గ్రహం అనుగ్రహం, ఏప్రిల్ 3, శుక్రవారం, 2015

3 Apr, 2015 02:42 IST|Sakshi

శ్రీమన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు


 చైత్ర మాసం, తిథి శు.చతుర్దశి ప.2.51 వరకు  తదుపరి పౌర్ణమి
 నక్షత్రం ఉత్తర రా.8.25 వరకు  వర్జ్యం ...లేదు


 దుర్ముహూర్తం ఉ.8.24 నుంచి 9.14 వరకు


 తదుపరి ప.12.27 నుంచి 1.17 వరకు


 అమృతఘడియలు ప.12.29 నుంచి 2.04 వరకు
 
 సూర్యోదయం    : 5.58


 సూర్యాస్తమయం:     6.09


 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు 

యమగండం: ప.3.00 నుంచి  4.30 వరకు

భవిష్యం
 
మేషం: కొత్త  పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
 
వృషభం: పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. విద్యార్థులకు శ్రమాధిక్యం.
 
మిథునం: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనుకోని ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఇంటా బయటా చికాకులు. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 
కర్కాటకం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
సింహం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉండొచ్చు. ధనవ్యయం. బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు.
 
కన్య: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
 
తుల: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు ఉండే అవకాశం ఉంది. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.
 
వృశ్చికం: దూరపు బంధువులను కలుసుకుంటారు. విందువినోదాలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
ధనుస్సు: నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి.
 
మకరం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో జాప్యం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
 
కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. దైవదర్శనాలు.
 
మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంఘంలో విశేష గౌరవం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
 - సింహంభట్ల సుబ్బారావు
 

>
మరిన్ని వార్తలు