గ్రహం అనుగ్రహం ( 02-06-2015 )

2 Jun, 2015 01:18 IST|Sakshi
గ్రహం అనుగ్రహం ( 02-06-2015 )

శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి పౌర్ణమి రా.9.27 వరకు, నక్షత్రం అనూరాధ రా.7.48 వరకు, వర్జ్యం రా.1.31 నుంచి 3.10 వరకు, దుర్ముహూర్తం ఉ.8.04 నుంచి 8.55 వరకు, తదుపరి రా.10.53 నుంచి 11.44 వరకు, అమృతఘడియలు ఉ.9.01 నుంచి 10.34 వరకు
 
సూర్యోదయం    :    5.28
సూర్యాస్తమయం    :    6.26
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి  10.30 వరకు

 భవిష్యం
  మేషం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు.

 వృషభం: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు కొత్త పోస్టులు.

 మిథునం: కాంట్రాక్టర్లకు అనుకూలం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.

 కర్కాటకం: మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.

 సింహం: శ్రమానంతరం పనులు పూర్తి. మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

 కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆలయ దర్శనాలు. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు పదోన్నతులు.

 తుల: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

 వృశ్చికం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

 ధనుస్సు: మిత్రులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు.

 మకరం: కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

 కుంభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

 మీనం: రుణభారాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు  సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు నిరుత్సాహం.
 - సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు