గ్రహం అనుగ్రహం (26-11-16)

26 Nov, 2016 00:42 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (26-11-16)

 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు  కార్తీక మాసం, తిథి బ.ద్వాదశి ఉ.10.20 వరకు, తదుపరి త్రయోదశి
 నక్షత్రం చిత్త ప.3.50 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం రా.10.00 నుంచి 11.48 వరకు, దుర్ముహూర్తం ఉ.6.13 నుంచి 7.43వరకు
 అమృతఘడియలు ఉ.8.55 నుంచి 9.44వరకు
 
సూర్యోదయం    :    6.13
సూర్యాస్తమయం    :    5.20
రాహుకాలం:   ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి  3.00 వరకు

భవిష్యం
మేషం: ఆకస్మిక ధన, వస్తు లాభాలు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. పరిచ యాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

వృషభం: కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. అరుదైన సన్మానాలు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: మిత్రులతో కలహాలు. ఆదాయా నికి మించి ఖర్చులు. శ్రమ ఫలించదు. పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటకం: అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్య తలు మరింత పెరుగుతాయి. దూరప్రయా ణాలు. వృత్తి,వ్యాపారాలలో చికాకులు.

సింహం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగు తాయి. ఆస్తిలాభం. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

కన్య: దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. రాబడికి మించి ఖర్చులు. కుటుంబ సభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఆల యాల సందర్శన. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

వృశ్చికం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. మిత్రులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని సమస్యలు.

ధనుస్సు: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తిలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తుల సేవలకు గుర్తింపు.

మకరం: నూతనోద్యోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం: వ్యయప్రయాసలు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.

మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

- సింహంభట్ల సుబ్బారావు

 

మరిన్ని వార్తలు