గ్రహం అనుగ్రహం (03-08-2016)

2 Aug, 2016 23:59 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (03-08-2016)

శ్రీదుర్ముఖినామ సంవత్సరం దక్షిణాయనం,
వర్ష ఋతువు శ్రావణ మాసం
తిథి శు.పాడ్యమి రా.1.44 వరకు,
నక్షత్రం ఆశ్లేష రా.3.01 వరకు,
వర్జ్యం ప.3.44 నుంచి 5.21 వరకు,
దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.31 వరకు,
అమృతఘడియలు రా.1.25 నుంచి 3.02 వరకు
 
 
 
సూర్యోదయం    :    5.43
సూర్యాస్తమయం    :    6.35

 రాహుకాలం :  ప 12.00 నుంచి 1.30 వరకు
 యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
 

భవిష్యం

మేషం: పనులు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పని భారం కలుగుతుంది.

వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మిథునం: కుటుంబ సమస్యలు. ఆదాయానికి మించి ఖర్చులు. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

సింహం: వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

తుల: నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది.

ధనుస్సు: శ్రమాధిక్యం. పనుల్లో తొందర పాటు ఉండవచ్చు. బంధువులు, మిత్రులతో మాట పట్టింపులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.

మీనం: వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ప్రయాణాలు రద్దు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

 - సింహంభట్ల సుబ్బారావు

 

>
మరిన్ని వార్తలు