గ్రహం అనుగ్రహం(24-05-2016)

24 May, 2016 01:48 IST|Sakshi
గ్రహం అనుగ్రహం(24-05-2016)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం, తిథి బ.తదియ తె.5.04 వరకు (తెల్లవారితే బుధవారం)
నక్షత్రం మూల రా.12.08 వరకు,
వర్జ్యం ఉ.7.10 నుంచి 8.50 వరకు
దుర్ముహూర్తం ఉ.8.04 నుంచి 8.55 వరకు, తదుపరి రా.10.50 నుంచి 11.40 వరకు,
అమృతఘడియలు సా.5.20నుంచి 7.01 వరకు
 
సూర్యోదయం    :    5.30
సూర్యాస్తమయం    :    6.24
రాహుకాలం:   ప 3.00 నుంచి 4.30 వరకు
యమగండం:  ఉ.9.00 నుంచి 10.30 వరకు
 

 

భవిష్యం

 

మేషం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. అనారోగ్యం. బంధువులతో తగాదాలు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

 
వృషభం: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు రద్దు కాగలవు. వ్యాపార,ఉద్యోగాలలో నిరుత్సాహమే.

 
మిథునం
: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయట పడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

 
కర్కాటకం
: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక ప్రగతి. వస్తు లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

 
సింహం
: ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో మాట పట్టింపులు. వ్యాపారాలు,ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

 
కన్య
: దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

 
తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

 
వృశ్చికం: మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. బంధువుల కలయిక. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు.

 
ధనుస్సు: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్తహోదాలు.

 
మకరం: మిత్రులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

 
కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార,ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

 మీనం: నూతన పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

 - సింహంభట్ల సుబ్బారావు
 

మరిన్ని వార్తలు