గ్రహం అనుగ్రహం

3 Jul, 2016 03:27 IST|Sakshi
గ్రహం అనుగ్రహం

 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం  ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు  జ్యేష్ఠ మాసం  తిథి బ.చతుర్దశి రా.6.40 వరకు  నక్షత్రం మృగశిర రా.8.32 వరకు  వర్జ్యం ... లేదు
 దుర్ముహూర్తం సా.4.51 నుంచి 5.41 వరకు
 
 సూర్యోదయం    :    5.33
 సూర్యాస్తమయం    :    6.39
 రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
 యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. ఆస్తిలాభం.

 వృషభం: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు. రుణయత్నాలు. పనుల్లో జాప్యం. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.

 మిథునం: పరిచయాలు పెరుగుతాయి. పాత బాకీలందుతాయి. పనుల్లో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అందుతుంది. వ్యాపారవృద్ధి. దైవ దర్శనాలు.

 కర్కాటకం: ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

 సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాలు. ఇంటి నిర్మాణ యత్నాలు చేసే అవకాశం ఉంది. పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

 కన్య: సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. ఆహ్వానాలు అందుతాయి.

 తుల: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.

 వృశ్చికం: కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. అదనపు బాధ్యతలు.

 ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.

 మకరం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. దూరపు బంధువుల కలయిక. వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

 కుంభం: పనులలో స్వల్ప ఆటంకాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. .

 మీనం: పనులలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.  - సింహంభట్ల సుబ్బారావు

 

మరిన్ని వార్తలు