గ్రహం అనుగ్రహం (02-01-2017)

2 Jan, 2017 00:01 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (02-01-2017)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం,
హేమంత ఋతువు, పుష్య మాసం.
తిథి శు.చవితి ప.2.15 వరకు,
తదుపరి పంచమి. నక్షత్రం ధనిష్ఠ ప.3.54 వరకు,
తదుపరి శతభిషం. వర్జ్యం రా.11.01 నుంచి 12.37 వరకు.
దుర్ముహూర్తం ప.12.24 నుంచి 1.10 వరకు,
తదుపరి ప.2.36 నుంచి 3.20 వరకు.
అమృత ఘడియలు ఉ.5.24నుంచి 6.56వరకు.



సూర్యోదయం       :    6.33
సూర్యాస్తమయం   :    5.41
రాహుకాలం        : ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం       : ఉ.10.30 నుంచి 12.00 వరకు


భవిష్యం
మేషం: వ్యూహాత్మకంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుం టారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వస్తు లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త ఆశలు.

వృషభం: ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు తీరతాయి. ధార్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాల్లో ఎదురుండదు.

మిథునం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయా ణాలు. మానసిక ఆందోళన.  ఆరోగ్య సమస్యలు. కొన్ని నిర్ణయాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: అనుకోని ప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. అనారో గ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీసేవలకు గుర్తింపు లభిస్తుంది. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి ఏర్పడుతుంది.

తుల: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచ నలు నిలకడగా ఉండవు. కొన్ని కార్యక్రమాలు రద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

వృశ్చికం: కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. విలువైన వస్తువులు జాగ్రత్త. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

ధనుస్సు: కొత్త ఉద్యోగాలలో చేరతారు. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సా హకరంగా ఉంటుంది.

మకరం: రాబడికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. కుటుంబసమస్యలు తప్పవు. ఆరో గ్యం  మందగిస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉండ దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

కుంభం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలో చనలు అమలు చేస్తారు. వస్తులాభాలు. ఇంటర్వూ్యలందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

మీనం: ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు. దేవాలయా లు సందర్శిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.  

 – సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు