ఆదివాసీల అక్షరశిల్పి గిడుగు రామమూర్తి

22 Jan, 2015 02:52 IST|Sakshi
గిడుగు పిడుగు

సందర్భం
  (నేడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు 75వ వర్ధంతి)
 ఆదిమ సవర జాతి గిరి జనుల భాషకు లిపిని, నిఘంటువును రూపొం దించి, తెలుగు వాడుక భాషా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన గిడుగు రామమూర్తి (ఆగస్టు 29, 1863 -జనవరి 22,1940)తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. శ్రీకాకుళం, విజయనగ రం, విశాఖ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో అనేక మంది సవరలు నివసిస్తున్నారు. వారు ఆదిమ నివాసులు. అక్షరజ్ఞానం, బాహ్య సమాజం అంటే తెలియని అమాయకులు. సరైన తిండి, బట్ట లేకు న్నా ప్రత్యేక జీవనసంస్కృతి కలిగిన ప్రపంచం వారిది. గతంలో ఎంతో ఉన్నత విలువలతో జీవిం చిన సవరలు ఆధునిక సమాజంలో వెనుకబడి ఉండటం రామమూర్తిని బాధించింది. బాహ్య ప్రపంచానికి సుదూరంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలోని కొండజాతి సవర తెగ గిరిజనుల ఆర్థిక, జీవన స్థితిగతులను గమనించిన గిడుగు, వారికి సవర భాషలోనే విద్యను అందించాలని భావించడానికి కార ణం వారి వెనుకబాటుతనమే కాదు, వారికున్నచారిత్రక నేపథ్యం కూడా. వీరికి చదువు చెప్పి విజ్ఞానవంతు లను చేయగలిగితే వారి బతుకులు బాగుపడతాయని భావించిన గిడు గు సవర భాషను నేర్చుకున్నారు. వాచకాలు, కథల, పాటల పుస్తకాలు, తెలుగు-సవర, సవర- తెలుగు నిఘంటువులను తయారు చేశారు. వాటిని 1911లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ప్రచు రించింది. ఇందుకు ప్రభుత్వం పారితోషికం ఇవ్వ బోతే, ‘ఆ డబ్బుతో మంచి బడి పెట్టండి, నేను పెట్టిన బడులకు నిధులు ఇవ్వండి!’ అని కోరారు. ఆ ప్రకారమే ప్రభుత్వం శిక్షణా పాఠ శాలలను ప్రారంభించింది.  

 వాడుకభాషను వ్యతిరేకించిన పండితుల రచనలలోని వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను ఎత్తిచూపుతూ 1911-12 మధ్య ఆంధ్ర పండిత భిష క్కుల భాషా భేషజం అనే గ్రంథాన్ని రాశారు. సవర భాషలో ఎ మాన్యు వల్ ఆఫ్ సవర లాంగ్వేజ్ అనే వర్ణనా త్మక వ్యాకరణాన్ని 1930లో రాశారు. సవర జాతికి సంబంధించిన అంశా లను చేర్చి క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియాను రచించిన మానవ శాస్త్రవేత్త ధరస్టన్‌తో రామమూర్తి చర్చించారు. ఆదివాసీల అక్షర శిల్పి గా, సవర లిపి నిర్మాతగా పేరొందిన  గిడుగు  కృషికి మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం 1933లో కైజర్- ఇ- హింద్ బిరుదుతోపాటు బంగారు పతకాన్ని బహూ కరించింది. మద్రాసు గవర్నర్ చిత్రపురానికి వచ్చి ప్రత్యేక దర్బారులో ఈ అవార్డును రామమూర్తికి స్వయంగా అందజేశారు.

 తెలుగు వారు అధికంగా ఉన్న పర్లాకిమిడిని, 200 గ్రామాలను 1935లో అన్యాయంగా ఒడిశా రాష్ట్రంలో చేర్చడాన్ని నిరసించిన గిడుగు.. 22 ఏళ్లుగా పర్లాకిమిడిలో నివసిస్తూ వచ్చిన ఇంటిని వదిలి రాజమండ్రిలో ఉంటున్న తన నాలుగవ కుమారుడి వద్దకు చేరుకున్నారు. 1936లో ఆంధ్ర విశ్వవిద్యాలయం బహూకరించిన కళా ప్రపూర్ణ బిరుదును వ్యవహారిక భాషావాదులందరికీ అంకి తమిస్తున్నట్లు ప్రకటించడం గిడుగువారికే సాధ్య మైంది. గిడుగు ప్రేరణతో అయినా, ప్రభుత్వాలు అంతరించిపోతున్న ఆదివాసీ భాషల్ని, సంస్కృ తుల్ని పరిరక్షించాలి.

గుమ్మడి లక్ష్మీనారాయణ, 
(వ్యాసకర్త ఆదివాసీ రచయితల సంఘం నేత, వరంగల్.  మొబైల్: 9491318409)

మరిన్ని వార్తలు