’ను కూడా ఉపయోగించుకోవడానికి అలవాటుపడ్డారు.ఆ నాటి రాజకీయ నాయకత్వం ‘ఆర్టికల్-3’ ద్వారా మొరా యిస్తున్న సంస్థానాధీశులను నియంత్రించదలచింది! అంతేగాని భాషా రాష్ట్రాలుగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పడిన కమిషన్ పనినిగానీ, సిఫారసులను గానీ, భాషా రాష్ట్రాల ఏర్పాటును గాని చెక్కు చెదర్చడానికి, ముక్కలు చేయడానికి ఆ అధికరణను సృష్టించలేదని గమ నించాలి! కనుకే, కేంద్ర బిల్లులపైన ఓటింగ్ ద్వారా శాసనసభల ‘నిశ్చితాభిప్రాయా’న్ని తెలుసుకునేందుకు ‘అధికరణ-3’ను సవరించి తీరాలని ముక్తకంఠంతో కోరాలి!
 
 ఫలితం దారుణం
 బ్రూట్ మెజారిటీ ఆసరాగా ప్రవేశపెట్టిన 1955 రాజ్యాంగ సవరణ ద్వారా కాంగ్రెస్ పాలకులు తీసుకున్న తొలి చర్య - అఖండ మెజారిటీతో ఎన్నికై, పెక్కు ప్రజాతంత్ర సంస్క రణలతో వచ్చిన కమ్యూనిస్టు (నంబూద్రిపాద్) ప్రభు త్వాన్ని 1959లో బలిగొనడం! అంతకు మూడేళ్ల క్రితమే తెలంగాణ రైతాంగ పోరాటం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ (1956) ఏర్పడ్డమూ జరిగింది. 1953లో ఆంధ్రోద్యమ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండేళ్లకు రాష్ట్రా ల ఉనికికి ఎసరు తెచ్చేవిధంగా 1955లో కేంద్రం, పార్ల మెంటు అధికారాలను ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా బలోపేతం చేయడం జరిగింది! ఈ పూర్వ రంగంలోనే డాక్టర్ డీడీ బసు సుప్రీంకోర్టును హెచ్చరిస్తూ కనీసం ‘రానున్న రోజుల్లోనైనా’ ప్రజాస్వామ్య విరుద్ధంగా శాసన సభ హక్కుల్ని హరించే ‘అధికరణ-3’లో చేర్చిన తప్పుడు ప్రొవిజోను పరిగణనలోకి తీసుకోవాలని విశిష్టమైన సలహా ఇచ్చారు కూడా! అంతేగాదు, 1955కు ముందున్న ఆ తప్పుడు ప్రొవిజో యూనియన్ పార్లమెంటుకున్న రాజ్యాంగ పరిమితుల్ని కూడా గుర్తు చేస్తోందనీ, ఈ ప్రొవిజో చాటున దాగి పార్లమెంటు ఫెడరల్ వ్యవస్థలో భాగంగా ఉన్న రాష్ట్రాల శాసనసభల ప్రతిపత్తిని కూడా దెబ్బ తీస్తోందనీ డాక్టర్ బసు వ్యాఖ్యానించవలసి వచ్చిం ది. (‘‘బసూస్ కామెంటరీ ఆన్ ది కాన్సిటిట్యూషన్ ఆఫ్ ఇండియా’’ 6వ ముద్రణ: వాల్యూం- ‘ఎ’-1982 పేజి: 176, 177)!
 
 సమగ్రతకే హామీ లేదు
 ‘మన రాజ్యాంగం కింద యూనియన్‌లో భాగమైన రాష్ట్రా ల ప్రాదేశిక / ప్రాంతాల భౌగోళిక సమగ్రతకు గ్యారంటీ లేదని కూడా బసు స్పష్టంగా ప్రకటించాడు! అదే సమ యంలో జమ్మూ-కాశ్మీర్ భూభాగాల్ని/రాష్ర్ట భూభా గంలోని ఒక ప్రాంతాన్ని మార్చాలంటే ఆ రాష్ర్ట శాసనసభ అనుమతి అనివార్యం! అదే సందర్భంగా డాక్టర్ బసు మరొక లొసుగును కూడా బయటపెట్టి ఖండించాల్సి వచ్చింది: రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో ఆయనకు సహాయ, సహకారాలు అందించడానికి మంత్రిమండలి ఉండాలని రాజ్యాంగంలోని 74(1)వ అధికరణ నిర్దేశిస్తు న్నదే గాని - మంత్రి మండలి ఇచ్చే సలహా ప్రకారం మాత్రమే విధిగా నడుచుకోవాలని మన రాజ్యాంగంలోని ఏ ప్రొవిజనూ నిర్దేశించడం లేదని కూడా బసు (కామెం టరీ పే.46) గుర్తు చేశారు! స్వతంత్ర భారత తొలి రాష్ట్ర పతి అయిన డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆనాటి రాజ్యాంగ నిర్ణయ సభలో మాట్లాడుతూ రాష్ట్రపతికి సలహా విషయం లో రాజ్యాంగం మౌనంగా ఉన్నప్పటికీ, ఒక మంచి సం ప్రదాయంగా రాష్ర్టపతిని అన్ని విషయాలలోనూ రాజ్యాం గ ప్రతినిధిగా వ్యవహరించాల్సి వస్తుందన్నాడు! అందుకే పలు విషయాలను రసవత్తరంగా చర్చించిన రాజ్యాంగ నిర్ణయ, సభా చర్చలను, అనుమానం వచ్చినప్పుడల్లా లెజిస్లేటర్లు విధిగా సంప్రతిస్తూ (రిఫర్) ఉండాలని, ‘ఆ సమాచార ఖనిని’ దఫదఫాలుగా శాసనకర్తలు తవ్వు కుంటూ విజ్ఞానవంతులు కావాలనీ రాజ్యాంగ నిపుణుడు ప్రొఫెసర్ ఎంపీ జైన్ సలహా ఇచ్చాడు! నేటి ప్రజాప్రతి నిధులకు ఇవేమీ పట్టవు.
 
 సవరణే ప్రధానం
 దేశ సమగ్రతలో భాగంగా ఏర్పడినవి భాషా రాష్ట్రాలు. తాత్కాలిక ప్రయోజనాల కోసం వాటిని విచ్చిన్నం చేసి, ఫెడరల్ స్ఫూర్తిని ధ్వంసం చేస్తూ విభజించి-పాలించే పాలకపక్షాలను అదుపు చేయడానికి ‘అధికరణ-3’కు స్పష్టమైన సవరణ తీసుకురావాలని 12వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ శాసనసభ (ఈ లోపు పాల కులు అవకాశవాదానికి పాల్పడకపోతే, గీతే) సమావేశాలు తీర్మానం ద్వారా స్పష్టం చేయాలి! 1955కు ముందు ఉన్న రాష్ట్రాల శాసనసభల ‘నిశ్చితాభిప్రాయ ప్రకటన’ను గౌర వించే సంప్రదాయాన్ని పునః ప్రతిష్టించాలని కూడా ఆ తీర్మానంలో పేర్కొనాలి. ‘భాషా రాష్ట్రాల సృష్టి ప్రజాభీష్టా నికే విజయం. ఆంధ్రులకు కన్నడిగులకు, ఒడిశా, మహా రాష్ట్ర ప్రజలకూ కుల, మతాల కన్నా భాష అనేది అత్యంత శక్తిమంతమైన అభివ్యక్తి అన్న విషయం’’ ఏనాడో స్థిర పడిపోయిందన్నాడు ప్రసిద్ధ చరిత్రకారుడు రామ చంద్రగుహ!  

మరిన్ని వార్తలు