గ్రహం అనుగ్రహం, నవంబర్ 22, 2015

22 Nov, 2015 00:47 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, నవంబర్ 22, 2015

 శ్రీ మన్మథనామ సంవత్సరం
 దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం
 తిథి శు.ఏకాదశి ప.1.04 వరకు, తదుపరి ద్వాదశి
 నక్షత్రం ఉత్తరాభాద్ర ప.12.18 వరకు
 తదుపరి రేవతి
 వర్జ్యం రా.11.26 నుంచి 12.56 వరకు
 దుర్ముహూర్తం సా.3.54 నుంచి 4.44 వరకు
 అమృతఘడియలు ఉ.7.52 నుంచి 9.21 వరకు
 
 సూర్యోదయం    :    6.12
 సూర్యాస్తమయం    :    5.20
 రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
 యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం

మేషం: కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. ఇంటా బయటా సమస్యలు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాల్లో నిరాశ.
 
వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన లాభం. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వస్తు లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
 
మిథునం: ఉద్యోగ యత్నాలు సానుకూలం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 
కర్కాటకం: వ్యవహారాలలో అవరోధాలు రావచ్చు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
 
సింహం: ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు రావచ్చు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
 
కన్య: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆస్తి లాభ సూచనలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
 
తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. వాహన యోగం. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
 
వృశ్చికం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు,ఉద్యోగాలు మందగిస్తాయి.
 
ధనుస్సు: రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. వ్యవహారాలలో అవరోధాలు కలగవచ్చు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.
 
మకరం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
 
కుంభం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
 
మీనం: మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందు వినోదాలు. కార్య జయం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూలం.    - సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు