గ్రహం అనుగ్రహం (మంగళవారం 23, డిసెంబర్ 2014)

23 Dec, 2014 00:53 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (మంగళవారం 23, డిసెంబర్ 2014)

 శ్రీ జయనామ సంవత్సరం, దక్షిణా యనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి శు. పాడ్యమి ఉ.6.11 వరకు, తదుపరి విదియ తె.4.25 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం పూర్వాషాఢ రా.7.51 వరకు, వర్జ్యం ఉ.6.05 నుంచి 7.36 వరకు, తదుపరి తె.3.24 నుంచి 4.54 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం ఉ.8.41 నుంచి 9.31 వరకు, తదుపరి రా.10.39 నుంచి 11.30 వరకు
 అమృతఘడియలు ప.3.16 నుంచి 4.48 వరకు
 
 సూర్యోదయం:    6.29  సూర్యాస్తమయం:   5.26
 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
 యమగండం:  ఉ.9.00 నుంచి   10.30 వరకు

భవిష్యం
 
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపార, ఉద్యోగాలలో అంతగా అనుకూలించదు. దైవదర్శనాలు.
 
వృషభం: మిత్రులే శత్రువులుగా మారతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
 
మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
 
కర్కాటకం: మిత్రులతో సఖ్యత.  విందువినోదాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి ఒత్తిడులు. ధనవ్యయం.
 
కన్య
: బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
 
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆసక్తికరమైన సమాచారం. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
 
వృశ్చికం: కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. విద్యార్థుల యత్నాలు ఫలించవు.
 
ధనుస్సు: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
 
మకరం: పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. శ్రమాధిక్యం.
 
కుంభం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
 
మీనం
: పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.
 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా